అన్వేషించండి

వేసవికి ఊళ్లకు వెళ్లేవాళ్లకు గుడ్ న్యూస్- దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 15 అదనపు రైళ్లు

15 Additional Trains For Summer : ప్రయాణీకులు తాకిడితో దక్షిణ మధ్య రైల్వే జోన్‌ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 15 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.

South Central Railway Special Trains: వేసవి ప్రయాణికులతో రైళ్లు ఫుల్ అయిపోయాయి. ఏ ట్రైన్ చూసినా డిక్లైన్ చూపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ట్రైన్‌లో వెళ్లడమంటే సాహసమే అని చెప్పాలి. ఈ రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక ట్రైన్స్‌ వేస్తోంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 15 రైళ్లను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. 

రైల్వే ప్రయాణీకులు తాకిడి నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే జోన్‌ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రయాణీకుల సంఖ్యకు అనుగుణంగా రైళ్ల సంఖ్యను పెంచారు. 15 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తున్నట్టు రైల్వే అధికారులు వెల్లడించారు. వేసవిలో పెరుగుతున్న ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రత్యేక రైళ్లు మే ఒకటో తేదీ నుంచి ఆగస్టు రెండో తేదీ వరకు షెడ్యూల్‌ వారీగా రాకపోకలు కొనసాగిస్తాయని అధికారులు తెలిపారు. పాట్నా - సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ - పాట్నా, దనపూర్‌ - సికింద్రాబాద్‌, దనపూర్‌ - బెంగుళూరు వంటి స్టేషన్ల మధ్య ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. రైళ్లు, రిజర్వేషన్‌ వివరాలకు ఎస్‌సీఆర్‌ వెబ్‌సైట్‌ను సంప్రదించాలని అధికారులు సూచించారు. 

ప్రయాణీకులకు ఎంతో మేలు

దక్షిణ మధ్య రైల్వే అధికారులు అదనంగా ఏర్పాటు చేస్తున్న రైళ్ల వల్ల ప్రయాణీకులకు ఎంతో మేలు కలుగనుంది. వేసవి సెలవులు నేపథ్యంలో అనేక ప్రాంతాలకు, టూర్లకు వెళ్లే వారి సంఖ్య అధికంగా ఉంటుంది. అందుకు అనుగుణంగా రైళ్లు లేకపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రయాణీకుల ఇబ్బందులను గుర్తించిన దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తోంది. అదనంగా 15 రైళ్లను నడపాలని నిర్ణయించడం వల్ల వేలాది మంది ప్రయాణీకులు సాఫీగా ప్రయాణం సాగించేందుకు అవకాశం కలుగుతుంది. ప్రతిరోజూ వందలాది మంది ఆయా ప్రాంతాలు గుండా ప్రయాణాలు సాగించడానికి అనువుగా ఈ నిర్ణయం దోహదం చేస్తుందని అధికారులు వెల్లడిస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Railway Projects In AP and Telangana: రూ.10,021 కోట్లతో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు పరిధిలో 5 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులు
రూ.10,021 కోట్లతో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు పరిధిలో 5 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులు
US Divorce Decree: అమెరికాలో విడాకులు భారత్‌లో చెల్లవు.. సాకేత్ కోర్టు సంచలన తీర్పు
అమెరికాలో విడాకులు భారత్‌లో చెల్లవు.. సాకేత్ కోర్టు సంచలన తీర్పు
Vallabhaneni Vamsi: కూటమి ప్రభుత్వంపై వల్లభనేని వంశీ తీవ్ర ఆరోపణలు.. ఏసీపీ దామోదర్‌పై విజయవాడ సీపీకి ఫిర్యాదు
కూటమి ప్రభుత్వంపై వల్లభనేని వంశీ తీవ్ర ఆరోపణలు.. ఏసీపీ దామోదర్‌పై విజయవాడ సీపీకి ఫిర్యాదు
Union Cabinet Decisions: 7 రైల్వే కారిడార్లలో 4 లేన్ల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం.. తెలుగు రాష్ట్రాల్లో రైల్వే లేన్లు ఇవే
7 రైల్వే కారిడార్లలో 4 లేన్ల నిర్మాణానికి కేంద్రం ఆమోదం.. తెలుగు రాష్ట్రాల్లో రైల్వే లేన్లు ఇవే

