News
News
X

5G Launch India: 5G సేవల్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ, ఇండియన్ మొబైల్ కాంగ్రెస్‌లో ఆవిష్కరణ

5G Launch India: 5G సేవల్ని ప్రధాని నరేంద్ర మోదీ అధికారికంగా ప్రారంభించనున్నారు.

FOLLOW US: 
 
5G Launch India: 

ఢిల్లీ వేదికగా..

ప్రధాని నరేంద్ర మోదీ రేపు (అక్టోబర్ 1వ తేదీన) అధికారికంగా 5G సేవలు ప్రారంభించనున్నారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్ వేదికగా ఈ కార్యక్రమం జరగనుంది. ఇదే సమయంలో Indian Mobile Congress (IMC) ఆరో ఎడిషన్‌నూ ప్రారంభిస్తారు. IMC 2022, అక్టోబర్ 1 నుంచి 4వ తేదీ వరకూ కొనసాగనుంది. "న్యూ డిజిటల్ యూనివర్స్" థీమ్‌తో ఈ సారి ఈవెంట్స్ జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో వ్యాపారవేత్తలు, ఆవిష్కర్తలు, ప్రభుత్వ అధికారులు పాల్గొంటారు. కొత్తగా వస్తున్న టెక్నాలజీపై చర్చిస్తారు. వాటిని అందిపుచ్చుకునేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలో అభిప్రాయాలు పంచుకుంటారు. కొత్త అవకాశాలు సృష్టించేందుకూ...ఈ ఇండియన్ మొబైల్ కాంగ్రెస్..వేదికగా మారనుంది. 
డిజిటల్ టెక్నాలజీపై ఈ సారి ఎక్కువగా ఫోకస్ పెట్టనున్నారు. గతంలో కేంద్ర ఐటీ మంత్రి అశ్వినీ వైష్ణవ్ 5G సర్వీస్‌లపై కీలక ప్రకటన చేశారు. అక్టోబర్ 12వ తేదీ నుంచి భారత్‌లో 5G సేవలు మొదలవుతాయని చెప్పారు. అందుకు తగ్గట్టుగానే...ఇప్పుడు ప్రధాని మోదీ రేపు ఈ సేవల్ని అధికారికంగా ప్రారంభించనున్నారు.

కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యే 5జీ స్పెక్ట్రమ్‌ వేలం నిర్వహించింది. 2017లో తొలిసారి ఐదవ తరం (5G) వాయు తరంగాలను వేలం వేయాలని ప్రభుత్వం ఎంతగానో ప్రయత్నించింది. ధరలు ఎక్కువగా ఉన్నాయని భావించిన టెలికాం కంపెనీలు ఇందుకు దూరంగా ఉన్నాయి. ఈసారి రూ.4.3 లక్షల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేసినా చివరికు  రూ. 1.5 లక్షల కోట్లకు వాయు తరంగాలను విక్రయించింది. ఇటీవలి స్పెక్ట్రమ్ బిడ్‌లు అనేక విధాలుగా విజయవంతం అయ్యాయి. ఎందుకంటే 2017లో 3000 MHz బ్యాండ్‌లలో 5G ఎయిర్‌వేవ్‌ ప్రతిపాదిత విక్రయం పూర్తవ్వలేదు.  800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz, 2500 మెగాహెర్జ్ బ్యాండ్ (megaherzt) స్పెక్ట్రమ్ అమ్ముడవ్వలేదు. దాంతో వేలాన్ని వాయిదా వేయాలని టెలికాం కంపెనీలు పోరాడగా TRAI సంప్రదింపులు జరిపి విజయవంతం చేసింది.

News Reels

రికార్డు స్థాయిలో బిడ్‌లు..

