అన్వేషించండి

Food Timings : రోజూ ఈ టైమ్‌కు అల్పాహారం, భోజనం చేస్తే గుండెకు మంచిదట!

Causes of heart attack : మీరు రోజూ ఏ టైమ్‌‌కు భోజనం చేస్తారు? ఒక నిర్దిష్ట సమయాన్ని పాటించకుండా తింటున్నారా? అయితే, మీ గుండె ప్రమాదంలో ఉంది.

Heart Attack Causes: కోవిడ్-19తో ప్రపంచం ఎంతగా అల్లాడిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దాని ప్రభావం తగ్గిన తర్వాత ధైర్యంగా ఊపిరి పీల్చుకోగలుగుతున్నారు. అయితే, ఈ మహమ్మారి ఉనికి మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. కరోనాకు గురై.. చికిత్సతో బయటపడిన చాలామంది ఇంకా ప్రమాదపు అంచుల్లోనే ఉన్నారు. వైరస్ వల్ల పాడైన అవయవాలు.. ఎప్పుడు ఏ క్షణంలో మొరాయిస్తాయో చెప్పలేని పరిస్థితి. అలాగే, వైరస్‌ను కంట్రోల్ చేయడానికి తీసుకున్న వ్యాక్సిన్స్ వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంత అనేది కచ్చితంగా తెలియకపోయినా.. ఇటీవల పెరుగుతోన్న గుండె సమస్యల సంఖ్యను పరిశీలిస్తే ప్రమాదం పూర్తిగా తొలగిపోలేదని అర్థమవుతుంది. చాలామంది చిన్న వయస్సులోనే హార్ట్ ఎటాక్‌కు గురవ్వుతున్నారు. కాబట్టి, మనం మన గుండెను కాపాడుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి, వ్యసనాలకు దూరంగా ఉండటమే కాకుండా.. సమయానికి భోజనం చేయడం, నిద్రపోవడం చేయాలి. శరీరానికి అవసరమైన పోషకాలు అందించే ఆహారాన్ని తినాలి. 

టైమ్‌కు భోజనం చేస్తే చాలు

బిజీ లైఫ్‌లో చాలామంది సమయానికి భోజనం చేయడం లేదు. అది కూడా గుండెపై ప్రతికూల ప్రభావం చూపవచ్చు. స్ట్రోక్, హార్ట్ ఫెయిల్యూర్.. వంటి సమస్యలకు గురికాకూడదంటే.. మీరు తప్పకుండా మీ భోజన సమయాలను మార్చుకోవాలి. రోజూ వీలైనంత త్వరగానే భోజనం ముగించాలి. అలాగే అల్పాహారం విషయంలో కూడా ఆలస్యం వద్దు. నిద్ర లేచిన గంటలోనే అల్పాహారాన్ని తినేయాలి. అలాగే మధ్యాహ్నాలు మరీ ఆలస్యం చేయకుండా త్వరగా తినేయాలి. రాత్రి నిద్ర పోవడానికి రెండు గంటల ముందే మీరు డిన్నర్ తినేయాలి.

సమయానికి తినకపోతే.. ఆ వ్యాధుల ముప్పు తప్పదు

సమయానికి మనం భోజనం చేయకపోతే డయాబెటిస్, క్యాన్సర్ వంటి వ్యాధులకు గురికావల్సి వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గుండె ప్రమాదంలో పడుతుంది. మన భోజనం చేసే వేళల్లో తేడా వస్తే.. సిర్కాడియన్ రిథమ్‌లు గాడి తప్పుతుంది. ఫలితంగా ఆరోగ్యం చెడిపోతుంది. ఇటీవల నిర్వహించిన న్యూట్రీనెట్-శాంటీ స్టడీలో సుమారు 1.03 లక్షల మంది హెల్త్ డేటాను పరిశీలించగా కీలక విషయాలు బయటపడ్డాయి.

వాయిదా వేస్తే అంత సంగతులు

చాలామంది పనిలో పడి భోజనం వేళలను వెనక్కి నేట్టేస్తారు. ఒంటి గంటకు చేయాల్సిన భోజనాన్ని 2 గంటలకో 3 గంటలకో తింటారు. దాని వల్ల ప్రతి గంటకు హృదయ సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం ఆరు శాతం ఉన్నట్లు ఐరోపా శాస్త్రవేత్తలు వెల్లడిచారు. అంటే ఒకరు ఉదయం 7 గంటలకు టిఫిన్, మరొకరు 9 గంటలకు తిన్నట్లయితే.. రెండో వ్యక్తికి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు 12 శాతం ఉంటుందట. ఒక వేళ మూడు గంటలు వాయిదా వేసి తింటే ఆ ముప్పు 18 శాతానికి పెరుగుతుందట. 

