అన్వేషించండి

Lucky Baskhar Review: లక్కీ భాస్కర్ రివ్యూ: దుల్కర్ లక్కీ అయ్యాడా? - ఈ ఫైనాన్షియల్ క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా?

Dulquer Salmaan Lucky Baskhar Review: దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘లక్కీ భాస్కర్’ గురువారం ప్రీమియర్స్‌తో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉంది?

Lucky Baskhar Review in Telugu: దుల్కర్ సల్మాన్‌కు మలయాళంతో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన ఎంపిక చేసుకునే వైవిధ్యమైన కథలు కొత్తదనాన్ని కోరుకునే ప్రేక్షకులకు ఆయనను దగ్గర చేశాయి. 2022లో వచ్చిన ‘సీతారామం’ పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత మరోసారి ‘లక్కీ భాస్కర్’ అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. ‘సర్’తో మంచి హిట్ కొట్టిన వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. టీజర్, ట్రైలర్లతో జనాల్లో మంచి ఆసక్తిని కలిగించిన ఈ సినిమా గురువారం ప్రీమియర్లతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది?

కథ: ఇది 90ల దశకం ప్రారంభంలో జరిగే కథ. భాస్కర్ (దుల్కర్ సల్మాన్) ఒక మిడిల్ క్లాస్ బ్యాంక్ ఉద్యోగి. అతని భార్య సుమతి (మీనాక్షి చౌదరి). వీరికి ఒక కొడుకు (రిత్విక్). గంపెడు కుటుంబం ఉన్న భాస్కర్‌కి బ్యాంక్‌లో వచ్చే తొమ్మిది వేల రూపాయల జీతం సరిపోదు. దీంతో ఊరంతా అప్పులు చేస్తాడు. ప్రేమ వివాహం కావడం వల్ల సుమతి ఇంట్లో వాళ్ళకి భాస్కర్ అంటే పడదు. డబ్బు లేదని చిన్న చూపు చూస్తారు. దీనికి తోడు బ్యాంక్‌లో న్యాయంగా తనకి రావాల్సిన ప్రమోషన్ వేరే వాళ్ళకి వెళ్తుంది. దీంతో భాస్కర్ బ్యాంక్ లో చిన్నగా ఒక స్కామ్ స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత భాస్కర్ జీవితం ఏం అయింది? భాస్కర్ తప్పులు బయట పడ్డాయా? అసలు భాస్కర్ జీవితం చివరికి ఏం అయింది? అనేది తెలియాలంటే ' లక్కీ భాస్కర్ ' చూడాల్సిందే.

విశ్లేషణ: తెలుగులో ఫైనాన్షియల్ క్రైమ్ మీద వచ్చిన సినిమాలు చాలా తక్కువ. అందులోనూ బ్యాంకింగ్ సెక్టార్‌లో మీద వచ్చే నేరాల మీద వచ్చిన సినిమాలు ఇంకా తక్కువ. వెంకీ అట్లూరి ‘లక్కీ భాస్కర్’ ఆ కోవలోకే వస్తుంది. 1990ల్లో దేశాన్ని కుదిపేసిన ఒక స్టాక్ మార్కెట్ కుంభకోణం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఇప్పటి వరకు ఆ కుంభకోణం మీద వచ్చిన సినిమాలు కానీ, సిరీస్‌లు కానీ ప్రధానంగా ఆ స్కామ్ చేసిన వ్యక్తి చుట్టూ తిరిగాయి. కానీ అసలు ఆ స్కామ్ చుట్టూ ఏం జరిగింది? ఆ స్కామ్‌లో ఇన్వాల్వ్ అయిన అధికారుల జీవితాలు ఏంటి? అనే దాని మీద వెంకీ అట్లూరి ఫోకస్ చేయడం ప్లస్ పాయింట్. దీని వల్ల ఆ సినిమాలు, సిరీస్‌ల ఛాయలు దీనిపై పడలేదు.

భాస్కర్‌ను సీబీఐ అధికారులు అరెస్టు చేయడం, తన కథను భాస్కర్ చెప్పుకోవడం ప్రారంభించడంతో సినిమా ప్రారంభం అవుతుంది. డబ్బు లేని కారణంగా భాస్కర్ కుటుంబం ఎన్ని కష్టాలు పడింది? ఎన్ని అవమానాలు ఎదుర్కుంది? వంటి విషయాలను తక్కువ సీన్లలోనే చాలా ఎఫెక్టివ్‌గా, ఎమోషనల్‌గా చూపించారు. ఒక్కసారి భాస్కర్ ఇల్లీగల్‌గా డబ్బులు సంపాదించడం స్టార్ట్ చేశాక సినిమా గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోతుంది. ప్రతి మూడు నాలుగు సీన్లకు ఒక హై పాయింట్ లేదా ట్విస్ట్ వస్తూనే ఉంటుంది. ఆడియన్స్‌ను స్క్రీన్ వైపు నుంచి కళ్లు తిప్పుకోనివ్వకుండా చేస్తుంది. ముఖ్యంగా భాస్కర్ చేసే ప్రతి ఒక్క అడ్వెంచర్ అదే ఒక ప్రత్యేకమైన కథలా అనిపిస్తుంది. వీటన్నిటి కంటే హై ఇచ్చేలా, సెకండాఫ్ మీద బాగా ఇంట్రస్ట్ పెంచేలా ఇంటర్వెల్ ట్విస్ట్‌ను ప్లాన్ చేశారు.

