Unhealthy Food Combination: అరటి పండుతో వీటిని కలిపి తింటున్నారా? చాలా ప్రమాదం, ఎందుకంటే..
Banana: అరటిపండు మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ప్రతిరోజూ ఒక అరటిపండు తింటే మీ ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదు. అయితే కొన్నిపదార్థాలు అరటిపండుతో కలిపి అస్సలు తినకూడదు. అవేంటో చూద్దాం.
Unhealthy Food Combination: అరటిపండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రతిరోజూ ఒక అరటి పండు తింటే ఎలాంటి అనారోగ్య సమస్యలు రావని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అరటి పండులో చాలా ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఫైబర్, ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, సమృద్ధిగా పోషణకు అవసరమైన అనేక ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఆయుర్వేదం ప్రకారం... అరటిపండుతోపాటు కొన్ని రకాల పదార్థాలు అస్సలు తినకూడదు. అలా తింటే ఎన్నో అనారోగ్య సమస్యల బారినపడే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అయితే నిత్యం ఒక అరటిపండు తింటే గుండె పదికాలాల పాటు పదిలంగా ఉంటుందని చెబుతుంటారు. అయితే కొన్ని కాంబినేష్లనతో అరటిపండు తినడం అస్సలు మంచిది కాదట.
అరటిపండుతో తినకూడని 4 పదార్థాలు ఇవే:
1. పాలు అరటిపండు:
ఆయుర్వేదం ప్రకారం పాలతో అరటిపండు అస్సలు తినకూడదు. చాలా మంది పాలు అరటి పండు కలిపి తింటే ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. అరటిపండు ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. పాలు తియ్యగా ఉంటాయి. ఈ రెండు కాంబినేషన్ కడుపులో గందరగోళాకానికి కారణం అవుతాయి. జీర్ణసమస్యలకు దారి తీస్తుంది. ఈ రెండింటిని కలిపి తింటే జీర్ణ సంబంధిత వ్యాధులు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు కడుపు ఉబ్బరం, దగ్గు, ఇతర అనారోగ్య సమస్యలకు కారణం అవుతుందని చెబుతున్నారు.
2. రెడ్ మీట్, అరటిపండు:
మాంసాహారంతోపాటు అరటిపండును అస్సలు తినకూడదు. అరటిపండులో ప్యూరిన్ ఉంటుంది. ఇది సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. కానీ రెడ్ మీట్ లో ఉండే అధిక ప్రొటీన్ కంటెంట్ జీర్ణక్రియ ప్రక్రిను అడ్డుకుంటుంది. ఈ రెండు పదార్థాలు కలిపి తిన్నప్పుడు జీర్ణవ్యవస్థలో కిణ్వ ప్రక్రియ, గ్యాస్ట్రిక్ సమస్యను కలిగిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
3. బ్రెడ్, అరటి:
చాలా మంది ఉదయం అల్పాహారంలో బ్రెడ్ తోపాటు అరటి పండు తింటుంటారు. అయితే ఈ కాంబినేషన్ ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదట. బ్రెడ్, రొట్టెలు, ప్రాసెస్ చేసిన పిండిపదార్థాలు జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. అరటి పండు తొందరగా జీర్ణం అవుతుంది. వ్యతిరేక స్వభావం కలిగిన ఈ రెండు ఆహారాలు తినడం వల్ల జీర్ణ అసమతుల్యత ప్రమాదాన్ని పెంచుతాయి. ఇవి అనేక అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది.
4. సిట్రస్ పండ్లతో అరటి:
ఆయుర్వేదం ప్రకారం, విరుద్ద ఆహార పదార్థాలు తినడం వల్ల వాత, పిత్త, కఫాలలో అసమతుల్యత ఏర్పడుతుంది. అందుకే తీపి స్వభావం కలిగిన అరటిపండుతో పాటు నిమ్మ, దానిమ్మ, స్ట్రాబెర్రీ మొదలైన ఆమ్ల, సబ్-యాసిడ్ పండ్లకు దూరంగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. నిజానికి అరటిపండ్లు, ఆమ్ల పండ్లను కలిపి తింటే వికారం, తలనొప్పి మొదలైన సమస్యలు తలెత్తుతాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
Also Read : బరువు తగ్గాలనుకుంటే కొత్తిమీర రైస్ ట్రై చేయండి.. రెసిపీ ఇదే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.