ప్రభుత్వం గతేడాది మార్చిలో 5G స్పెక్ట్రమ్ బిడ్‌లను ప్రారంభించినా మొత్తం స్పెక్ట్రమ్‌లో కేవలం 37 శాతాన్ని మాత్రమే విక్రయించగలిగింది. కేవలం రూ.77,815 కోట్లను మాత్రమే ఆర్జించింది. 700 MHz, 2500 MHz బ్యాండ్‌ల ధర అతిగా ఉందని భావించడంతో లాభాల్లో ఉన్న 
రిలయన్స్ జియో సైతం కొనుగోలు చేయలేదు.  రెండు వారాల క్రితం నిర్వహించిన స్పెక్ట్రమ్ వేలం మాత్రం విజయవంతమైంది. తొలిసారి 700 MHz స్పెక్ట్రమ్‌ను సైతం విక్రయించగలిగింది. దాంతో గతేడాదితో కన్నా రెట్టింపు, రూ. 1.5 లక్షల కోట్లను ఆర్జించింది. 51 GHz స్పెక్ట్రమ్‌తో పాటు 
మొత్తం 72 GHz ఎయిర్‌వేవ్‌లలో 71 శాతాన్ని 22 టెలికాం సర్కిళ్లలో  రూ.1.5 లక్షల కోట్లకు ($19 బిలియన్) విక్రయించడం దూకుడైన చర్యేనని యూబీఎస్‌ అంచనా వేసింది. '2-3 ఏళ్లుగా దశల వారీగా కాకుండా ఒకేసారి దేశవ్యాప్తంగా 3300MHz కొనుగోలు చేసిన టెలికాం ఆపరేటర్ల వ్యూహాన్ని మేము అర్థం చేసుకున్నాం. ఖరీదైన 700MHz బ్యాండ్‌లో 10MHz స్పెక్ట్రమ్‌ను జియో దేశవ్యాప్తంగా కొనుగోలు చేయడం ఆశ్యర్యం కలిగించింది' అని యూబీఎస్‌ తెలిపింది.

Also Read: Kanpur News: హాస్టల్‌లో బాలికల న్యూడ్ వీడియోలు రికార్డ్ చేసిన స్వీపర్!

Published at : 30 Sep 2022 04:53 PM (IST) Tags: PM Modi 5G Launch 5G services 5G Launch India Indian Mobile Congress Indian Mobile Congress 2022 IMC 2022

సంబంధిత కథనాలు

Parliament Winter Session: పార్లమెంటు శీతాకాల సమావేశాలకు రాహుల్ గాంధీ దూరం

Parliament Winter Session: పార్లమెంటు శీతాకాల సమావేశాలకు రాహుల్ గాంధీ దూరం

Iran Anti Hijab Protest: తప్పులు దిద్దుకుంటున్న ఇరాన్ ప్రభుత్వం, మొరాలిటీ పోలీస్‌ వ్యవస్థ రద్దు

Iran Anti Hijab Protest: తప్పులు దిద్దుకుంటున్న ఇరాన్ ప్రభుత్వం, మొరాలిటీ పోలీస్‌ వ్యవస్థ రద్దు

KTR Letter To Youth: తెలంగాణలో కొలువుల కుంభమేళా! రాష్ట్ర యువతకు మంత్రి కేటీఆర్ ఆత్మీయ లేఖ

KTR Letter To Youth: తెలంగాణలో కొలువుల కుంభమేళా! రాష్ట్ర యువతకు మంత్రి కేటీఆర్ ఆత్మీయ లేఖ

Congress: అన్న బాటలో సోదరి ప్రియాంక గాంధీ- ఇక పాదయాత్రతో ప్రజల్లోకి!

Congress: అన్న బాటలో సోదరి ప్రియాంక గాంధీ- ఇక పాదయాత్రతో ప్రజల్లోకి!

Hair transplant Side Effect: జుట్టు కోసం వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న యువకుడు, సర్జరీ చేయించుకునే ముందు కాస్త జాగ్రత్త

Hair transplant Side Effect: జుట్టు కోసం వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్న యువకుడు, సర్జరీ చేయించుకునే ముందు కాస్త జాగ్రత్త

టాప్ స్టోరీస్

CM KCR: మహహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్, ఎవ్వరూ 1000 ఏళ్లు బతకరని కామెంట్

CM KCR: మహహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌‌ను ప్రారంభించిన సీఎం కేసీఆర్, ఎవ్వరూ 1000 ఏళ్లు బతకరని కామెంట్

Varisu Second Single : విజయ్ 'వారసుడు' సాంగ్ వచ్చేసింది - డ్యాన్స్ ఇరగదీసిన శింబు

Varisu Second Single : విజయ్ 'వారసుడు' సాంగ్ వచ్చేసింది - డ్యాన్స్ ఇరగదీసిన శింబు

Baba Vanga: భయం గొలుపుతున్న బాబా వంగా ప్రిడిక్షన్స్ - 2023లో ఇన్ని అనర్థాలా?

Baba Vanga: భయం గొలుపుతున్న బాబా వంగా ప్రిడిక్షన్స్ - 2023లో ఇన్ని అనర్థాలా?

iQoo 11 Launch: ఐకూ 11 సిరీస్ లాంచ్ ఈ నెలలోనే - వివో టాప్ ఫోన్లతో పోటీ!

iQoo 11 Launch: ఐకూ 11 సిరీస్ లాంచ్ ఈ నెలలోనే - వివో టాప్ ఫోన్లతో పోటీ!