IPL, 2022 | Qualifier 2 | Narendra Modi Stadium, Ahmedabad - 27 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
RCB
RCB
IPL, 2022 | Final | Narendra Modi Stadium, Ahmedabad - 29 May, 08:00 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
TBC
TBC

World Tuberculosis Day: టీబీ ప్రాణాంతకం కావచ్చు! వ్యాధి నిర్ధారణ, ట్రీట్మెంట్ వివరాలివీ - నేడు ప్రపంచ టీబీ దినం

Tuberculosis Day: టీబీ అన్నది గాలి ద్వారా వ్యక్తి నుంచి వ్యక్తికి సోకుతుంది. టీబీ పేషెంట్స్ తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వచ్చే తుంపర్ల ద్వారా ట్యూబర్ క్యూలోసిస్ బ్యాక్టీరియా వ్యాపిస్తుంది.

FOLLOW US: 

టీబీని తెలుగులో క్షయ వ్యాధిగా పిలుస్తారు. ఇది మైకోబ్యాక్టీరియం ట్యూబర్ క్యూలోసిస్ అనే బ్యాక్టీరియా తో వస్తుంది. ఇది ప్రధానంగా ఉపిరితిత్తులను ప్రభావితం చేయడమే కాకుండా, ఒక్కోసారి మూత్రపిండాలు, వెన్నముక, మెదడు, గర్భాశయం వంటి కీలక అవయవాలను సైతం ప్రభావితం చేయవచ్చు. ఈ నెల 24 న ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం (World Tuberculosis Day) సందర్భంగా దీనిపై అవగాహన కోసం ఈ కథనం. 

రెండేళ్లుగా ప్రపంచ దృష్టి మొత్తం కరోనా వైరస్‌ పై కేంద్రీకృతమై ఉంది. ఇది ఈ శతాబ్దపు అత్యంత ప్రాణాంతక మహమ్మారి. కరోనా రాకతో.. దాని వల్ల సంభవించిన మరణాలు.. టీబీ వ్యాధిని వెనక్కి నెట్టాయి. కరోనాకు ముందు టీబీ వల్లే ఎక్కువ మంది చనిపోయే వారు. కరోనా వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో తెలియక భారీ ప్రాణ నష్టం జరిగింది. దీంతో టీబీ వ్యాధి కరోనా తర్వాత సెకండ్ ప్లేస్‌కు చేరింది. అటు క్షయవ్యాధి ప్రభావం ఎక్కువున్న ప్రాంతాల్లో ఉన్న వనరులను కరోనా చికిత్సకు వాడడంతో టీబీని నియంత్రించడం మరింత కష్టంగా మారింది. 2030 నాటికి టీబీపై విజయం సాధించాలని కలలు గన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా రాకతో ఆ లక్ష్యం చాలా సంవత్సరాలు వెనక్కి నెట్టివేసినట్టైంది.  

ఎలా వ్యాపిస్తుందంటే:
టీబీ అన్నది గాలి ద్వారా వ్యక్తి నుంచి వ్యక్తికి సోకుతుంది. టీబీ పేషెంట్స్ తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వచ్చే తుంపర్ల ద్వారా ట్యూబర్ క్యూలోసిస్ బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. ఇలా ఇది కుటుంబ సభ్యులకు, తోటివారికి, తమ సమీపంలోని వారికి, పరిసరాలలోని వారికి వస్తుంది. ఈ వ్యాధి ఇప్పటికీ మహమ్మారిలా ప్రపంచాన్ని వేధిస్తోంది. టీబీ కేసులు మనదేశంలో భారీగా ఉన్నాయి. అత్యధిక జనసాంద్రత కలిగి ఉండడం వల్ల దేశంలో టీబీ సంక్రమణ పెరుగుతోంది. దీంతో వ్యాధి నివారణకు ఎన్ని చర్యలు చేపట్టినా సత్ఫలితాలను ఇవ్వకపోవడంతో వ్యాధి నియంత్రణ కష్టంగా మారుతోంది. పరీక్షల సామర్థ్యాన్ని పెంచడం, యాక్టివ్ స్క్రీనింగ్, టీబీ హాట్‌స్పాట్‌ ప్రాంతాలను సులువుగా గుర్తించడం కోసం వ్యూహాలను అమలు చేయడం, చికిత్స కోసం ఔషధ సరఫరాలను పెంచడం, జనాభాను నియంత్రించడం వంటి చర్యలు పటిష్టంగా చేపడితేనే వ్యాధిని నియంత్రించవచ్చు. భారతదేశంలో టీబీ యుక్త వయసు వారినే ప్రభావితం చేస్తుంది. ఆర్థికంగా వెనుకబడిన యువకుల్లో వ్యాధి సంక్రమణ ఎక్కువగా ఉన్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. 

