అన్వేషించండి

Mirzapur 3 Web Series Review - మీర్జాపూర్ 3 వెబ్ సిరీస్ రివ్యూ: మున్నా లేడు, కాలిన్ కనిపించేదీ తక్కువే - గుడ్డు గూండాగిరి హిట్టా? ఫట్టా?

Mirzapur 3 web series review in Telugu: అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ఒరిజినల్ వెబ్ సిరీస్ 'మీర్జాపూర్' మూడో సీజన్ స్ట్రీమింగ్ అవుతోంది. రెండు సీజన్స్ తరహాలో ఆకట్టుకుంటుందా? లేదా? రివ్యూలో చూడండి.

Mirzapur Web Series Season 3 Review In Telugu: మీర్జాపూర్... ఆడియన్స్ 'ఔరా' అని ఆశ్చర్యపోతూ చూసేలా చేసిన వెబ్ సిరీస్! ఆ వయలెన్స్, ఆ డైలాగ్స్, ఆ బ్యాక్‌డ్రాప్, ఆ ఆర్టిస్టుల పెర్ఫార్మన్స్... ప్రతిదీ వీక్షకులకు కొత్తగా కనిపించింది. సిరీస్ సూపర్ హిట్ అయ్యింది. సీక్వెల్ వచ్చింది. అదీ ఆకట్టుకుంది. ఇప్పుడు 'మీర్జాపూర్' మూడో సీజన్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది (Mirzapur Season 3 Streaming On Amazon Prime Video). ఈ సీజన్ ఎలా ఉందో చూడండి.

కథ (Mirzapur Season 3 Story): మీర్జాపూర్ 2లో కథ ఎక్కడ అయితే ముగిసిందో... మీర్జాపూర్ 3లో అక్కడ మొదలైంది. సోదరుడు బబ్లూ, సతీమణి స్వీటీ మరణం తర్వాత ప్రతీకారం తీర్చుకోవాలని కాలిన్ భయ్యా (పంకజ్ త్రిపాఠి), మున్నా భయ్యా (Divyendu Sharma)పై గుడ్డు పండిట్ (అలీ ఫజల్) ఎటాక్ చేస్తాడు. వాళ్లిద్దర్ని షూట్ చేస్తాడు. అప్పుడు మున్నా మరణిస్తాడు. 

కాలిన్ భార్య బీనా త్రిపాఠి (రషిక దుగల్) అండతో మీర్జాపూర్ నయా డాన్ అవుతాడు గుడ్డు. గోలు (శ్వేతా త్రిపాఠి) అతడికి లెఫ్ట్ అండ్ రైట్ సపోర్టర్! వాళ్లిద్దరూ మీర్జాపూర్ (Mirzapur 3 Review)ను తమ గుప్పిట్లో ఉంచుకోగలిగారా? లేదా? ఈ క్రమంలో ఎన్ని సవాళ్లు ఎదురు అయ్యాయి? ఎంత మంది మీర్జాపూర్ మీద కన్నేశారు? గుడ్డు, గోలుకు బీనా  నిజంగా అండగా నిలిచిందా? పూర్వాంచల్ పవర్ కోసం ఎవరేం చేశారు? ఎటువంటి యుద్ధం, హింస జరిగింది? గుడ్డు షూట్ చేశాక కాలిన్ ఏమయ్యాడు? అతడు వచ్చాడా? లేదా? మీర్జాపూర్ గద్దెను కూల్చేయాలనే ముఖ్యమంత్రి మాధురి (ఇషా తల్వార్) లక్ష్యం నెరవేరిందా? లేదా? తదితర ప్రశ్నలకు సమాధానాలు సీజన్ 3 చూసి తెలుసుకోవాలి.