సెకండాఫ్ నుంచి కథ మరో టర్న్ తీసుకుంటుంది. అసలైన స్టాక్ మార్కెట్ స్కామ్ సెకండాఫ్‌లోనే స్టోరీలోకి వస్తుంది. డబ్బు భాస్కర్‌ను ఎంతలా గాల్లోకి తీసుకెళ్లింది? భాస్కర్‌ను తిరిగి నేల మీదకు తీసుకువచ్చింది ఏంటి? అనే విషయాల్లో ఎమోషన్స్ బాగా వర్కవుట్ అయ్యాయి. ముఖ్యంగా ఇలాంటి సినిమాల్లో రైజ్, ఫాల్, మళ్లీ రైజ్... ఇలా హీరోయిజం గ్రాఫ్ ఉంటుంది. కానీ లక్కీ భాస్కర్‌లో మాత్రం రైజ్, రియలైజేషన్ మాత్రమే ఉంటాయి. చివర్లో మళ్లీ ఒక హై పాయింట్‌తో సినిమాను ఎండ్ చేస్తారు.

వెంకీ అట్లూరి ఈ సినిమా రైటింగ్‌లో చాలా స్పెషల్ కేర్ తీసుకున్నారు. మొదటి మూడు సినిమాల తర్వాత వెంకీ కేవలం లవ్ స్టోరీలు మాత్రమే తీయగలడు అనుకుంటే ‘సర్’తో ఎడ్యుకేషన్ బేస్డ్ సినిమా తీసి హిట్ కొట్టాడు. ఇప్పుడు మళ్లీ ఎక్కువమంది టచ్ చేయని ఫైనాన్షియల్ క్రైమ్ సబ్జెక్ట్‌ని తీసుకున్నాడు. ఒక్క ఫైట్ సీన్ కూడా లేకపోయినా సినిమాలో చాలా చోట్ల ఎలివేషన్లు పడ్డాయి. దుల్కర్ ఫ్యామిలీ పడ్డ ప్రతి అవమానానికి తర్వాతి సీన్లలో సమాధానం ఉంటుంది. అలాగే డబ్బు నెత్తికెక్కాక దుల్కర్ చేసిన ప్రతి అవమానానికి ఒక క్షమాపణ ఉంటుంది. హీరో సారీ చెప్పినా కూడా ఆడియన్స్ శాటిస్‌ఫ్యాక్షన్ ఫీల్ అవ్వడం ఇందులో స్పెషల్. ముఖ్యంగా ఇందులో డైలాగ్స్ కూడా చాలా బాగా వచ్చాయి. ‘వేగంగా నడిపే బండి, వేగంగా వచ్చే రూపాయి ఎప్పుడో ఒకసారి మనిషిని కింద పడేస్తాయి.’ వంటి మాటలు సీన్ల స్థాయిని పెంచుతాయి. భాస్కర్ కొడుకు బర్త్‌డే తర్వాత వచ్చే ఎమోషనల్ సీన్ సినిమాలోని హైలెట్స్‌లో ఒకటి.

జీవీ ప్రకాష్ కుమార్ ఇచ్చిన పాటలు వినడానికి, స్క్రీన్‌పై కూడా బాగున్నాయి. అన్ని సాంగ్స్ దాదాపు మాంటేజ్‌లోనే రావడంతో కథను ఇబ్బంది పెట్టిన ఫీలింగ్ కలగదు. ముఖ్యంగా కొన్ని సీన్లలో తన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను నెక్స్ట్ లెవల్‌కి ఎలివేట్ చేసింది.

ఇక నటీనటుల విషయానికి వస్తే... దుల్కర్ సల్మాన్ మిడిల్ క్లాస్ భాస్కర్ పాత్రలో అదరగొట్టేశాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్లలో తన అనుభవం కనిపిస్తుంది. మీనాక్షి చౌదరి రెగ్యులర్ గ్లామరస్ రోల్స్‌కు భిన్నంగా నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్ర చేశారు. చాలా బాగా నటించారు కూడా. దుల్కర్ కొడుకు పాత్ర చేసిన రిత్విక్ ఒక సీన్‌లో కన్నీళ్లు పెట్టిస్తాడు. మిగతా పాత్రధారులందరూ తమ పాత్రల మేరకు బాగా నటించారు.

ఓవరాల్‌గా చెప్పాలంటే... ఈ సినిమాలో భాస్కర్ ఎంత లక్కీనో, ఈ సినిమా దొరికినందుకు దుల్కర్ కూడా అంతే లక్కీ. ‘లక్కీ భాస్కర్’ లాగా ‘లక్కీ దుల్కర్’ అని కూడా అనేయచ్చు.