వ్యాధి లక్షణాలు:
విపరీతమైన దగ్గుతో పాటు జ్వరం రావడం, ఛాతీలో నొప్పి, తలనొప్పి, నీరసం, అలసట, ఆకలి, బరువు తగ్గడం, ప్రధానంగా సాయంత్రం అవ్వగానే చలేస్తుండడం, రాత్రి వేళలో చెమటలు పట్టడం, ఛాతీలో నీరు చేరడం వల్ల దమ్ము కూడా రావడం వంటి లక్షణాలు టీబీ వ్యాధికి చెందినవే. టీబీ సోకిన వెంటనే వ్యాధి లక్షణాలు బయటపడకపోవచ్చు.రోగనిరోధక శక్తి బాగా తక్కువగా ఉన్న వారిలో సూక్ష్మక్రిమి సోకిన కొద్ది రోజుల్లోనే లక్షణాలు బయటికి కనిపించవచ్చు. మరికొందరిలో ఏళ్ల తరబడి బాక్టీరియా ఉండిపోయి, ఎలాంటి లక్షణాలు బయటికి కనిపించకపోవచ్చు. కానీ, వ్యాధి సోకిన 2 నుంచి 5 సంవత్సరాలలోపు వ్యాధి లక్షణాలు తీవ్రమవుతాయి.

వ్యాధి నిర్ధారణ:
అత్యాధునిక రోగనిర్ధారణ విధానాలు, చికిత్స అందుబాటులోకి వచ్చినా, టీబీ ఇప్పటికీ మానవాళికి వణుకు పుట్టిస్తోంది. రోగ నిర్ధారణ కోసం తెమడ పరీక్ష, ఛాతి ఎక్స్-రే, ల్యాటెంట్ టీబీ విషయంలో కొన్నిసార్లు చర్మం పరీక్ష, దేహంలో టీబీ సూక్ష్మక్రిమిని నిర్ధారణ చేసే నిరాలాజికల్ పరీక్షలు, సూక్ష్మజీవుల పెరుగుదలను తెలిపే కల్చరల్ పరీక్షలతో పాటు మరి ఖచ్చితమైన నిర్ధారణ కోసం బ్రోంకోస్కోపీ, థొరాకోస్కోపీ మరియు సిటీ గైడెడ్ బయాప్సీ అనే పరీక్షలు చేస్తారు. 

2015 నుంచి దేశంలో టీబీ రోగుల మరణాల సంఖ్య పెరుగుతోంది. 2020లో మిలియన్ల మంది క్షయ వ్యాధితో మరణించినట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ఆరోగ్య సేవలకు కరోనా అంతరాయాలు.. వ్యాధి నిర్ధారణ, చికిత్సపై ప్రభావం చూపాయి. మెడిసిన్, కౌన్సెలింగ్, ఫాలో-అప్ వంటి అంశాలు చికిత్స పై ప్రభావం చూపాయి. దీంతో మల్టీ డ్రగ్-రెసిస్టెంట్ జాతుల అభివృద్ధిని ప్రోత్సహించి.. చికిత్స వైఫల్యం రేట్లు, బాధలు మరియు మరణాలను పెంచుతోంది టీబీ వ్యాధి. దీంతో రాబోయే కాలంలో.. టీబీ వ్యాధి అనేక సవాళ్లను కలిగిస్తుంది. వ్యాధి భారం అధికంగా ఉన్న మన లాంటి దేశాలలో అక్కడి బలహీనమైన వైద్య వ్యవస్థలు వ్యాధిని నియంత్రించలేకపోతున్నాయి.

వీరికి రిస్క్ ఎక్కువ:
హెచ్‌ఐవీ పేషెంట్లు, డయాబెటిస్ మెల్లిటస్, పోషకాహార లోపం ఉన్నవారిలో, కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న వారిలో, కిడ్నీ ట్రాన్స్‌ ప్లాంట్ తర్వాత, కరోనా వైరస్, ఆటో ఇమ్యూన్ వ్యాధులున్న రోగులు, క్యాన్సర్ కీమోథెరపీలో ఉన్న రోగులకు టీబీ ఎక్కువగా సోకుతోందని వైద్య నిపుణులు చెబుతున్నారు.  

చికిత్స:
టీబీ పూర్తిగా నయం కావడానికి క్రమం తప్పకుండా మందులు వాడుతూ, డాక్టర్ పర్యవేక్షణలో ఉండటం అవసరం. కొన్ని రోజులు మందులు వాడగానే లక్షణాలు తగ్గడంతో వాటిని ఆపేస్తుంటారు. వారిలో మందులకు లొంగని డ్రగ్ రెసిస్టెంట్ టీబీ వస్తుంది. ఇలాంటి వారికి  ముందు ఇచ్చిన మందులకు బదులుగా ఇంకా ప్రభావంతమైన మందులు ఇవ్వాల్సి ఉంటుంది. వీటిని కనీసం 6 నెలల పాటు వాడాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాలలో 18-24 నెలల పాటు కూడా చికిత్సను పొడిగించాల్సి రావచ్చు. ఇవి ఒకింత ప్రమాదకరమైనవి కావడంతో సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉండేందుకు మొదటిసారే పూర్తిగా తగ్గేలా జాగ్రత్త పడటం మంచిది.   

జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం (NTEP) భారతదేశంలో టీబీ నిర్మూలనకు సంబంధించిన ప్రధాన ప్రభుత్వ సంస్థ. టీబీ నిర్మూలన కోసం జాతీయ వ్యూహాత్మక ప్రణాళిక (NSP) 2017–2025 వ్యాధిపై వ్యూహాత్మకంగా సమరం సాగిస్తోంది. "డిటెక్ట్ - ట్రీట్ - ప్రివెంట్ - బిల్డ్" వంటి వ్యూహాలతో ముందుకు వెళ్తోంది జాతీయ వ్యూహాత్మక ప్రణాళిక (NSP). కరోనా రాకతో టీబీ వ్యూహాలు మరుగున పడగా.. ప్రస్తుతం కరోనా వ్యాప్తి తగ్గినందున దేశంలో టీబీపై అవగాహన కల్పించే కార్యక్రమాలు పెట్టడం.. "దేశాన్ని టీబీ రహితంగా మార్చేందుకు ఇది సరైన సమయం. రండి.. అందరం కలిసి టీబీని అరికడదాం".

డాక్టర్ రాఘవేంద్ర రెడ్డి.పి
MBBS,MD,FCCP,(IDCC)
కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ & స్లీప్ మెడిసిన్
రెనోవా హాస్పిటల్స్, సనత్‌నగర్, హైదరాబాద్

Published at : 24 Mar 2022 09:27 AM (IST) Tags: World Tuberculosis Day 2022 Tuberculosis TB Symptoms treatment Tuberculosis treatment Doctor P raghavendra Reddy

సంబంధిత కథనాలు

Headphones side effects: హెడ్‌ఫోన్స్ అతిగా వాడుతున్నారా? చూడండి, ఎంత ప్రమాదమో!

Headphones side effects: హెడ్‌ఫోన్స్ అతిగా వాడుతున్నారా? చూడండి, ఎంత ప్రమాదమో!

Warts Removal Tips: పులిపిరులు వేదిస్తున్నాయా? ఈ ఆయుర్వేద చిట్కా పాటిస్తే వెంటనే రాలిపోతాయి

Warts Removal Tips: పులిపిరులు వేదిస్తున్నాయా? ఈ ఆయుర్వేద చిట్కా పాటిస్తే వెంటనే రాలిపోతాయి

Man Cut in Half: ప్రాణం పోసిన ప్రేమ, ప్రమాదంలో శరీరం సగానికి ముక్కలైనా జీవిస్తున్న యువకుడు

Man Cut in Half: ప్రాణం పోసిన ప్రేమ, ప్రమాదంలో శరీరం సగానికి ముక్కలైనా జీవిస్తున్న యువకుడు

Hair Regrow Drug: గుడ్ న్యూస్, బట్టతలకు ఇక బై బై, ఈ మందుతో జుట్టు తిరిగి వచ్చేస్తుంది!

Hair Regrow Drug: గుడ్ న్యూస్, బట్టతలకు ఇక బై బై, ఈ మందుతో జుట్టు తిరిగి వచ్చేస్తుంది!

Keema Recipe: దాబా స్టైల్‌లో కీమా కర్రీ రెసిపీ, తింటే ఎంతో బలం

Keema Recipe: దాబా స్టైల్‌లో కీమా కర్రీ రెసిపీ, తింటే ఎంతో బలం

టాప్ స్టోరీస్

Stock Market News: బలపడ్డ రూపాయి.. భారీ లాభాల్లో ఓపెనైన సెన్సెక్స్‌, నిఫ్టీ

Stock Market News: బలపడ్డ రూపాయి.. భారీ లాభాల్లో ఓపెనైన సెన్సెక్స్‌, నిఫ్టీ

Rahul Gandhi: ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీ సతమతం, ప్రశ్న అడగ్గానే ఏం చెప్పాలో అర్థం కాలేదా? - వీడియో వైరల్

Rahul Gandhi: ఇంటర్వ్యూలో రాహుల్ గాంధీ సతమతం, ప్రశ్న అడగ్గానే ఏం చెప్పాలో అర్థం కాలేదా? - వీడియో వైరల్

Mahanadu 2022: టార్గెట్‌ 2024గా మహానాడు- పసుపు పండగతో టీడీపీలో కొత్త ఉత్తేజం

Mahanadu 2022: టార్గెట్‌ 2024గా మహానాడు- పసుపు పండగతో టీడీపీలో కొత్త ఉత్తేజం

Yoga Day Utsav: యోగా ఉత్సవ్ డే ప్రారంభం- యంగ్‌గా ఉండాలంటే యోగా చేయమంటున్న సెలబ్రెటీలు

Yoga Day Utsav:  యోగా ఉత్సవ్ డే ప్రారంభం- యంగ్‌గా ఉండాలంటే యోగా చేయమంటున్న సెలబ్రెటీలు