విశ్లేషణ (Mirzapur Season 3 Review): సూపర్ హిట్ వెబ్ సిరీస్ లేదా సినిమాకు సీక్వెల్ తీయడం, తీసి మెప్పించడం అంత సులభం కాదు. అది కత్తి మీద సాము లాంటి వ్యవహారమే. వెబ్ సిరీస్ ఫస్ట్ సీజన్ లేదా సినిమా వచ్చినప్పుడు ఎటువంటి అంచనాలు ఉండవు. కానీ, విజయం తర్వాత ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడతాయి. వాళ్ళు ఆశించే విషయాలు పెరుగుతాయి. 'మీర్జాపూర్ 2' అంచనాలు అందుకుంది కానీ మూడో సీజన్ మాత్రం ఆశించిన రీతిలో లేదు. అభిమానులకు కాస్త నిరాశ కలిగించే అంశమే కానీ అంచనాలు తక్కువ పెట్టుకోవడం మంచిది. ఇక, సిరీస్ ఎలా ఉందనే విషయంలోకి వెళితే...

వయలెన్స్... వయలెన్స్... వయలెన్స్... 'మీర్జాపూర్' విజయంలో ఆ హింస ఓ కీలక భూమిక పోషించిందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు! సీజన్ 3లో హింస తగ్గించారు. అధికారం కోసం, అధికారం నిలబెట్టుకోవడం కోసం వేసే ప్రణాళికలు ఎక్కువ అయ్యాయి. ఫిమేల్ క్యారెక్టర్లకు ఇంపార్టెన్స్ ఇచ్చారు. అయితే, మున్నా భయ్యా లేని లోటు స్పష్టంగా కనిపించింది.

'మీర్జాపూర్' జనాలకు నచ్చిందంటే కారణం అందులోని డార్క్ హ్యూమర్. ఈసారీ ఆ హ్యూమర్ మిస్ అయ్యింది. అనుకున్నంత లేదు. దానికి తోడు డ్రామా తగ్గింది. అన్నిటి కంటే ముఖ్యంగా లెంగ్త్ - ల్యాగ్ వీక్షకుల పట్ల మేజర్ విలన్ రోల్స్ పోషించాయి. ఒక్కో ఎపిసోడ్ 45 నుంచి 50 నిమిషాలు ఉండటంతో కొన్ని సన్నివేశాలు / ఎపిసోడ్స్ సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. కథలో క్యూరియాసిటీ ఫ్యాక్టర్, నెక్స్ట్ ఏంటి? అని ఎంగేజ్ చేసే, గ్రిప్పింగ్ మూమెంట్స్ మిస్ అయ్యాయి. స్క్రీన్ ప్లే ప్రేక్షకుల ఊహకు అనుగుణంగా ముందుకు వెళుతుంది.

గుడ్డు పాత్రలో అలీ ఫజల్ చక్కటి నటన కనబరిచారు. సిరీస్‌ను తన భుజాలపై మోశారు. కానీ, ఒక్కడిపై భారం అంతా పడటంతో షో రన్ చేయడం కష్టమైంది. శ్వేతా త్రిపాఠి, అంజుమ్ శర్మ సైతం తమ పాత్రల్లో ఒదిగిపోయారు. బీనా త్రిపాఠి పాత్రకు రషిక దుగల్ మరోసారి ప్రాణం పోశారు. సీఎంగా ఇషా తల్వార్ నటన బావుంది. వీళ్ల కంటే విజయ్ వర్మ ఎక్కువ ఆకట్టుకున్నారు. పంకజ్ త్రిపాఠి కనిపించేది కొన్ని సన్నివేశాలు అయినా సరే తన మార్క్ చూపించారు.

Also Read'హనీమూన్ ఎక్స్‌ప్రెస్' రివ్యూ: బాబోయ్... చైతన్య, హెబ్బా మధ్య ఆ రొమాన్స్ ఏంటి? అసలు ఆ కథేంటి?