Read Also: ఊహలకు అందని రీతిలో ‘కేజీఎఫ్ 3’... క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాకీ భాయ్

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

TTD Chairman: టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్‌ నాయుడు నియామకం, కొత్త పాలకమండలి సభ్యులు వీరే
టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్‌ నాయుడు నియామకం, కొత్త పాలకమండలి సభ్యులు వీరే
Lucky Baskhar Review: లక్కీ భాస్కర్ రివ్యూ: దుల్కర్ లక్కీ అయ్యాడా? - ఈ ఫైనాన్షియల్ క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా?
లక్కీ భాస్కర్ రివ్యూ: దుల్కర్ లక్కీ అయ్యాడా? - ఈ ఫైనాన్షియల్ క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా?
Telangana Group 3 : తెలంగాణ గ్రూప్స్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్ - గ్రూప్ 3 పరీక్షల షెడ్యూల్ ఇదిగో
తెలంగాణ గ్రూప్స్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్ - గ్రూప్ 3 పరీక్షల షెడ్యూల్ ఇదిగో
Mayonnaise Ban: స్ట్రీట్ ఫుడ్ లవర్స్‌కు బిగ్ షాక్, మయోనైజ్‌పై నిషేధం విధించిన ప్రభుత్వం
స్ట్రీట్ ఫుడ్ లవర్స్‌కు బిగ్ షాక్, మయోనైజ్‌పై నిషేధం విధించిన ప్రభుత్వం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

టీటీడీ ఛైర్మన్‌‌గా బీఆర్ నాయుడు, అధికారిక ప్రకటనబిర్యానీ తెప్పించాలన్న బోరుగడ్డ - జడ్జి స్ట్రాంగ్ కౌంటర్‌తో సైలెంట్SS Rajamouli Lion Update | వైల్డ్ సఫారీ ఫోటోలతో హింట్స్ ఇస్తున్న రాజమౌళి | ABP Desamవివాదంలో సాయి పల్లవి, పాత వీడియో తీసి విపరీతంగా ట్రోల్

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
TTD Chairman: టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్‌ నాయుడు నియామకం, కొత్త పాలకమండలి సభ్యులు వీరే
టీటీడీ ఛైర్మన్‌గా బీఆర్‌ నాయుడు నియామకం, కొత్త పాలకమండలి సభ్యులు వీరే
Lucky Baskhar Review: లక్కీ భాస్కర్ రివ్యూ: దుల్కర్ లక్కీ అయ్యాడా? - ఈ ఫైనాన్షియల్ క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా?
లక్కీ భాస్కర్ రివ్యూ: దుల్కర్ లక్కీ అయ్యాడా? - ఈ ఫైనాన్షియల్ క్రైమ్ థ్రిల్లర్ మెప్పించిందా?
Telangana Group 3 : తెలంగాణ గ్రూప్స్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్ - గ్రూప్ 3 పరీక్షల షెడ్యూల్ ఇదిగో
తెలంగాణ గ్రూప్స్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్ - గ్రూప్ 3 పరీక్షల షెడ్యూల్ ఇదిగో
Mayonnaise Ban: స్ట్రీట్ ఫుడ్ లవర్స్‌కు బిగ్ షాక్, మయోనైజ్‌పై నిషేధం విధించిన ప్రభుత్వం
స్ట్రీట్ ఫుడ్ లవర్స్‌కు బిగ్ షాక్, మయోనైజ్‌పై నిషేధం విధించిన ప్రభుత్వం
Jai Hanuman First Look : 'జై హనుమాన్' నుంచి దివాళి బ్లాస్ట్ వచ్చేసింది... 'హనుమాన్'గా 'కాంతారా' స్టార్ లుక్ అదుర్స్
'జై హనుమాన్' నుంచి దివాళి బ్లాస్ట్ వచ్చేసింది... 'హనుమాన్'గా 'కాంతారా' స్టార్ లుక్ అదుర్స్
IPL 2025 RCB Retention List: ఆర్సీబీ రిటెయిన్ చేసుకునే ఆటగాళ్లు వీరే! విరాట్ కోహ్లీని మళ్లీ కెప్టెన్‌గా చూస్తామా?
ఆర్సీబీ రిటెయిన్ చేసుకునే ఆటగాళ్లు వీరే! విరాట్ కోహ్లీని మళ్లీ కెప్టెన్‌గా చూస్తామా?
Babies Health : చలికాలంలో పిల్లలను ఇలా జాగ్రత్తగా కాపాడుకోండి.. ఈ మిస్టేక్స్ అస్సలు చేయొద్దు
చలికాలంలో పిల్లలను ఇలా జాగ్రత్తగా కాపాడుకోండి.. ఈ మిస్టేక్స్ అస్సలు చేయొద్దు
Harish Rao Chit Chat: రేవంత్ కుర్చీ కిందే బాంబు - పాదయాత్రకు డేటు, టైం చెప్పు - రేవంత్‌కు హరీష్ సవాల్
రేవంత్ కుర్చీ కిందే బాంబు - పాదయాత్రకు డేటు, టైం చెప్పు - రేవంత్‌కు హరీష్ సవాల్
Embed widget