వీడియోలు

Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్
KL Rahul Retained By Delhi Capitals IPL 2027 | ఢిల్లీలోనే కేఎల్ రాహుల్.. రూమర్లకు ఎండ్ కార్డ్
Duleep Trophy Final 2026 Vaibhav | దులీప్ ట్రోఫీ ఫైనల్ లో వైభవ్ మైండ్ గేమ్
Gundenininda Gudigantalu Serial September 9 | రోహిణిని బ్లాక్‌మెయిల్ చేసిన గుణ
Ishan Kishan 270 In Duleep Trophy Final | డబుల్ సెంచరీ వెనుక రహస్యాన్ని చెప్పిన ఇషాన్ కిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maremma Review - 'మారెమ్మ' రివ్యూ: రవితేజ సోదరుని కుమారుడు ఎలా నటించాడు? డెబ్యూ సినిమా హిట్టా? ఫట్టా?
'మారెమ్మ' రివ్యూ: రవితేజ సోదరుని కుమారుడు ఎలా నటించాడు? డెబ్యూ సినిమా హిట్టా? ఫట్టా?
YS Jagan Padayatra: పాదయాత్ర 2.0పై వైసీపీ అధినేత జగన్ కీలక ప్రకటన, స్థానిక ఎన్నికలపై నేతలకు సూచనలు
పాదయాత్ర 2.0పై వైసీపీ అధినేత జగన్ కీలక ప్రకటన, స్థానిక ఎన్నికలపై నేతలకు సూచనలు
CM Chandrababu: వచ్చే ఏడాది మార్చి నాటికి భూసమస్యలకు పరిష్కారం.. బెస్ట్ టెక్నాలజీతో పాస్ పుస్తకాలు - సీఎం చంద్రబాబు
వచ్చే ఏడాది మార్చి నాటికి భూసమస్యలకు పరిష్కారం.. బెస్ట్ టెక్నాలజీతో పాస్ పుస్తకాలు - సీఎం చంద్రబాబు
US Divorce Decree: అమెరికాలో విడాకులు భారత్‌లో చెల్లవు.. సాకేత్ కోర్టు సంచలన తీర్పు
అమెరికాలో విడాకులు భారత్‌లో చెల్లవు.. సాకేత్ కోర్టు సంచలన తీర్పు
Railway Projects In AP and Telangana: రూ.10,021 కోట్లతో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు పరిధిలో 5 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులు
రూ.10,021 కోట్లతో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు పరిధిలో 5 మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులు
Vallabhaneni Vamsi: కూటమి ప్రభుత్వంపై వల్లభనేని వంశీ తీవ్ర ఆరోపణలు.. ఏసీపీ దామోదర్‌పై విజయవాడ సీపీకి ఫిర్యాదు
కూటమి ప్రభుత్వంపై వల్లభనేని వంశీ తీవ్ర ఆరోపణలు.. ఏసీపీ దామోదర్‌పై విజయవాడ సీపీకి ఫిర్యాదు
KTR: సబిత, సునీతా లక్ష్మారెడ్డిపై దాడి, కేసీఆర్ చావు కోరుకుంటున్నారు: ప్రభుత్వంపై గవర్నర్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు
సబిత, సునీతా లక్ష్మారెడ్డిపై దాడి, కేసీఆర్ చావు కోరుకుంటున్నారు: ప్రభుత్వంపై గవర్నర్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు
Kavya Shree: 'బిగ్ బాస్'పై కావ్య శ్రీ కామెంట్స్... నిఖిల్ పేరు కూడా తీయలేదుగా
'బిగ్ బాస్'పై కావ్య శ్రీ కామెంట్స్... నిఖిల్ పేరు కూడా తీయలేదుగా
Embed widget