Bloating: ఈ కూరగాయలు రాత్రి వేళ తిన్నారో ఇక మీకు నిద్రకరువే
నైట్ తీసుకునే డిన్నర్ ఎప్పుడు తేలికగా ఉండే ఆహారం ఎంచుకోవాలి. లేదంటే అవి అజీర్ణం కావడం కష్టమవడమే కాదు నిద్ర కూడా పోనివ్వకుండా ఇబ్బంది పెట్టేస్తాయి.
కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకుంటే పొట్ట ఉబ్బరంగా అనిపిస్తుంది. గ్యాస్ ఉత్పత్తి లేదా ద్రవాలు నిలుపుకోవడం వల్ల పొత్తి కడుపు బిర్రుగా పట్టేసినట్టు అసౌకర్యంగా ఉంటుంది. చాలా వేగంగా తినడం, కొవ్వు అధికంగా ఉండే ఆహారాలు తినడం, అతిగా తినడం, ఒత్తిడి, హార్మోన్ల మార్పులు, మలబద్ధకం వంటి అనేక అంశాలు ఉబ్బరానికి దోహద పడతాయి. ఈ సమస్యన్ని తగ్గించుకోవడానికి ప్రభావవంతమైన మార్గం కొన్ని ఆహారాలు దూరం పెట్టడమే. ముఖ్యంగా రాత్రి భోజన సమయంలో శరీరం ఆహారం జీర్ణం చేసుకోవడం కాస్త కష్టంగా ఉంటుంది. అటువంటి సమయంలో పొట్ట ఉబ్బరం ఫీలింగ్ ఎక్కువగా అనిపిస్తుంది. ఈ కూరగాయలు మీరు రాత్రి వేళ తినకపోవడమే మంచిది. లేదంటే పొట్ట ఉబ్బరంతో నిద్రకూడ సరిగా పోలేరు.
బ్రకోలి
ఇది క్రూసిఫెరస్ వెజిటేబుల్, అనేక రకాల పోషకాలను కలిగి ఉంటుంది. ఇందులో రాఫినోస్ అనే చక్కెర ఉంటుంది. ఇది జీర్ణం కావడం కష్టం. ఇది గ్యాస్, ఉబ్బరానికి దారితీస్తుంది. బ్రకోలిని సాయంత్రం ఆలస్యంగా తినడం వల్ల అజీర్ణం, నిద్రకు ఆటంకం ఏర్పడుతుంది.
బ్రస్సెల్స్ మొలకలు
ఇవి కూడా క్రూసిఫరస్ కూరగాయల కుటుంబానికి చెందినవే. ఇందులోని రాఫీనోస్ ఉంటుంది. దానితో పాటు ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. గ్యాస్, ఉబ్బరం కలిగిస్తుంది. అందుకే బ్రస్సెల్స్ మొలకలు తీసుకోవడం పరిమితం చేయాలి. లేదంటే నైట్ నిద్రపోవడం కష్టమే.
కాలీఫ్లవర్
అనేక పోషకాలు కలిగిన కాలీఫ్లవర్ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. వాటిలో సల్ఫోరాఫెన్ అనే సమ్మేళనం ఉంటుంది. గ్యాస్ సమస్యని కలిగిస్తుంది. ఇందులో అధిక మొత్తంలో ఫైబర్ కూడా ఉంటుంది. జీర్ణం కావడం కష్టం.
క్యాబేజీ
అత్యంత పోషకాలు నిండిన కూరగాయాల్లో క్యాబేజీ ఒకటి. అధిక ఫైబర్, రాఫీనోస్ ఉన్న క్యాబేజీ రాత్రి పూట తింటే అరుగుదల సమస్యలు ఏర్పడతాయి. దీని వల్ల ప్రశాంతంగా నిద్రపోవడం కష్టమవుతుంది. అందుకే అల్పాహారం లేదా మధ్యాహ్న భోజనంలో మాత్రమే క్యాబేజీని జోడించుకోవడం మంచిది.
ఉల్లిపాయలు
ఉల్లిపాయ లేకుండా ఏ కూర తాలింపు ఉండదు. కానీ ఇది రాత్రి పూట తినడం మంచిది కాదు. ఇందులో ఫ్రక్టానలు ఉంటాయి. ఇది ఒకరకమైన కార్బోహైడ్రేట్. ఫైబర్ అధికంగా ఉంటుంది. నైట్ తింటే గ్యాస్ ఉబ్బరం సమస్యని మరింత తీవ్రతరం చేస్తుంది. అందుకే వీలైనంత వరకు డిన్నర్ సమయంలో ఉల్లిపాయ తీసుకోకుండా ఉండటమే మంచిది.
వెల్లుల్లి
యాంటీ బ్యాక్టీరియల్, పోషక గుణాలు కలిగిన వెల్లుల్లి ఆరోగ్య ప్రయోజనాలు అందించే సూపర్ ఫుడ్. కానీ ఇందులోనూ ఫ్రక్టానలు ఉన్నాయి. నిద్రకు అంతరాయం కలిగించే యాసిడ్ రిఫ్లక్స్ కు కారణమవుతుంది.
బఠానీలు
యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అయితే బఠానీల్లోని అధిక ఫైబర్, ఫ్రక్టోజ్ కారణంగా ఉబ్బరం కలిగిస్తుంది. వాటిలో షుగర్ ఆల్కాహాల ఉంటాయి. ఇవి జీర్ణ సమస్యలను కలిగిస్తాయి.
చిలగడదుంపలు
తీపి బంగాళాదుంపల్లో ఫైబర్, పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. కానీ కొంతమందికి అవి జీర్ణం కావడం కష్టం. స్టార్చ్ అనే కార్బోహైడ్రేట్ ఉంటుంది. అధిక మొత్తంలో వీటిని తీసుకుంటే గ్యాస్, ఉబ్బరం సమస్యలు కలిగిస్తాయి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: ఈ పనులు అతిగా చేస్తే బ్రెయిన్ ట్యూమర్ వస్తుందట, జాగ్రత్త