భోజనం వేళలు మారితే మరింత ప్రమాదకరం

అల్పాహారమే కాదు.. రాత్రి భోజన వేళలు మారినా సరే ప్రమాదమే. రాత్రి ఆలస్యంగా తినేవారిలో స్ట్రోక్, బ్రెయిన్ అనూరిజం వంటి సెరెబ్రోవాస్కులర్ వ్యాధుల ప్రమాదం 28 శాతం పెరిగినట్లు అధ్యయనంలో తేలింది. భోజనానికి గ్యాప్ ఇవ్వడం వల్ల అనవసరమైన చిల్లర తిళ్లు తినే అలవాటు పెరుగుతుందని, అది మరింత ప్రమాదకరమని నిపుణులు వెల్లడించారు. భోజన వేళలు మారడం వల్ల గుండె, రక్త ప్రసరణ సంబంధిత వ్యాధుల తీవ్రత పెరుగుతుందని హెచ్చరించారు. 

ఈ వేళల్లో తింటే బెటర్

మన శరీరంలో జీర్ణక్రియ, పోషకాల శోషణలకు నిర్దిష్ట సమయం ఉంటుందని.. అది తప్పినట్లయితే శరీరంలో సమయానికి జరగాల్సిన ప్రక్రియలన్నీ గందరగోళానికి గురవ్వుతాయని నిపుణులు పేర్కొన్నారు. మన శరీర సిర్కాడియన్ రిథమ్‌లు మనం తీసుకొనే ఆహార వేళలు, రాత్రి నిద్రించే సమయంపై ఆధారపడి ఉంటాయి. వాటికి ఎలాంటి అంతరాయం ఏర్పడినా గుండె జబ్బులు వస్తాయి. కాబట్టి, నిత్యం అల్పాహారం 7 గంటలకు.. మధ్యాహ్నం 1 గంటకు.. రాత్రి 8 లోపు భోజనం చేయాలి. డిన్నర్ చేసిన 2 గంటల తర్వాత నిద్రపోవాలి. 

Also Read: ఉదయం నిద్రలేస్తున్నప్పుడు ఇలా అనిపిస్తోందా? మీకు ఈ వ్యాధి ఉన్నట్లే, డాక్టర్‌ను కలవండి

టాప్ హెడ్ లైన్స్

Amla Benefits : రోజుకో ఉసిరికాయ తింటే కలిగే లాభాలు.. ఉదయాన్నే తినాలా? రోజులో ఎప్పుడైనా తినొచ్చా?
రోజుకో ఉసిరికాయ తింటే కలిగే లాభాలు.. ఉదయాన్నే తినాలా? రోజులో ఎప్పుడైనా తినొచ్చా?
Water Weight : వాటర్ వెయిట్ ఎలా తగ్గించుకోవాలి? శరీరంలో నీరు పేరుకుపోవడానికి కారణాలివే
వాటర్ వెయిట్ ఎలా తగ్గించుకోవాలి? శరీరంలో నీరు పేరుకుపోవడానికి కారణాలివే
Chana Dal Coconut Curry : శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెసిపీ.. ఇలా సింపుల్‌గా, టేస్టీగా చేసుకోండి
Hair Transplant : హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? కచ్చితంగా తెలుసుకోండి
హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి? కచ్చితంగా తెలుసుకోండి

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nana Patekar: మూడు నేషనల్ అవార్డులతో పాటు పద్మశ్రీ... ఎన్నో హిట్ సినిమాలు... నానా పటేకర్ జర్నీ తెలుసుకోండి
మూడు నేషనల్ అవార్డులతో పాటు పద్మశ్రీ... ఎన్నో హిట్ సినిమాలు... నానా పటేకర్ జర్నీ తెలుసా?
AP Local Elections: ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
ఏపీ స్థానిక ఎన్నికల పోరు - బలానికి తగ్గట్టు పోటీ వెనుక మిస్టరీ.. బలానికి కొలమానం ఏంటి?
KBR Park Traffic One Way: కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
కేబీఆర్ పార్క్ వన్ వే రోడ్డు రగడ - వృధా అయిన ప్రజాధనం - భవిష్యత్తు ట్రాఫిక్‌ ఆలోచన ఏది?
Pre launch Real Estate Scam: హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు.. బాధితుల్లో ఐటీ, ప్రభుత్వ ఉద్యోగాలు
హైదరాబాద్‌లో ప్రీలాంచ్‌ ఆఫర్‌ పేరుతో రూ.కోట్లలో మోసం.. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌పై కేసు నమోదు
Kiwi Tour Blueprint: కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
కివీస్ పోరుకు 2 వేర్వేరు జట్లు సిద్ధం.. ఆసీస్ ఏ సిరీస్ ప్రదర్శన ఆధారంగా ఎంపిక, టెస్ట్ సన్నాహాల వేళ సెలెక్టర్ల సరికొత్త వ్యూహం
Central Minister Rammohan Naidu: విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
విశాఖ దేశానికి గేట్‌వే ఎకానమీ.. ఏపీలో కొత్తగా 6 ఎయిర్‌పోర్టులు - కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
Delhi Protest: జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
జంతర్ మంతర్ వద్ద హైడ్రామా.. రాహుల్ గాంధీ, ప్రియాంక సహా విపక్ష ఎంపీలు అరెస్ట్
Virt Kohli: ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
ఆశ్రమం సందర్శనకు కోహ్లీ 5 కోట్లు తీసుకున్నాడని ఆరోపణలు.. తీవ్రంగా ఖండించిన క్రికెటర్
Embed widget