Ice Facial: ఐస్ ఫేషియల్‌తో మతిమరపు సమస్య పోతుందా? ఈ బెనిఫిట్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు
ఐస్ ఫేషియల్ ఒక్క అందానికి మాత్రమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాల్ని ఇస్తుంది. ప్రమాదకరమైన వ్యాధుల బారిన పడకుండా కాపాడుతుంది.
చిన్న ఐస్ ముక్క రెండు నిమిషాలు పట్టుకుని చూడండి. రెండు నిమిషాలు కాదు కదా రెండు సెకన్లు కూడా చేతిలో ఉంచుకోలేరు. ఎందుకంటే దాని చల్లదనం వల్ల చేతులు బిర్రుగా స్పర్శ లేకుండా అయిపోతాయి. మరి అలాంటిది ఐస్ ఫేషియల్ చేయించుకుంటే పరిస్థితి ఏంటి? అసలొద్దు బాబోయ్.. అనుకుంటున్నారా? కానీ, ఇది మీకు గులాబీ రంగుని అందిస్తుంది. ఐస్ క్యూబ్స్ చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది. ఐస్ ఫేషియల్ లేదా స్కిన్ ఐసింగ్ అని అంటారు. ఇది రక్తం వేగంగా ప్రసరించేలా చేస్తుంది.
ఐస్ ఫేషియల్ ఎలా వచ్చింది?
ఆవిరయ్యే నత్రజని చర్మాన్ని చల్లబరచడానికి ఉపయోగపడుతుంది. దీన్ని క్రయోథెరపీ చికిత్స అంటారు. ఈ టెక్నిక్ ని జపాన్ లో 1978 లో రుమటాలజిస్ట్ డాక్టర్ తోషిమా యమగుచి అభివృద్ధి చేశారు. ఈ చికిత్స ప్రధానంగా రుమాటిక్ ఆర్థరైటిస్ చికిత్సకు ఉపయోగిస్తారు. కానీ ఇది ఇప్పుడు చర్మాన్ని పునరుద్దరించడానికి వినియోగిస్తున్నారు. మైగ్రేన్ నొప్పి, చర్మ వ్యాధుల చికిత్సకు విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. క్రయోథెరపీ అనేది నాన్ ఇన్వాసివ్ మెషీన్ ఆపరేటెడ్ ట్రీట్మెంట్ డివైజ్. ముఖం లేదా శరీరంపై లిక్విడ్ నత్రజని పంప్ చేస్తారు. చర్మాన్ని ప్రకాశవంతం చేయడానికి రంథ్రాలు బిగించి పెదాలు మృదువుగా మార్చేందుకు సహాయపడుతుంది. కేవలం 15 నిమిషాల్లో ఫైన్ లైన్స్ లేదా వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది.
మేకప్ మీద కూడా చేసుకోవచ్చు
క్రయోథెరపీ ముఖం, తల, చర్మం, మెడపై మాత్రమే కాకుండా కొన్ని సార్లు ఇతర శరీర భాగాల్లో కూడా చేస్తారు. ఇది చర్మాన్ని ప్రకాశవంతం చేయడమే కాకుండా ఇతర ప్రయోజనాలను కూడా అందిస్తుంది. నొప్పులని తగ్గించడంలో సహాయపడుతుంది. శరీరంపై చేస్తే దాన్ని శరీర క్రయోథెరపీ అంటారు.
ఐస్ ఫేషియల్ ప్రయోజనాలు
ఐస్ ఫేషియల్ స్కిన్ ప్రయోజనాలను అందిస్తుంది. శరీరంలో ఇన్ఫ్లమేషన్, మంటను తగ్గించడానికి ఐసింగ్ అవసరం. ఇది ముఖానికి కూడా వర్తిస్తుంది. ఐస్ ఫేసింగ్ దెబ్బలు, వాపులను తగ్గిస్తుంది. రొసెసియా, మొటిమలని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులోని ఇన్ఫ్లమేటరీ ఏజెంట్ గుణాల వల్ల చర్మాన్ని శాంతపరుస్తుంది.
మచ్చలు తగ్గిస్తుంది
చికాకు, మొటిమల వాపు, ఎరుపుని తగ్గించడంలో సహాయపడుతుంది. దెబ్బల వల్ల వచ్చే వాపుని తగ్గిస్తుంది. ప్రకాశవంతమైన చర్మాన్ని ఇవ్వడానికి సహాయపడుతుంది.
చర్మ రంధ్రాల పరిమాణం తగ్గింపు
అదనపు సెబమ్ కారణంగా విస్తరించిన రంధ్రాల పరిమాణం తగ్గించేందుకు సహకరిస్తుంది. ఐస్ ఫేషియల్ వల్ల రంధ్రాలు తగ్గిస్తుంది. మృదువైన చర్మాన్ని అందిస్తుంది.
ఎక్స్ ఫోలియేషన్
క్రయోథెరపీ మృతకణాలని ఎక్స్ ఫోలియేట్ చేయడంలో సహాయపడుతుంది. కొత్త కణాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. చర్మానికి రంగుని అందిస్తుంది.
ఇతర ప్రయోజనాలు
మైగ్రేన్, ఆర్థరైటిస్ నొప్పి లక్షణాలని తగ్గించడంలో సహాయపడుతుంది. మానసిక రుగ్మతలకు చికిత్స చేస్తుంది. క్యాన్సర్ కణాల పెరుగుదలని నిరోధిస్తుంది. అల్జీమర్స్ వ్యాధి, డీమెన్షియా ప్రమాదాన్ని తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటుందని నిరూపించబడింది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: కాలుష్యం ఎక్కువైతే గుండె ఆగిపోవడం ఖాయం - కొత్త అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడి