అన్వేషించండి

Dehydration: వేసవిలో డీహైడ్రేషన్ బారిన పడకూండా ఉండాలంటే ఈ డ్రింక్స్ దూరం పెట్టండి

వేసవి తాపాన్ని తగ్గించుకోవడం కోసం ఎక్కువ మంది కూల్ డ్రింక్స్, సోడా మీద ఆధారపడతారు. కానీ ఇవి శరీరాన్ని డీహైడ్రేషన్ బారిన పడేలా చేస్తాయి.

సూర్యుడు ఉగ్రరూపం దాల్చి నిప్పులు కురిపిస్తున్నాడు. వేగవంతమైన జీవనశైలిలో వేడి, తేమ శరీరాన్ని దెబ్బతీస్తాయి. అలసట, నిర్జలీకరణం, వేడి సంబంధిత అనారోగ్యాలని నివారించడానికి వేసవిలో హైడ్రేట్ గా ఉండటమే అన్నింటికీ మంచి పరిష్కారం. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి నీటితో పాటు చల్లగా ఉండే చక్కెర, కెఫిన్ పానీయాలు తాగుతారు. సోడాలు, కోలా, ప్రాసెస్ చేసిన రసాలు వంటి పానీయాలు అధిక చక్కెరతో నిండి ఉంటాయి. ఇవి శక్తి స్థాయిలను సమతుల్యంగా ఉంచేందుకు శరీరంపై మరింత ఒత్తిడిని కలిగిస్తాయి. వీటిని తరచుగా తీసుకుంటే బరువు పెరగడం, పళ్ళు పుచ్చిపోవడం, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. అందుకే ఈ పానీయాలకు వేసవిలో తప్పనిసరిగా దూరంగా ఉండాలి.

ఛాయ్: వేసవిలో మసాలా ఛాయ్, కాఫీ వంటి వేడి పానీయాలు తాగడం మానుకోండి. ఎందుకంటే ఇవి పొట్టపై అదనపు వేడిని కలిగిస్తాయి. శరీర ఉష్ణోగ్రతను పెంచుతాయి. వేడిని మరింత ఎక్కువ చేయడం వల్ల శరీరం దాన్ని తట్టుకోలేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

సోడా: చక్కెర, కెఫీన్, కృత్రిమ స్వీటేనర్లతో నిండిన కోలా, సోడాలు వంటి కార్బో =నేటెడ్ పానీయాలను నివారించాలి. అవి శరీరాన్ని త్వరగా డీహైడ్రేట్ చేస్తాయి. అనేక ఆరోగ్య సమస్యలకు దారి తీస్తాయి. వాటికి బదులు మజ్జిగ, ఛాస్, నిమ్మరసం, పుచ్చకాయ, కొబ్బరి నీళ్ళు వంటివి తీసుకోవడం మంచిది.

పండ్ల రసాలు: సీజనల్ వారీగా వచ్చే తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. కానీ పండ్ల రసాలు ఆరోగ్యానికి మేలు చేసే దాని కంటే హాని ఎక్కువ కలిగిస్తాయి. ప్రాసెస్ చేసిన పండ్ల రసాల్లో అధిక మొత్తంలో షుగర్ ఉంటుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడానికి కారణమవుతాయి. మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది.

ఆల్కాహాల్: వేసవిలో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ కి ఎక్కువగా దారి తీస్తుంది. తలనొప్పి, తల తిరగడం, అలసట వంటి ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి.

ఎనర్జీ డ్రింక్స్: అధిక స్థాయిలో కెఫీన్ కలిగిన ఎనర్జీ డ్రింక్స్ తాగితే అప్పటికప్పుడు తక్షణ శక్తి లభిస్తుంది. కానీ కాసేపటికే ఇవి శరీరం నుంచి మొత్తం శక్తిని ఖాళీ చేసేస్తాయి.

మిల్క్ షేక్: మిల్క్ షేక్ వంటి పాల ఆధారిత పానీయాలు జీర్ణక్రియ సమస్యలను కలిగిస్తాయి. గ్యాస్, ఉబ్బరం వంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. పొట్టలో అసౌకర్యంగా ఉంటుంది.

స్పోర్ట్స్ డ్రింక్స్: అధిక స్థాయిలో చక్కెర తీసుకుంటే ఎలక్ట్రోలైట్స్ కోల్పోయేలా చేస్తాయి. శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తాయి. అధిక రక్తపోటు, మూత్రపిండాలు దెబ్బతినడం వంటి ఇతర ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. వేసవిలో హైడ్రేట్ గా ఉండాలంటే నీరు లేదా కొబ్బరి నీళ్ళు తాగడం మంచిది. ఈ అనారోగ్యకరమైన చక్కెర పానీయాలకు బదులుగా చక్కెర కంటెంట్ తక్కువగా ఉన్న సహజ పండ్ల రసాలు ఎంచుకోవాలని ఆరోగ్య నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.  

