అన్వేషించండి

Corona Cases in AP: ఏపీలో కొత్తగా 3 కరోనా కేసులు - తెలుగు రాష్ట్రాలను భయపెడుతున్న వైరస్

Corona Cases: తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. హైదరాబాద్ లో ఓ 14 నెలల చిన్నారికి కరోనా నిర్ధారణ కాగా, ఏపీలోనూ కొత్తగా 3 కేసులు నమోదయ్యాయి. దీంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు.

Corona Cases in Telugu States: కనుమరుగైందనుకున్న కరోనా మళ్లీ పంజా విసురుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు వెలుగుచూస్తుండడంతో ఆందోళన నెలకొంది. నిన్నటి వరకూ కరోనా కేసులే లేని ఏపీలోనూ తాజాగా 3 కేసులు వెలుగుచూశాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో తొలి కొవిడ్ కేసు నమోదైంది. 85 ఏళ్ల వృద్ధురాలికి కొవిడ్ సోకినట్లు సమాచారం. అప్రమత్తమైన వైద్యాధికారులు శాంపిల్ ను జీనోమ్ సీక్వెన్స్ ల్యాబ్ కు పంపించారు. ఏలూరులోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీ వైద్యునికి సైతం కొవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. వేరియంట్ నిర్ధారణ కోసం శ్వాబ్ ను హైదరాబాద్ జినోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్ కు పంపారు. అయితే, ఆందోళన చెందాల్సిన పని లేదని పాజిటివ్ వచ్చిన వ్యక్తికి ఎలాంటి లక్షణాలు లేవని డీఎం అండ్ హెచ్ఓ తెలిపారు. పాజిటివ్ వ్యక్తి వేరే ఇతర రాష్ట్రాలకు ఎక్కడా ప్రయాణం చేయలేదని స్పష్టం చేశారు. 

తెలంగాణలోనూ కొత్తగా 6 కేసులు

తెలంగాణలోనూ కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. దేశవ్యాప్తంగా న్యూ వేరియంట్ జేఎన్ 1 వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేసులు నమోదు ఆందోళన కలిగిస్తోంది. కొత్తగా 6 కేసులు నమోదు కాగా, హైదరాబాద్ లో 4, మెదక్ లో 1, రంగారెడ్డిలో ఒక కరోనా కేసులు వెలుగుచూశాయి. ఇప్పటివరకూ 20 కేసులు నమోదయ్యాయి. ఒక్క హైదరాబాద్ లోనే 16 కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 19 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఒకరు రికవరీ అయ్యారు. ఇప్పటివరకూ 925 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. 

14 నెలల చిన్నారికి

హైదరాబాద్ లోని నిలోఫర్ ఆస్పత్రిలో తొలి కొవిడ్ కేసు నమోదైంది. నాలుగైదు రోజుల క్రితం నాంపల్లి ఆగాపుర ప్రాంతానికి చెందిన 14 నెలల చిన్నారికి తీవ్ర జ్వరం, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బంది పడుతుండడంతో నిలోఫర్ ఆస్పత్రికి తీసుకువచ్చారు. అనంతరం అనుమానంతో వైద్యులు పరీక్షలు నిర్వహించగా కొవిడ్ పాజిటివ్ నిర్దారణ అయ్యింది. ప్రస్తుతం చిన్నారిని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య మెరుగైందని, వెంటిలేటర్ తొలగించి ఆక్సిజన్ సాయంతో చికిత్స అందిస్తున్నట్లు ఆస్పత్రి వైద్యాధికారి శ్రీనివాస్ కల్యాణి తెలిపారు. కొవిడ్ కొత్త వేరియంట్ పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్క్ ధరించి జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

అప్రమత్తమైన సిబ్బంది

కరోనా కేసుల నేపథ్యంలో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. ఎంజీఎం సిబ్బంది మాస్క్ లేనిదే ఆస్పత్రిలోకి అనుమతించడం లేదు. కొవిడ్ బాధితులకు ప్రత్యేక వార్డుల్లో చికిత్స అందిస్తున్నారు. అటు, గాంధీ ఆస్పత్రిలో కొవిడ్ బాధితులకు చికిత్స అందించేందుకు 50 పడకలు సిద్ధం చేసినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. వెంటిలేటర్లు, ఆక్సిజన్, మాస్కులు, శానిటైజేషన్, డిస్పోజబుల్ బెడ్ షీట్స్ రెడీగా ఉంచినట్లు చెప్పారు. చెస్ట్ ఆస్పత్రిలో 20 పడకలతో ప్రత్యేక వార్డు అందుబాటులో ఉంచారు. ఆ పడకలకు ఆక్సిజన్ సదుపాయంతో పాటు మహిళలు, పురుషులకు వేర్వేరుగా ఏర్పాటు చేసినట్లు సూపరింటెండెంట్ మహబూబ్ ఖాన్ వెల్లడించారు. 

ఏపీలోనూ

కరోనా కొత్త వేరియంట్ జేఎన్ 1పై కేంద్ర ప్రభుత్వ హెచ్చరికల నేపథ్యంలో ఏపీలోనూ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. రాష్ట్రంలో కొత్తగా 3 కేసులు వెలుగుచూడడంతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు (Krishnababu) అన్నారు. గ్రామ, వార్డు సచివాలయ స్థాయిలో ఉన్న విలేజ్ క్లినిక్స్ అన్నింటికీ యాంటీజెన్ టెస్ట్ కిట్స్ ఇప్పటికే అందజేశామని, అక్కడ ఏదైనా పాజిటివ్ నిర్ధారణ అయితే, దానిని ఆర్టీపీసీఆర్ టెస్టుకు పంపేందుకు వీలుగా రాష్ట్రంలోని 11 వైద్య కళాశాలల్లో పరీక్షలకు అవసరమైన సౌకర్యాలు సిద్ధంగా ఉంచామన్నారు. అక్కడ కూడా పాజిటివ్ అని తేలితే విజయవాడలోని జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపి వేరియంట్ ను గుర్తించి వైరస్ వ్యాప్తి నిరోధానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Also Read: Telangana News: సంక్రాంతికి ఊరెళ్తున్నారా.? - ప్రయాణికులకు గుడ్ న్యూస్, 20 ప్రత్యేక రైళ్ల ప్రకటన

టాప్ హెడ్ లైన్స్

FIFA World Cup 2026 Prize Money: ఫైనల్లో ఓడిన అర్జెంటీనాకు 318 కోట్ల ప్రైజ్‌మనీ.. వరల్డ్ కప్ విన్నర్ స్పెయిన్ ఎంత గెలుచుకుంది
ఫైనల్లో ఓడిన అర్జెంటీనాకు 318 కోట్ల ప్రైజ్‌మనీ.. వరల్డ్ కప్ విన్నర్ స్పెయిన్ ఎంత గెలుచుకుంది
Spain FIFA World Cup Glory: స్పెయిన్ డ‌బుల్ ధ‌మాకా.. రెండోసారి వ‌ర‌ల్డ్ చాంపియ‌న్ గా నిలిచిన స్పానిష్ టీమ్.. ఈ కార‌ణాల‌తోనే ఫైన‌ల్లో అర్జెంటీనా ఓట‌మి..!
స్పెయిన్ డ‌బుల్ ధ‌మాకా.. రెండోసారి వ‌ర‌ల్డ్ చాంపియ‌న్‌గా.. ఫైన‌ల్లో అర్జెంటీనా ఓట‌మికి కారణాలివే !
IND VS ENG 3rd Result Update: వ‌న్డే సిరీస్ ఇంగ్లాండ్ దే.. మూడో వ‌న్డేలో స్ట‌న్నింగ్ విక్ట‌రీ, రోహిత్ సెంచ‌రీ వృథా, రాణించిన గిల్, కోహ్లీ, 
వ‌న్డే సిరీస్ ఇంగ్లాండ్ దే.. మూడో వ‌న్డేలో స్ట‌న్నింగ్ విక్ట‌రీ, రోహిత్ సెంచ‌రీ వృథా, రాణించిన గిల్, కోహ్లీ
Breaking News: లార్డ్స్ వన్డేలో భారత్ ఓటమి.. 2-1 తేడాతో సిరీస్ దక్కించుకున్న ఇంగ్లాండ్
లార్డ్స్ వన్డేలో భారత్ ఓటమి.. 2-1 తేడాతో సిరీస్ దక్కించుకున్న ఇంగ్లాండ్

వీడియోలు

Washington Sundar Ruled Out, Harsh Dubey In | మ్యాచ్ ముందే మారిన టీమిండియా స్క్వాడ్
Ashwin Comments On Hitman Retirement | రోహిత్ రిటైర్మెంట్ రూమర్స్ పై అశ్విన్ కామెంట్స్
FIFA's Shocking Decision For World Cup Final | ఫిఫాలో వరల్డ్ కప్ ట్రోఫీతో పాటు బంగారు ఉంగరాలు
National Award for Committee Kurrollu | మెగా డాటర్ చిత్రానికి నేషనల్ అవార్డ్
Kohli vs Gambhir Fight Rumors ODI | గంభీర్‌తో గొడవపడి కోహ్లీ హోటల్ వీడాడా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
UA Iran Conflict: ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్
ఒకర్ని అరెస్ట్ చేస్తే బెదరడానికి మాది వెనిజులా కాదు: ట్రంప్ దూతకు ఇరాన్ మంత్రి షాక్
Hyderabad Crime News: పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
పోలీస్ అకాడమీలో లైంగిక వేధింపులు.. గదిలో బంధించి, కత్తితో బెదిరించి దారుణం
Tammineni Sitaram: నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
నకిలీ డెత్ సర్టిఫికేట్‌తో భూ కబ్జాకు యత్నం.. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంపై కేసు నమోదు
Messi VS Spain Strategy: మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పెయిన్!
మెస్సిని కట్టడి చేయడానికి స్పెయిన్ సూప‌ర్బ్ వ్యూహం.. గతంలోని జర్మనీ మాస్టర్ ప్లాన్ ను అమలు చేయనున్న స్పానిష్ టీమ్!
Salman Khan : బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
బాలీవుడ్ కండల వీరుడికి ఏమైంది? - అలా మారిపోయారేంటి?... వీడియో వైరల్
Asifabad News: భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
భూములు లాక్కుంటే సుప్రీం కోర్టుకు.. అధికారులపై అట్రాసిటీ కేసులు పెడుతం: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
PV Sindhu Wins Japan Open: టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
టైటిల్ కరవుకు పీవీ సింధు ఎండ్ కార్డ్..  యామగూచిని చిత్తు చేసి హిస్టారికల్ విక్టరీ, జపాన్ ఓపెన్ కైవసం
Normal Fever vs Dengue: ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
ప్రతి జ్వరం డెంగ్యూ కాదు... వర్షాకాలంలో వచ్చే ఈ అనారోగ్య సమస్యను ఇలా గుర్తించాలి
Embed widget