World Vegan Month : వీగన్ డైట్‌లోని రకాలు ఇవే.. వీటిని ఫాలో అయితే బరువు తగ్గొచ్చు, మరెన్నో ప్రయోజనాలు
Weight Loss with Vegan : వీగన్ డైట్‌తో బరువు తగ్గొచ్చు. అలాగే జీవహింసకు దూరంగా ఉండొచ్చు. ఈ అంశాలను ప్రమోట్ చేస్తూ.. చాలామంది వీగన్కు మారుతున్నారు. మీరు కూడా వీగన్‌గా మారాలనుకుంటే ఇది మీకోసమే.

World Vegan Month 2024 : ప్రపంచ వ్యాప్తంగా నవంబర్ నెలను వీగన్ నెలగా చెప్తారు. నాన్‌వెజ్‌కి దూరంగా ఉండాలనుకునేవారు.. జంతుహింసను వద్దనుకునేవారు వీగన్స్గా మారుతూ ఉంటారు. వీరంతా వీగన్ ఫుడ్‌పై అవగాహన కల్పిస్తూ నవంబర్ 1వ తేదీన ప్రపంచ వీగన్ డే(World Vegan Day)గా నిర్వహిస్తున్నారు. అయితే నవంబర్ 1 నుంచి 30వ తేదీవరకు.. నెల మొత్తాన్నీ వీగన్ నెలగా (World Vegan Month) చెప్తారు. 1994 నుంచి దీనిని నిర్వహిస్తున్నారు. కాగా 2024 సంవత్సరంతో ఈ వీగన్ మూమెంట్ 50వ వార్షికోత్సవం జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో వీగన్‌గా మారడం వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి? ఎలాంటి ఫుడ్ తీసుకోవచ్చు? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
వీగన్ నెల ప్రాముఖ్యత
వీగన్ వల్ల కలిగే లాభాలు చెప్తూ.. ప్రపంచ వ్యాప్తంగా దీని గురించి అవగాహన కల్పిస్తారు. అలాగే యానిమల్ రైట్స్, వెల్పేర్ను ప్రమోట్ చేస్తారు. మొక్కల ఆధారిత ఫుడ్ తీసుకునేలా ప్రజలను ప్రోత్సాహించడమే లక్ష్యంగా ఈ వీగన్ మంథ్ని జరుపుతున్నారు. వీగన్ కమ్యూనిటీలను, బిజినెస్‌ను సపోర్ట్ చేస్తూ.. వీగన్ ప్రాముఖ్యతను ప్రపంచవ్యాప్తంగా చెప్తున్నారు.
వీగన్ వల్ల కలిగే ప్రయోజనాలు..
నాన్‌వెజ్‌కి దూరంగా ఉండడం. పర్యావరణానికి నష్టం కలిగించని జీవనశైలిని ఫాలో అవ్వడం, ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం, బరువు తగ్గడం అనేవి వీగన్ డైట్‌తో సాధ్యం. అంతేకాకుండా ఈ డైట్ ఫాలో అవ్వడం వల్ల సూపర్ ఎనర్జీటిక్గా ఉంటారు. హార్ట్ సమస్యలు దూరమవుతాయి. క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది. బీపీ కంట్రోల్ అవుతుంది. గట్ హెల్త్‌కి మంచిది. రోగనిరోధక శక్తిని కూడా బాగా పెరుగుతుంది.
వీగన్ డైట్‌ని ఎన్ని రకాలంటే..
Whole food vegan diet.. దీనిలో భాగంగా పూర్తిగా మొక్కల ద్వారా ఉత్పతయ్యే ఫుడ్ మాత్రమే ఉంటుంది. పండ్లు, కూరగాయలు, మల్టీ గ్రెయిన్స్, పప్పులు, నట్స్, సీడ్స్‌ని తీసుకోవచ్చు.
Raw food vegan diet.. ఈ డైట్లో పచ్చి కూరగాయలు, పండ్లు, నట్స్, సీడ్స్, ఆకు కూరలు.. తక్కువగా ఉడికించినవి మాత్రమే తీసుకుంటారు.
80/10/10 diet.. ఈ డైట్లో భాగంగా.. ప్లాంట్ బేస్డ్ ఫ్యాట్ రిచ్ ఫుడ్స్ తీసుకుంటారు. నట్స్, అవకాడో, పండ్లు, సాఫ్ట్ గ్రీన్స్ ఉండే ఫుడ్‌ని మాత్రమే తీసుకుంటారు.
Starch solution.. ఇది లో ఫ్యాట్, హై కార్బ్ వేగన్ డేట్. ఇది కూడా 80/10/10 డైట్‌కి చాలా దగ్గరగా ఉంటుంది. ఈ డైట్లో బంగాళదుంపలు, అన్నం, మొక్కజొన్న, పండ్లు కూడా తీసుకుంటారు.
Raw till 4.. ఈ డైట్ కూడా 80/10/10 డైట్ మాదిరిగానే ఉంటుంది. కాకుంటే.. వండని వేగన్ ఫుడ్స్ తీసుకుంటారు. కానీ సాయంత్రం 4 తర్వాత తీసుకోరు. ఉడికించిన వేగన్ ఫుడ్‌ని మాత్రం డిన్నర్గా తీసుకుంటారు.
ఇవే కాకుండా థ్రైవ్ డైట్, జంక్‌ఫుడ్ వీగన్ డైట్ వంటి ఎన్నో డైట్స్ వీగన్లో ఉన్నాయి. ఇలా డిఫరెంట్ డైట్స్ ఫాలో అవ్వడం వల్ల ఫుడ్ తీసుకోవడం ఫన్నీగా, ఇంట్రెస్టింగ్గా ఉంటుందని చెప్తున్నారు. వీగన్ డైట్‌ని ఫాలో అవుతూ చాలామంది బరువు తగ్గుతున్నారు. మరికొందరు ఫిట్‌గా మారుతున్నారు. అలాగే కొందరిలో ఇది విటమిన్స్ లోపానికి కూడా కారణమవుతుందని చెప్తున్నారు. మీరు కూడా వీగన్ డైట్ ఫాలో అవ్వాలనుకుంటే నిపుణుల సలహా తీసుకున్న తర్వాత ప్రారంభిస్తే మంచిది.
Also Read : మెడిటేషన్‌తో బరువు కూడా తగ్గొచ్చట.. కానీ ఈ టిప్స్ ఫాలో అయితే ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఉంటాయట
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

