అన్వేషించండి

Low Blood Pressure: మీకు లో బీపీ ఉందా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ఆరోగ్య సమస్యలు తప్పవు

లో బీపీ ఉన్న వాళ్లు సరైన జాగ్రత్తలు తీసుకోరు. దీని వల్ల మరిన్ని ఆరోగ్య సమస్యల బారిన పడతారు.

హైపర్ టెన్షన్ లేదా హైబీపీ... దీన్ని తీసుకున్నంత సీరియస్‌గా ‘లో బీపీ’ని తీసుకోరు. బీపీ తక్కువగా ఉండే సమస్యను హైపో టెన్షన్ అంటారు. రక్త పోటు తక్కువగా ఉండడం కూడా ఒక ఆరోగ్య సమస్యగానే పరిగణించాలి. హైబీపీ వస్తే రోజు మందులు వేసుకోవాలి. కానీ లో బీపీకి ఆ అవసరం లేదు. కేవలం కొన్ని జాగ్రత్తలు, మంచి ఆహారం ద్వారా తేరుకోవచ్చు. అందుకేనేమో బీపీ తక్కువగా ఉండడాన్ని పట్టించుకోవడం లేదు. బీపీ తక్కువగా ఉంటే ఏమవువుతుందో తెలుసా? చదవండి మరి.

లోబీపీతో వచ్చే చిక్కులు ఇవే...
చూపు మసకబారుతుంది. ఆలోచనలు గందరగోళంగా ఉంటాయి. మీకు అన్నీ ఉన్నా ఏమీ లేనట్టు నిరాశగా ఫీలవుతుంటారు. శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపిస్తుంది. తలనొప్పి తరచూ వస్తుంటుంది. చిన్న గాయం తగిలినా రక్త స్రావం అవుతుంది. రక్తపోటు తక్కువగా ఉన్న వారు... వాతావారణంలో మార్పులను కూడా సరిగా తట్టుకోలేరు. కళ్లు తిరిగి పడిపోవడం వంటివి జరగవచ్చు. అంతేకాదు గుండెపోటు, గుండెకు సంబంధించి రోగాలు వచ్చే అవకాశం ఉంది. 

ఎంత రక్తపోటు ఉంటే...
ఆరోగ్యవంతమైన వ్యక్తి రక్తపోటు 120/80 ఉంటుంది. అంతకన్నా ఎక్కువంటే హైబీపీకి చేరువవుతున్నట్టు లెక్క.అదే రక్తపోటు 90/60 లేదా అంతకన్నా తక్కువుంటే లోబీపీ కిందకి లెక్క. వీళ్లు ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోకతప్పదు. 

ఏం చేయాలి?
1. లోబీపీ లేదా హైపో టెన్షన్ తో బాధపడేవారు రోజుకు 7 నుంచి 8 గ్లాసుల నీళ్లకు తగ్గకుండా తాగాలి. నీళ్లు తగ్గితే డీహైడ్రేషన్ కు గురై రక్తపోటు ఇంకా తగ్గుతుంది.

2. విటమిన్ బి12, ఫోలిక్ యాసిడ్, ఐరన్ అధికంగా ఉండే ఆహారాన్ని అధికంగా తినాలి. 

3. లో బీపీ కదా అని ఉప్పు బాగా వేసుకుని తినవద్దు. ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఉప్పు సాధారణంగానే వేసుకుని తినాలి. 

4. ఆహారాల ద్వారానే లోబీపీ సాధారణ స్థాయికి వచ్చేలా చేసుకోవాలి. ఒకేసారి అధికంగా తినే బదులు చిన్న చిన్న భోజనాలుగా తింటే మంచిది. శక్తి నిరంతరం అందుతుంది.బీపీ తగ్గే ప్రమాదం తప్పుతుంది. 

5. లోబీపీ ఉన్న వాళ్లకి కొబ్బరి నీళ్లు చాలా మేలు చేస్తాయి. రోజుకో గ్లాసుడు కొబ్బరి నీళ్లు తాగితే చాలా మంచిది. 

6. నిద్ర తగ్గినా కూడా బీపీ ఇంకా తగ్గిపోతుంది. కాబట్టి సరైన సమయానికి నిద్ర పోవాలి. కచ్చితంగా 8 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి. 

7. పండ్ల రసాలు బీపీ పేషెంట్లకు మంచివి. ముఖ్యంగా లోబీపీ ఉన్న వాళ్లు దానిమ్మ, బీట్ రూట్ జ్యూసులు తాగితే మంచిది. 

8. సోడియం అధికంగా ఉండే ఆహారాన్ని తినడం ద్వారా త్వరగా తేరుకోవచ్చు. చికెన్, గుడ్లు, పాప్ కార్న్, చీజ్,నిల్వ పచ్చళ్లు, సాస్‌లు, పొద్దు తిరుగుడు పువ్వు గింజలు, బ్రెడ్డులు,క్యారెట్లు, టమాటోలు, బ్రకోలి, క్యాబెజీ, ముల్లంగి, కీరాదోస, ఎర్ర క్యాప్సికం వంటివి అధికంగా తినాలి. పెరుగన్నంలో కాస్త ఉప్పు వేసుకుని రోజుకోసారి తిన్నా మంచిదే. అలాగని మరీ అధికంగా పచ్చి ఉప్పును వాడకూడదు. 

Also read: ఆ మొటిమల మందులు బ్రెయిన్ ట్యూమర్‌కు కారణం కావచ్చు

Also read: సముద్రాలు లేకపోతే మనుషులు బతకగలరా? అవి లేని ప్రపంచం ఎలా ఉంటుంది?

