Gen Bipin Rawat's funeral : త్రిదళాధిపతికి భారత ప్రజల కన్నీటి వీడ్కోలు - 17గన్ సెల్యూట్ సమర్పించిన సైన్యం !
జనరల్ బిపిన్ రావత్‌కు యావత్ భారతం భారమైన హృదయంతో కన్నీటి వీడ్కోలు పలికింది. 17 గన్ సెల్యూట్‌ను సైన్యం సమర్పించి గౌరవించింది.
తమిళనాడు హెలికాఫ్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సీడీఎస్ బిపిన్ రావత్ దంపతుల అంత్యక్రియలు ఢిల్లీలోపూర్తి సైనిక లాంఛనాలతో పూర్తయ్యాయి. సీడీఎస్ రావత్ కు ఆర్మీ 17 గన్ సెల్యూట్ చేసింది. ఫ్రంట్ ఎస్కార్ట్ గా 120 మంది త్రివిధ దళ సభ్యులు వ్యవహరించారు. 800 మంది సర్వీస్ మెన్ అంత్యక్రియలో పాల్గొన్నారు. సీడీఎస్ రావత్ కు ఆర్మీ గౌరవ వీడ్కోలు పలికింది.
ఆర్మీ ఆస్పత్రి నుంచి రావత్ దంపతుల భౌతికకాయాలను ఇంటికి తీసుకొచ్చారు. ఆ తర్వాత ప్రజల సందర్శనార్థం ఉంచారు. రావత్ దంపతులకు రావత్ దంపతుల భౌతికకాయాలకు ఆర్మీ, రాజకీయ, న్యాయ ప్రముఖులు నివాళులర్పించారు. తర్వాత కామ్‌రాజ్ మార్గ్ నుంచి బ్రార్ స్క్వేర్ శ్మశాన వాటిక వరకు అంతిమయాత్ర సాగింది. రెండు గంటలపాటు సాగిన అంతిమయాత్రలో దారి పొడవునా ప్రజలు రావత్ కు కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు. హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందిన బిపిన్ రావత్, ఆయన సతీమణి మధూలికరావత్‌కు భారతీయులంతా కన్నీటితో వీడ్కోలు పలికారు. బిపిన్ రావత్ కుమార్తె అంత్యక్రియలు నిర్వహించారు.
Also Read: CDS Chopper Black Box: పేరుకే 'బ్లాక్ బాక్స్'.. కానీ కలర్, కథ వేరుంటది.. నిజం తేలాలంటే ఇదే కావాలి!
ప్రోటోకాల్ ప్రకారం సీనియర్ అధికారులు చనిపోయినప్పుడు ఆర్మీ గన్ సెల్యూట్ సమర్పిస్తుంది. భారత రాష్ట్రపతి, మిలిటరీ, సీనియర్ అధికారులు చనిపోయినప్పుడు.. 21 గన్ సెల్యూట్ నిర్వహిస్తారు. అంటే గాల్లోకి 21 సార్లు కాల్పులు జరిపి వందనం సమర్పిస్తారు. త్రివిధ దళాల్లో పని చేసిన సీనియర్ ఆఫీసర్లు మరణిస్తే 17 గన్ సెల్యూట్ సమర్పిస్తారు.
అంత్యక్రియల కంటే ముందే ఆర్మీ హెలికాప్టర్ ఎంఐ-17 వీ5 కూలిన ఘటనలో అసంబద్ధ ప్రచారాలు జరుగుతున్నట్లు వాయుసేన తన ట్విట్టర్‌లో అసంతృప్తి వ్యక్తం చేసింది. నిరాధార ఆరోపణలను ఆపేయాలని ఆ ట్వీట్‌లో ఐఏఎఫ్ కోరింది. త్వరలోనే ప్రమాద ఘటనకు చెందిన వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పింది. రావత్ దంపతులతో పాటు రక్షణదళ సిబ్బంది మృతి పట్ల త్రివిధదళ దర్యాప్తు చేపట్టారు. త్వరితగతిన ఈ ఘటన పట్ల విచారణను పూర్తి చేయనున్నట్లు ఐఏఎఫ్ తెలిపింది. దీని కోసం దర్యాప్తు కమిటీని కూడా ఏర్పాటు చేసినట్లు ఐఏఎఫ్ చెప్పింది.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి