అన్వేషించండి

World Brain Tumour Day: ఆ మొటిమల మందులు బ్రెయిన్ ట్యూమర్‌కు కారణం కావచ్చు

బ్రెయిన్ ట్యూమర్ అనేది ఒక ప్రమాదకరమైన ఆరోగ్యపరిస్థితి. ఇది జీవితాన్నే తలకిందులు చేస్తుంది.

బ్రెయిన్ ట్యూమర్ అంటే మెదడులో కణితులు ఏర్పడే ఒక ప్రమాదకరమైన ఆరోగ్యస్థితి. మెదడులో ఏర్పడిన కణితులను చికిత్స చేయడం చాలా కష్టం. శరీర పనితీరుపై ఆ కణితుల ప్రభావం పడుతుంది. నిజానికి కణితులు ఏర్పడినప్పటికీ ప్రజలు ఆ విషయాన్ని గుర్తించలేరు. దానికి కారణం అవగాహన లేమి. కొన్ని రకాల లక్షణా ద్వారా బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందేమో అని అనుమానించవచ్చు. 

1. తలనొప్పి తరచుగా రావడం
2. జ్ఞాపకశక్తి తగ్గడం
3. వాంతులు, వికారంగా అనిపించడం
4. చూపు మసకబారడం
5. విపరీతంగా అలసటగా అనిపించడం
6. సరిగా వినిపించకపోవడం
7. నడక తడబడడం
8. అధికంగా తిమ్మిర్లు పట్టడం
పై లక్షణాలన్నీ బ్రెయిన్ ట్యూమర్ ఉన్నవారిలో కనిపిస్తాయి.ఈ సమస్య రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. పై లక్షణాలు తరచూ వేధిస్తుంటే మాత్రం కచ్చితంగా వైద్యుడిని కలవాలి.బ్రెయిన్ ట్యూమర్ రావడానికి కొన్ని రకాల మందులు కూడా కారణం కావచ్చని ఒక అధ్యయనం చెబుతోంది. 

ఈ చికిత్స వల్ల రావచ్చు
క్యాన్సర్, త్వరగా యుక్త వయసుకు రావడం, అధికంగా శరీరంలో జుట్టు పెరగడం, మొటిమలు అధికంగా రావడం వంటి సమస్యలకు అధునాత చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అందులో ఒకటి హార్మోన్ల చికిత్స. ఈ చికిత్సలో భాగంగా స్టెరాయిడ్లను ఉపయోగిస్తారు. ముఖ్యంగా మహిళలకే ఈ హార్లోన్ల చికిత్సలు అవసరం పడుతుంటాయి. అయితే ఈ చికిత్స వల్ల మెదడులో కణితులు ఏర్పడే ప్రమాదం అధికమని వైద్యులు హెచ్చిరిస్తున్నారు. 

ఇదే ఆ ఔషధం
సైప్రోటెరోన్ అసిటేట్ అనే మందును తీవ్రమైన మొటిమల సమస్యలున్న మహిళలకు ఇస్తారు. ఈ మందును ఇథినైల్ ఓస్ట్రాడియోల్ తో కలిపి స్టెరాయిడ్ లా మార్చి ఇస్తారు. ఈ స్టెరాయిడ్ అధికంగా వాడడం వల్ల మెదడులో కణితులు వచ్చే ప్రమాదం ఏడు రెట్లు పెరుగుతుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. కాబట్టి ఈ స్టెరాయిడ్ వాడిన వారు కచ్చితంగా బ్రెయిన్ స్కానింగ్ చేయించుకోమని సూచిస్తున్నారు. ఈ స్టెరాయిడ్ రోజుకు 25mg నుంచి 100mg వరకు వేసుకోమని ఇస్తుంటారు. ఇది మెనింగియోమా అనే బ్రెయిన్ ట్యూమర్ ఏర్పడే అవకాశాన్ని పది రెట్లు వరకు పెంచుతుంది. 

కాబట్టి ఇప్పటికే మొటిమలు తగ్గేందుకు, శరీరంపై అధిక జుట్టు పెరగకుండా అడ్డుకునేందుకు స్టెరాయిడ్లు వాడిన వారు, ఇతర హార్మోన్ల చికిత్సలు తీసుకున్న వారు ఓసారి బ్రెయిన్ స్కానింగ్ చేయించుకుంటే మంచిది.   

Also read: సముద్రాలు లేకపోతే మనుషులు బతకగలరా? అవి లేని ప్రపంచం ఎలా ఉంటుంది?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Delhi: నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
AP Rains: వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ISKCON Monk Chinmoy Krishna Das Arrest In Bangladesh | బంగ్లాదేశ్ లో మైనార్టీలపై హింసకు ఇదే నిదర్శనం | ABP DesamKCR Send off Madireddy Srinivas | ఆత్మీయుడిని అమెరికాకు పంపించిన కేసీఆర్ | ABP Desamతిరుచానూరులో శాస్త్రోక్తంగా ధ్వజారోహణంఎస్పీకి ఊరి జనం ఊరేగింపు, వారి ఆగ్రహాన్ని ఎలా పోగొట్టారు?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Delhi: నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
నాలుగు రోజులు ఢిల్లీలో పవన్ పాలిటిక్స్ - జాతీయ రాజకీయాల వైపు అడుగేస్తున్నారా ?
Telangana News: తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
తెలంగాణకు కేంద్రం గుడ్ న్యూస్ - కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ
AP Rains: వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
వాయుగుండం ప్రభావం - ఏపీలోని ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Minister Konda Surekha: మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
మంత్రి కొండా సురేఖకు బిగ్ షాక్ - పరువు నష్టం కేసులో నాంపల్లి కోర్టు సమన్లు
Bigg Boss Telugu Season 8 : సంచాలక్‌లకు తడిసిపోయిందే.. అసలు ఆట ఆ ముగ్గురి మధ్యే
సంచాలక్‌లకు తడిసిపోయిందే.. అసలు ఆట ఆ ముగ్గురి మధ్యే
YS Jagan On Power Deals: సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
సెకీతో డీల్ చరిత్ర - ఆరోపణలపై పరువునష్టం దావా - అమెరికా ఎఫ్‌బీఐ కేసుపై జగన్ ఫస్ట్ రియాక్షన్
Dina Sanichar Story In Telugu: జంగిల్ బుక్‌లో తోడేళ్లు పెంచిన
జంగిల్ బుక్‌లో తోడేళ్లు పెంచిన "మోగ్లీ" నిజ జీవితంలో ఉన్నాడని తెలుసా?
Rashmika Mandanna : పుష్ప 2 సినిమా విడుదల దగ్గరయ్యే కొద్ది రష్మికకు టెన్షన్ పెరిగిపోతుందట, ఇన్​స్టా పోస్ట్​లో చెప్పేసిన బ్యూటీ
పుష్ప 2 సినిమా విడుదల దగ్గరయ్యే కొద్ది రష్మికకు టెన్షన్ పెరిగిపోతుందట, ఇన్​స్టా పోస్ట్​లో చెప్పేసిన బ్యూటీ
Embed widget