News
News
X

Apricot: ఆప్రికాట్ పండ్ల సీజన్ వచ్చేసింది, అతిగా తిన్నారో ఈ సమస్యలు తప్పవు

ఎంతో రుచికరమైన ఆప్రికాట్ పండ్లు వేసవి కాలంలో అందుబాటులో ఉంటాయి. ఇవి కంటి ఆరోగ్యానికి చాలా మంచిది కానీ మితంగా తీసుకోవాలి.

FOLLOW US: 
Share:

ఎండలు మండిపోతున్నాయి. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచే పండ్లు తీసుకోవడంతో పాటు కాలానుగుణ పండ్లు తీసుకోవడం కూడా చాలా ముఖ్యం. ఈ సీజన్ లో లభించే పండు ఆప్రికాట్. గోల్డెన్ ఎల్లో కలర్ లో ఉండే ఈ పండులో విటమిన్ ఏ, బీటా కెరోటిన్, ఇతర కెరొటీనాయిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మాక్యులర్ డిజేనరేషన్, కంటి శుక్లం వంటి వివిధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఆప్రికాట్లు అద్భుతంగా పని చేస్తాయి. పురాతన కాలంలో రోమన్లు ఈ పండ్లు కనుగొన్నారు.

ఆప్రికాట్లో ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్ ఆమ్లాలు, కెరొటీనాయిడ్లు, అస్పోలిఫెనాల్స్ వంటి వివిధ ఫైటోకెమికల్స్ ఉన్నాయి. ఇవి వాటికి మంచి రంగు, రుచి, పోషక విలువలు అందిస్తాయి. వీటిని తాజాగా తినడమే కాదు డ్రై ఫ్రూట్స్ గా కూడా చేసుకుని తింటారు. ఇవి వంటలలో రుచిని పెంచుతాయి. విటమిన్లు, ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం ఒక కప్పు ఎండిన ఆప్రికాట్ లో పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్నాయి. గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెంచేందుకు దోహదపడుతుంది. ఇందులోని కాల్షియం ఎముకలు బలంగా మారేందుకు సహకరిస్తుంది. ఐరన్ ఉండటం వల్ల ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. రక్తహీనత సమస్యల నుంచి బయట పడేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఇతర ఆహార పదార్థాల మాదిరిగానే దీన్ని కూడా మితంగా తీసుకోవాలి. లేదంటే పలు ఆరోగ్య సమస్యలను తీసుకొస్తాయి.

జీర్ణ సమస్యలు

ఆప్రికాట్లు ఫైబర్ తో నిండి ఉంటాయి. శరీరానికి ఫైబర్ ఎంతో అవసరమైన ఖనిజం. పేగు కదలికలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అయితే అధికంగా ఫైబర్ తీసుకుంటే అనేక దుష్ప్రభావాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆప్రికాట్లు ఎక్కువగా తింటే కడుపు చికాకు పెడుతుంది. తిమ్మిరి, ఉబ్బరం, కడుపు నొప్పి, మలబద్ధకం, విరోచనాలకు కారణంఅవుతుంది.

బరువు పెరుగుతారు

అమితంగా వీటిని తింటే అనారోగ్యకరమైన బరువు పెరిగే అవకాశం ఉంటుంది. దాని వల్ల ఊబకాయం సమస్య ఏర్పడుతుంది.

తలనొప్పి

ఆప్రికాట్ గింజల్లో అమిగ్డాలిన్ అనే సమ్మేళనం పుష్కలంగా ఉంటుంది. దీన్ని అతిగా తీసుకుంటే సైనేడ్ గా మారుతుంది. ఫలితంగా వికారం, తలనొప్పి, విపరీతమైన దాహం, నీరసం, ఆందోళన, జ్వరం, కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు వస్తాయి. రక్తపోటు స్థాయిలు పడిపోతాయి.

అలర్జీలు

అలర్జీలతో బాధపడే వాళ్ళు వీటిని తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎండబెట్టిన ఆప్రికాట్లు సల్ఫైట్ లను కలిగి ఉంటుంది. ఇవి ఆస్తమాని తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. ఉబ్బసం బారిన పడే ప్రమాదం ఉంది.

రోజుకి ఎన్ని తినాలి?

యూఎస్ డిపార్ట్ మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రకారం ప్రతిరోజు 1-2 కప్పుల ఆప్రికాట్ పండ్లని తినాలి. 30 గ్రాములు ఉండే ఒక  పండు లేదా 3-4 ఎండిన ఆప్రికాట్లు తీసుకుంటే సరిపోతుంది. రాత్రిపూట నీటిలో నానబెట్టి ఉదయం ఖాళీ కడుపుతో తింటే ఆరోగ్యమైన ప్రయోజనాలు పొందవచ్చని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Also Read: మహిళలూ ఇవి తిన్నారంటే గుండెపోటు వచ్చే అవకాశం తక్కువ

Published at : 06 Mar 2023 02:40 PM (IST) Tags: Seasonal Fruits Apricot Apricot Side Effects Benefits Of Apricot Apricot Season

సంబంధిత కథనాలు

Lemon Water: రోజూ నిమ్మరసం తాగుతున్నారా? దాని వల్ల ఎన్ని ప్రమాదాలున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Lemon Water: రోజూ నిమ్మరసం తాగుతున్నారా? దాని వల్ల ఎన్ని ప్రమాదాలున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Brain Health: మీ జ్ఞాపకశక్తి పెంచుకోవాలంటే ఈ ఆహారాన్ని మెనూలో తప్పకుండా చేర్చాల్సిందే

Brain Health: మీ జ్ఞాపకశక్తి పెంచుకోవాలంటే ఈ ఆహారాన్ని మెనూలో తప్పకుండా చేర్చాల్సిందే

గురక ఇబ్బంది పెడుతోందా? ఈ సింపుల్ వ్యాయామాలతో పూర్తిగా ఉపశమనం

గురక ఇబ్బంది పెడుతోందా? ఈ సింపుల్ వ్యాయామాలతో పూర్తిగా ఉపశమనం

Ugadi Recipes: ఉగాదికి సింపుల్‌గా చేసే నైవేద్యాలు ఇవిగో, రుచి అదిరిపోతుంది

Ugadi Recipes: ఉగాదికి సింపుల్‌గా చేసే  నైవేద్యాలు ఇవిగో, రుచి అదిరిపోతుంది

World Down Syndrome Day: పిల్లల్లో డౌన్ సిండ్రోమ్ ఎందుకు వస్తుంది? రాకుండా ముందే అడ్డుకోగలమా?

World Down Syndrome Day: పిల్లల్లో డౌన్ సిండ్రోమ్ ఎందుకు వస్తుంది? రాకుండా ముందే అడ్డుకోగలమా?

టాప్ స్టోరీస్

Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు

Teenmar Mallanna Arrest: తీన్మార్ మల్లన్న అరెస్ట్, క్యూ న్యూస్ ఆఫీసులో పలు డివైజ్ లు సీజ్ - బండి సంజయ్ మండిపాటు

Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు

Kavitha ED Enquiry: ముగిసిన కవిత ఈడీ విచారణ, మూడోసారి సుదీర్ఘంగా ప్రశ్నించిన అధికారులు - 22న విచారణ లేదు

Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి

Happy Ugadi Wishes in Telugu 2023:మీ బంధుమిత్రులకు ఈ కొటేషన్స్ తో శ్రీ శోభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేయండి

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా

Rangamarthanda Movie Review - 'రంగమార్తాండ' రివ్యూ : ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం హీరోలుగా కృష్ణవంశీ తీసిన సినిమా