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Also Read: మిగిలిపోయిన అన్నం తింటే ప్రమాదమా? నిపుణులు ఏం చెప్తున్నారు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nagababu Pithapuram Tour: పిఠాపురంలో నాగబాబుకు నిరసన సెగ, రెండోరోజూ వదలని టీడీపీ, వర్మ మద్దతుదారులు!
పిఠాపురంలో నాగబాబుకు నిరసన సెగ, రెండోరోజూ వదలని టీడీపీ, వర్మ మద్దతుదారులు!
Maoist Surrendered: 86 మంది మావోయిస్టుల లొంగుబాటు, వారికి గరిష్టంగా రూ.4 లక్షల రివార్డు: పోలీసుల ప్రకటన
86 మంది మావోయిస్టుల లొంగుబాటు, వారికి గరిష్టంగా రూ.4 లక్షల రివార్డు: పోలీసుల ప్రకటన
Tirupati Crime News: ఫ్రెండ్ ఫ్యామిలీనే కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు - ఇలాంటి స్నేహితులూ ఉంటారు !
ఫ్రెండ్ ఫ్యామిలీనే కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు - ఇలాంటి స్నేహితులూ ఉంటారు !
Dhoni IPL Retirement: ఐపీఎల్ మ్యాచ్‌కు ధోనీ పేరెంట్స్‌- రిటైర్మెంట్‌పై జోరుగా ఊహాగానాలు !
ఐపీఎల్ మ్యాచ్‌కు ధోనీ పేరెంట్స్‌- రిటైర్మెంట్‌పై జోరుగా ఊహాగానాలు !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni May Lead CSK vs DC IPL 2025 | కెప్టెన్ రుతురాజ్ కు గాయం..ఢిల్లీతో మ్యాచ్ కు దూరం..?Rishabh Pant Failures in IPL 2025 |  LSG vs MI మ్యాచులోనూ చెత్తగా అవుటైన పంత్Hardik Pandya vs LSG IPL 2025 |  LSG తో మ్యాచ్ లో పాండ్యా ఏం చేసినా గెలవలేదుTilak Varma Retired out | LSG vs MI మ్యాచ్ లో అతి చెత్త నిర్ణయం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nagababu Pithapuram Tour: పిఠాపురంలో నాగబాబుకు నిరసన సెగ, రెండోరోజూ వదలని టీడీపీ, వర్మ మద్దతుదారులు!
పిఠాపురంలో నాగబాబుకు నిరసన సెగ, రెండోరోజూ వదలని టీడీపీ, వర్మ మద్దతుదారులు!
Maoist Surrendered: 86 మంది మావోయిస్టుల లొంగుబాటు, వారికి గరిష్టంగా రూ.4 లక్షల రివార్డు: పోలీసుల ప్రకటన
86 మంది మావోయిస్టుల లొంగుబాటు, వారికి గరిష్టంగా రూ.4 లక్షల రివార్డు: పోలీసుల ప్రకటన
Tirupati Crime News: ఫ్రెండ్ ఫ్యామిలీనే కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు - ఇలాంటి స్నేహితులూ ఉంటారు !
ఫ్రెండ్ ఫ్యామిలీనే కిడ్నాప్ చేసి డబ్బులు డిమాండ్ చేశారు - ఇలాంటి స్నేహితులూ ఉంటారు !
Dhoni IPL Retirement: ఐపీఎల్ మ్యాచ్‌కు ధోనీ పేరెంట్స్‌- రిటైర్మెంట్‌పై జోరుగా ఊహాగానాలు !
ఐపీఎల్ మ్యాచ్‌కు ధోనీ పేరెంట్స్‌- రిటైర్మెంట్‌పై జోరుగా ఊహాగానాలు !
HCU Controversy: ఫ్యూచర్ సిటీకి HCU తరలింపు - కంచ గచ్చిబౌలి, వర్శిటీ స్థలాల్లో అతి పెద్ద ఎకోపార్క్ - రేవంత్ సంచలనం
ఫ్యూచర్ సిటీకి HCU తరలింపు - కంచ గచ్చిబౌలి, వర్శిటీ స్థలాల్లో అతి పెద్ద ఎకోపార్క్ - రేవంత్ సంచలనం
Shock : ఎవర్ని పట్టుకున్న షాక్ కొడుతోందా ?- అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే
ఎవర్ని పట్టుకున్న షాక్ కొడుతోందా ?- అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే
Telangana VS Andhra Pradesh: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, బనకచర్ల ప్రాజెక్టులపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్న తెలంగాణ ప్రభుత్వం
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, బనకచర్ల ప్రాజెక్టులపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్న తెలంగాణ ప్రభుత్వం
NTR: 'ఆయన ఓ గొప్ప నటుడు, మంచి టీమ్ మేట్' - ఎన్టీఆర్‌‌తో 'వార్ 2'పై బాలీవుడ్ హీరో హృతిక్ ఏమన్నారంటే?
'ఆయన ఓ గొప్ప నటుడు, మంచి టీమ్ మేట్' - ఎన్టీఆర్‌‌తో 'వార్ 2'పై బాలీవుడ్ హీరో హృతిక్ ఏమన్నారంటే?
Embed widget