'మీర్జాపూర్ 3'లో మెరుపులు లేవని కాదు, ఉన్నాయి. యాక్షన్ ఉంది. కానీ ఇంతకు ముందు సీజన్లతో పోలిస్తే తక్కువ అయ్యింది. హ్యూమర్, డ్రామా, ఇంటెన్సిటీ - అన్ని విషయాల్లోనూ అంతే! మున్నా భయ్యా లేకపోవడం, కాలిన్ భయ్యాను కొన్ని సన్నివేశాలకు మాత్రమే పరిమితం చేయడంతో ఆడియన్స్ ఆశించే మ్యాజికల్ మూమెంట్స్ బాగా తగ్గాయి. దర్శక రచయితలు నిడివితో పాటు హ్యూమర్, హింస మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సింది. చివరి మూడు ఎపిసోడ్స్ బావున్నాయి. అయితే... అవి ఎంజాయ్ చేయాలంటే మొదటి ఏడు ఎపిసోడ్స్ చూడక తప్పదు.

'మీర్జాపూర్ 3'లో మున్నా భయ్యా లేని లోటు స్పష్టంగా కనిపించింది. అయితే... ఈ సిరీస్ (Mirzapur 3 Review)ను తీసి పారేయలేం. చూడొచ్చు. కానీ, టైమ్ చాలా అవసరం. లెంగ్త్ ఎక్కువ కనుక తీరిక చేసుకుని చూడాలి. 'మీర్జాపూర్' ఫ్రాంచైజీ వీరాభిమానులను మాత్రమే సీజన్ 3 మెప్పిస్తుంది.

Also Read: 'కల్కి 2898 ఏడీ' రివ్యూ: విజువల్ వండరే! మరి, 'బాహుబలి' బీట్ చేసే సత్తా ఉందా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Pushpa 2 Trailer: మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Nayanthara vs Dhanush Netflix Documentary | తమిళ్ సినీ ఇండస్ట్రీలో వివాదం..నయనతార vs ధనుష్ | ABP Desamరోహిత్ కి ధోని చేసిన మేలు, తిలక్ కి సూర్య చేస్తున్నాడుసఫారీలను సెంచరీతో చితక్కొట్టిన సంజూ శాంసన్మైక్ టైసన్ ను చిత్తు చేశాడు, 300 కోట్ల ప్రైజ్ మనీని కొల్లగొట్టాడు

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amaravati Master Plan: అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
అదిరిపోయే రీతిలో అమరావతి మాస్టర్ ప్లాన్- మంగళగిరి, గుంటూరు, విజయవాడకు మహర్దశ
TGPSC: తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
తెలంగాణలో గ్రూప్ - 3 పరీక్షలు - అభ్యర్థులకు కీలక సూచనలు
CM Chandrababu: 'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
'సోషల్ మీడియా సైకోలను కట్టడి చేయాలి' - జైలు జీవితం పట్టుదల పెరిగేలా చేసిందన్న సీఎం చంద్రబాబు
Pushpa 2 Trailer: మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
మైండ్ బ్లాక్ అయ్యేలా బీహార్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్... ఇవాళ సాయంత్రమే 'పుష్ప 2' ట్రైలర్ విడుదల
Toyota Camry Hybrid Facelift: టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
టయోటా క్యామ్రీ ఫేస్‌లిఫ్ట్ లాంచ్ త్వరలోనే - స్ట్రాంగ్ హైబ్రిడ్ వెర్షన్‌లో మార్కెట్లోకి?
Manipur: మణిపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి- 7 జిల్లాల్లో కర్ఫ్యూ, రెండు రోజులు ఇంటర్‌నెట్ బంద్‌
మణిపూర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేల ఇళ్లపై దాడి- 7 జిల్లాల్లో కర్ఫ్యూ, రెండు రోజులు ఇంటర్‌నెట్ బంద్‌
Nora Fatehi From Matka: 'మట్కా' ఫ్లాపే కానీ... మూవీలో నోరా ఫతేహి ఎంత ముద్దుగా ఉందో చూశారా?
'మట్కా' ఫ్లాపే కానీ... మూవీలో నోరా ఫతేహి ఎంత ముద్దుగా ఉందో చూశారా?
Samsung Galaxy S25: శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
శాంసంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ లాంచ్ అప్పుడే - లీక్స్ వచ్చేశాయ్!
Embed widget