మరిన్ని చూడండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BRS Silver Jubilee Meeting: బీఆర్ఎస్ పాతికేళ్ల పండగకు ఆదివారం శ్రీకారం- ఎల్కతుర్తి సభకు తరలివెళ్తున్న గులాబీ దళం
బీఆర్ఎస్ పాతికేళ్ల పండగకు ఆదివారం శ్రీకారం- ఎల్కతుర్తి సభకు తరలివెళ్తున్న గులాబీ దళం
Chandrababu: కష్టపడి పనిచేసేవారికి అండగా ఉండటం మా బాధ్యత - ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
కష్టపడి పనిచేసేవారికి అండగా ఉండటం మా బాధ్యత - ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Gautam Gambhir: గౌతమ్ గంభీర్‌ను చంపేస్తానని బెదిరించిన వ్యక్తి అరెస్ట్, నిందితుడు ఎవరో తెలిస్తే షాక్ !
గౌతమ్ గంభీర్‌ను చంపేస్తానని బెదిరించిన వ్యక్తి అరెస్ట్, నిందితుడు ఎవరో తెలిస్తే షాక్ !
Telugu TV Movies Today: రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, శ్రీ విష్ణు ‘శ్వాగ్’ TO చిరు ‘ఇంద్ర’, పవన్ కళ్యాణ్ ‘బ్రో’ వరకు - ఈ ఆదివారం (ఏప్రిల్ 27) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, శ్రీ విష్ణు ‘శ్వాగ్’ TO చిరు ‘ఇంద్ర’, పవన్ కళ్యాణ్ ‘బ్రో’ వరకు - ఈ ఆదివారం (ఏప్రిల్ 27) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Thala Ajith in CSK vs SRH IPL 2025 | నిన్న చెన్నై అభిమానులకు ఒకే టికెట్ పై రెండు షోలుCSK Comparison With RCB Wins | IPL 2025 లో గతేడాది RCB మ్యాజిక్ రిపీట్ చేయలేకపోయిన CSKKavya Maraan Expression vs CSK IPL 2025 | హావభావాలతో మ్యాచ్ టెన్షన్ మొత్తం చూపించిన కావ్యామారన్CSK Failures in IPL 2025 | MS Dhoni కెప్టెన్ అయినా రాతను మార్చుకోలేకపోయిన CSK

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BRS Silver Jubilee Meeting: బీఆర్ఎస్ పాతికేళ్ల పండగకు ఆదివారం శ్రీకారం- ఎల్కతుర్తి సభకు తరలివెళ్తున్న గులాబీ దళం
బీఆర్ఎస్ పాతికేళ్ల పండగకు ఆదివారం శ్రీకారం- ఎల్కతుర్తి సభకు తరలివెళ్తున్న గులాబీ దళం
Chandrababu: కష్టపడి పనిచేసేవారికి అండగా ఉండటం మా బాధ్యత - ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
కష్టపడి పనిచేసేవారికి అండగా ఉండటం మా బాధ్యత - ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Gautam Gambhir: గౌతమ్ గంభీర్‌ను చంపేస్తానని బెదిరించిన వ్యక్తి అరెస్ట్, నిందితుడు ఎవరో తెలిస్తే షాక్ !
గౌతమ్ గంభీర్‌ను చంపేస్తానని బెదిరించిన వ్యక్తి అరెస్ట్, నిందితుడు ఎవరో తెలిస్తే షాక్ !
Telugu TV Movies Today: రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, శ్రీ విష్ణు ‘శ్వాగ్’ TO చిరు ‘ఇంద్ర’, పవన్ కళ్యాణ్ ‘బ్రో’ వరకు - ఈ ఆదివారం (ఏప్రిల్ 27) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, శ్రీ విష్ణు ‘శ్వాగ్’ TO చిరు ‘ఇంద్ర’, పవన్ కళ్యాణ్ ‘బ్రో’ వరకు - ఈ ఆదివారం (ఏప్రిల్ 27) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రవాద దాడి కేసు NIA చేతికి- హోంశాఖ కీలక ఆదేశాలు
పహల్గాం ఉగ్రవాద దాడి కేసు NIA చేతికి- హోంశాఖ కీలక ఆదేశాలు
Vijay Deverakonda: కశ్మీర్ ఇండియాదే... పాకిస్తాన్ మీద ఎటాక్ చేయాల్సిన పనే లేదు - విజయ్ దేవరకొండ
కశ్మీర్ ఇండియాదే... పాకిస్తాన్ మీద ఎటాక్ చేయాల్సిన పనే లేదు - విజయ్ దేవరకొండ
Balochistan War: పది మంది పాక్ సైనికుల్ని చంపేసిన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ - ఇక ఇండియాపై పోరాడగలరా ? - వీడియో
పది మంది పాక్ సైనికుల్ని చంపేసిన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ - ఇక ఇండియాపై పోరాడగలరా ? - వీడియో
IPL 2025 KKR VS PBKS Match Abandoned: పంజాబ్-కేకేఆర్ మ్యాచ్ ర‌ద్దు.. ఇరుజ‌ట్ల‌కు చెరో పాయింట్, ప్ర‌భ్ సిమ్రాన్, ప్రియాంశ్ మెరుపులు వృథా
పంజాబ్-కేకేఆర్ మ్యాచ్ ర‌ద్దు.. ఇరుజ‌ట్ల‌కు చెరో పాయింట్, ప్ర‌భ్ సిమ్రాన్, ప్రియాంశ్ మెరుపులు వృథా
Embed widget