1st Covid 19 Case: కరోనా పుట్టుకపై కొత్త అధ్యయనం.. తొలి కొవిడ్ కేసు అక్కడేనట!
ప్రపంచంలో తొలి కరోనా కేసు వుహాన్‌లోని మాంస విక్రయ కేంద్రంలోని ఓ వ్యాపారికి వచ్చినట్లు తాజా అధ్యయనంలో తేలింది.
కరోనా మహమ్మారి వచ్చి ఏడాది గడుస్తోన్న ఇప్పటికీ వైరస్ పుట్టుకపై కచ్చితమైన వివరాలు లేవు. అయితే భారత్ సహా ప్రపంచదేశాలు కరోనా చైనాలోని వుహాన్‌లోనే పుట్టిందని గట్టిగా నమ్ముతున్నాయి. అయితే తాజాగా దీనిపై మరో అధ్యయనం ఆసక్తికర విషయాలు బయటపెట్టింది. వుహాన్ నగరంలో ఉన్న జంతువుల మార్కెట్‌లో వ్యాపారే తొలి కరోనా కేసుగా ఈ అధ్యయనం తెలిపింది.
ఏది నిజం?
కరోనా వ్యాప్తి తొలినాళ్లలో వైరస్ వుహాన్‌లోని జంతువుల మాంస విక్రయ కేంద్రం నుంచి వచ్చిందని కొందరు వాదించారు. మరి కొందరు వుహాన్‌లోని వైరాలజీ ల్యాబ్‌లో కృత్రిమంగా సృష్టించారన్నారు. వీటిపై నిజాలు తెలియజేసేందుకు చేసిన ఓ అధ్యయనం వివరాలు ప్రముఖ జర్నల్ సైన్స్ మ్యాగజైన్‌లో ప్రచురితమయ్యాయి.
నాలుగు వారాలు..
చైనా శాస్త్రవేత్తలతో కలిపి డబ్ల్యూహెచ్ఓ నిపుణుల కమిటీ నాలుగు వారాల పాటు వుహాన్ నగరంలో పరిశోధనలు చేసింది. కరోనా వైరస్ గబ్బిలాల నుంచి ఇతర జంతువులకు వ్యాప్తి చెంది అనంతరం మనుషులకు వచ్చినట్లు ఈ కమిటీ చివరకు తేల్చింది. అయితే దీనిపై మరింత అధ్యయనం చేయాల్సి ఉందని పేర్కొంది. ఈ మేరకు 2021 మార్చిలో నివేదిక సమర్పించింది.
తొలి కేసు ఆది కాదు..
కరోనా తొలి కేసు 2020, డిసెంబర్ 16న నమోదైనట్లు చాలామంది చెబుతున్నారు. అకౌంటెంట్‌గా పనిచేసే ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు వచ్చిన చాలా రోజులకు ఆసుపత్రికి వెళ్లగా అదే తొలి కరోనా కేసుగా గుర్తించారు. ఈ మేరకు అరిజొనా యూనివర్సిటీలోని ఎకోలజీ, ఎవల్యూషనరీ బయోలజీ హెడ్ మిచేల్ వారొబే తెలిపారు.
అయితే అంతకంటే ముందే ఓ సీ ఫుడ్ వ్యాపారి కరోనా లక్షణాలతో ఆసుపత్రికి వచ్చినట్లు డబ్ల్యూహెచ్ఓ గుర్తించిన కరోనా మహమ్మారిపై అధ్యయనం చేస్తోన్న నిపుణులు వెల్లడించారు. ఆ సీడ్ వ్యాపారికి డిసెంబర్ 11నే ఈ లక్షణాలు ఉన్నట్లు ఈ అధ్యయనంలో తేలింది.
Also Read: Farm Laws Repeal Political Reaction: 'ఇది మరో సత్యాగ్రహం.. అహంకారంపై రైతులు సాధించిన విజయం'
Also Read: Farm Laws Repeal: ఏబీపీ-సీఓటర్ సర్వే బీజేపీని భయపెట్టిందా? 'జీరో' వెంటాడిందా?
Also Read: Allahabad High Court: దేశంలో ఉమ్మడి పార స్మృతి అవసరం.. హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
Also Read: Rakesh Tikait: రాకేశ్ టికాయత్.. అలుపెరుగని యోధుడు.. అన్నదాతను నడిపించిన నాయకుడు!
Also Read: Breaking News LIVE: ప్రధాని మోదీ సంచలన నిర్ణయం.. నూతన సాగు చట్టాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటన
Also Read: Farm Laws: జై కిసాన్.. ఏం చేస్తిరి.. ఏం పోరాటం చేస్తిరి.. అన్నదాత నీకు 'దేశం' సలాం
Also Read: 3 Farm Laws Repealed: మోదీ తలవంచారా? ఇది ఎన్నికల వ్యూహమా? రైతుల విజయమా?