Allu Arjun: వీడు పెద్దైతే ఎలా ఉంటాడో అని భయపడ్డాం... అల్లు అర్జున్ మదర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
Unstoppable 4 Latest Episode: అల్లు అర్జున్, ఆయన తల్లి నిర్మల ‘అన్‌స్టాపబుల్ సీజన్ 4’ షోలో పాల్లొన్నారు. ఈ సందర్భంగా బన్నీకి సంబంధించి పలు ఆసక్తికర విషయాలను ఆమె వెల్లడించారు.
Allu Nirmala About Allu Arjun: బాలయ్య హోస్టుగా చేస్తున్న ‘అన్‌స్టాపబుల్’ షో గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఇప్పటి వరకు మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో, ప్రస్తుతం నాలుగో సీజన్ సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో మొదలైన తాజా సీజన్ లో ఇప్పటికి వరకు పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నారు. పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాజాగా ఈ షోకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తన తల్లి నిర్మలతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్మల తన కొడుకు బన్నీ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
బన్నీని చూసి చిన్నప్పుడు భయపడ్డాం!
“బన్నీ చిన్నప్పుడు చాలా అల్లరి చేసేవాడు. వీడు పెద్దయ్యాక ఎలా ఉంటాడోనని మా మమయ్య కూడా భయపడే వారు. ఎందుకైనా మంచిదని, వీడి పేరు మీద బ్యాంకులో కొన్ని డబ్బులు వేశారు. కానీ, ఆ తర్వాత బన్నీ పూర్తిగా మారాడు. నెమ్మదిగా సెట్ రైట్ అయ్యాడు. ఇప్పుడు ఇంట్లో తన చెప్పిన మాటను అందరం వింటున్నాం” అన్నారు.
లవ్ గురించి చెప్పినప్పుడు ఏమన్నానంటే?
బన్నీ తన ప్రేమ గురించి నాతో చెప్పినప్పుడు.. సంతోషంగా ఉంటాను అనుకుంటే చేసుకోమని చెప్పానన్నారు నిర్మల. “బన్నీ అప్పుడప్పుడే సినిమా పరిశ్రమలో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. ఓ రోజు నా దగ్గరికి వచ్చాడు. నేను ఓ అమ్మాయిని ఇష్టపడుతున్నాను అన్నాడు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఆ అమ్మాయితో జీవితాంతం నువ్వు సంతోషంగా ఉంటాను అనుకుంటే చేసుకో అని చెప్పాను” అన్నారు.
బన్నీ గురించి ఆ విషయంలో బాధపడ్డా!
“బన్నీ ఏదైనా ఒకటి అనుకుంటా, అది నెరవేర వరకు ఆలోచిస్తుంటాడు. ఎవరి మాట వినడు. ఒక్కోసారి వీడు ఎవరి మాటైనా వింటే బాగుంటుందని బాధపడతాను. అయితే, ప్రతి విషయాన్ని తను పాజిటివ్ గా తీసుకుంటాడు. ఎదైనా ఇబ్బందికర పరిస్థితి ఎదురైనప్పుడు దాని నుంచి వీలైనంత త్వరగా బయటపడేందుకు ప్రయత్నిస్తాడు” అని చెప్పుకొచ్చారు.
Also Read: కంగువ ఫస్ట్ డే కలెక్షన్స్... టార్గెట్ రీచ్ అయ్యిందా? సూర్యకు పాన్ ఇండియా సక్సెస్ వచ్చిందా?
చిరంజీవిని చూసి బన్నీ హీరో కావాలనిపించింది!
చిరంజీవిని చూసి బన్నీ హీరో అయితే బాగుంటుందనుకున్నానని నిర్మల చెప్పారు. “చిరంజీవి గారి సినిమా వేడుకలను చూసినప్పుడు బన్నీ కూడా ఇలా హీరో అయితే బాగుండేది అనిపించింది. అనుకున్నట్లుగానే ఈ రోజు మంచి స్టార్ గా ఎదిగాడు. చాలా సంతోషంగా ఉంది. ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు అందుకోవడం మరింత ఆనందాన్ని కలిగించింది” అని వెల్లడించారు.
అటు ఈ షోలో బన్నీ పలు కీలక విషయాలు వెల్లడించారు. టాలీవుడ్ సీనియర్ హీరోలతో పాటు తన తరం స్టార్ల గురించి బోలెడు విషయాలు మాట్లాడారు. విజయ్ దేవరకొండ, నవీన్ పొలిశెట్టి, సిద్దూ జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ లాంటి వాళ్లు చాలా అద్భుతంగా నటిస్తున్నారని చెప్పుకొచ్చారు. యంగ్ హీరోల్లో తనకు సిద్దూ చాలా ఇష్టమన్నారు. ప్రస్తుతం ఈ ఎపిసోడ్ ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతోంది.
Read Also: 'డాకు మహారాజ్'గా గుర్రంపై వచ్చిన బాలయ్య... ఎన్‌బికే 109 టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ చెప్పేశారోచ్