Moringa Leaves Benefits : మునగ ఆకులో ఇన్ని ప్రయోజనాలా? ఆరెంజ్, అరటి పండు కంటే మెరుగైన పోషకాలు
Munaga Benefits : మునకాయలే కాదు మునగాకు కూడా ఎంతో మంచిది దీని వల్ల శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. మునగాకు వల్ల కలిగే ఆ అద్భుత ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
![Moringa Leaves Benefits : మునగ ఆకులో ఇన్ని ప్రయోజనాలా? ఆరెంజ్, అరటి పండు కంటే మెరుగైన పోషకాలు You will be surprised to know the health benefits of moringa leaves Moringa Leaves Benefits : మునగ ఆకులో ఇన్ని ప్రయోజనాలా? ఆరెంజ్, అరటి పండు కంటే మెరుగైన పోషకాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/11/21/dbfb74fc1bc844b98e09c6573a6936831700585961201880_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Munaga Benefits : ఆరోగ్యానికి దివ్యౌషధంలా పనిచేసే మునగ ఎంతో మేలు చేస్తుంది. మునగలో ఫైబర్ తోపాటు ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషకాలు ఉన్నాయి. మునగాకుల్లో అధికంగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీర వాపును నియంత్రిస్తాయి. మునగ బ్లడ్ షుగర్ లెవల్స్ ను కూడా చక్కగా నియంత్రిస్తుంది.
చర్మ సంరక్షణకు:
అనామ్లజనకాలు సమృద్ధిగా మునగ ఆకులు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. నిత్యం మునగాకు తినడం వల్ల చర్మం యవ్వనంగా, మృదువుగా, ఆరోగ్యకరమైన మెరుపును అందిస్తుంది. చర్మానికే కాదు జుట్టుకు కూడా మునగ ఔషధంలా పనిచేస్తుంది. మునగాకు పేస్టు జుట్టుకు పట్టించినట్లయితే చుండ్రు సమస్య తగ్గుతుంది. ముఖంపై మొటిమల సమస్యతో బాధపడేవారు మునగాకు పేస్టును ముఖానికి రాసుకున్నట్లయితే మొటిమలు తగ్గడంతోపాటు మచ్చలు లేని చర్మం మీ సొంతం అవుతుంది. అనేక చర్మ సంరక్షణ ఉత్పత్తులలో మునగాను ఉపయోగిస్తారు.
యాంటీ ఇన్ఫ్లమేటరీ పవర్‌హౌస్:
మునగ ఆకులలో ఐసోథియోసైనేట్‌లు ఉంటాయి. ఇవి వాపును తగ్గించడంలో ఎంతగానో సహాయపడుతాయి. అంతేకాదు నొప్పిని కూడా తగ్గిస్తాయి. ఇందులో ఉండే విటమిన్ సి, జీటిన్, క్లోరోజెనిక్ యాసిడ్, కెంప్‌ఫెరోల్ వంటి ముఖ్యమైన పోషకాలతో నిండిన మునగ ఆకులు శక్తివంతమైన సప్లిమెంట్‌గా పనిచేస్తాయి. రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి. వ్యాధుల బారినపడకుండా నివారిస్తాయి.
కొలెస్ట్రాల్ కు చెక్:
అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడేవారికి మునగాకు దివ్యౌషధంలా పనిచేస్తుంది. మునగాకులు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఎంతగానో దోహదం చేస్తాయి. ధమనుల గోడలలో ఏర్పడిన ఫలకాన్ని నిరోధించడంతోపాటు గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది.
బరువు తగ్గడానికి:
మీ రోజువారీ ఆహారంలో మునగాకులను చేర్చుకోవడం వల్ల బరువును తగ్గవచ్చు. మునగాకులను పౌడర్ రూపంలో కానీ, టీ రూపంలో కానీ తీసుకోవచ్చు. ఇందులో ఉండే అద్భుతమైన పోషకాలు బరువును తగ్గించడంలో సహాయపడతాయి. భోజనానికి ముందు టీ రూపంలో కానీ లేదంటే పప్పులు, కూరగాయలలో మునగాకులను చేర్చుకోవచ్చు.
మునగాకులు ఒబెసిటీని తగ్గించి బరువును అదుపులో ఉంచడంతో తోడ్పడుతుంది. మునగలో కాల్షియం, మెగ్నీషియం, ఫాస్పరస్ ఉండటంతో ఎముకల పుష్టికి మేలు చేస్తుంది. మునగలో ఎన్నో విటమిన్లు మినరల్స్ తోపాటు కడుపుబ్బరం వంటి జీర్ణాశయ సమస్యలనూ నివారించే ఔషధ గుణాలు ఇందులో ఉన్నాయి.
మునగ కాయలతోపాటు మునగాకులో ఆరెంజ్ కంటే ఏడు రెట్లు ఎక్కువగా విటమిన్ సీ ఉంటుంది. అరటిపండులో ఉండే పోటాషియం కంటే 15 రెట్లు ఎక్కువ పోటాషియం ఉంటుంది. ఇది మునగతో 300కు పైగా వ్యాధులకు చికిత్స అందివచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆస్త్మా, ఆర్థరైటిస్, డయాబెటిక్ పేషంట్లకు చికిత్సలో మునగాకును వాడుతుంటారు.
లివర్ గార్డియన్:
మునగాకు కాలేయాన్ని రక్షించడంతో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. దెబ్బతిన్న కాలేయ కణాలను సరిచేయడానికి, ఆక్సీకరణ స్థాయిలను తగ్గించడానికి, ప్రోటీన్ స్థాయిలను మెరుగుపరచడంతో సహాయపడుతుంది.
Also Read : రోజుకు రెండు ఏలకులు బుగ్గన పెట్టుకుంటే, డాక్టర్‌తో పనే ఉండదట - ఎందుకో తెలుసా?
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)