World Sight Day 2022: ఎక్కువ సమయంపాటూ కంప్యూటర్, ఫోన్ స్క్రీన్ చూస్తే సైట్ వస్తుందా?
World Sight Day 2022: పెరిగిన స్క్రీన్ సమయం మీ కళ్లపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో తెలుసుకోవడం అవసరం.
World Sight Day 2022: చూపును కాపాడుకోవాలని చెప్పడానికే అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా ‘వరల్డ్ సైట్ డే’ నిర్వహిస్తారు. ప్రతి ఏడాది నిర్వహించే ఈ ప్రత్యేక దినోత్సవం రోజున కంటి చూపును కాపాడుకునే అంశాలపై అవగాహన కల్పిస్తారు. అయితే ఇప్పుడు ఎక్కువ మందిని వేధిస్తున్న సమస్య ‘పెరగిన స్క్రీన్ టైమ్’. రోజుకు తొమ్మిది నుంచి పది గంటల పాటూ కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లపై పని చేసి, ఆ తరువాత కూడా ఫోన్ చూస్తూ గడిపేస్తున్నారు చాలా మంది. ఈ పెరిగిన స్క్రీన్ టైమ్ కంటి చూపుపై, కంటి ఆరోగ్యంపై ఎలా ప్రభావాన్ని చూపిస్తుంది? అత్యధిక సంఖ్యలో స్మార్ట్‌ఫోన్ వినియోగదారులను కలిగి ఉన్న మొదటి మూడు దేశాలలో మనదేశం ఒకటి. మనదేశంలో కోటి మందికి పైగా ప్రజలు రెటీనా వ్యాధులతో బాధపడుతున్నారు. స్మార్ట్‌ఫోన్‌లు, కంప్యూటర్‌లు, ల్యాప్‌టాప్‌ల వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను అధికంగా వినియోగించడం వల్ల కంటి వ్యాధులు పెరిగిపోతున్నాయి.
స్క్రీన్‌ను ఎక్కువ సేపు చూడడం వల్ల వచ్చే సమస్యలు ఇవే
పొడి కళ్లు
స్క్రీన్ ను చూస్తున్నప్పుడు ఎక్కువసార్లు రెప్పవేయము. అలా చూస్తూ ఉండిపోతాము. దీని వల్ల కళ్లు పొడిగా మారుతాయి. చికాకుగా అనిపిస్తాయి. ఇలాగే కొన్ని రోజుల పాటూ కొనసాగితే కళ్ల వెంట నీళ్లు కారడం, మసకగా కనిపించడం వంటి సమస్యలు వస్తాయి.
కంటి అలసట
అస్తెనోపియా అంటే కంటి అలసట అని అర్థం. స్క్రీన్ చూసి చూసి కళ్లు తీవ్రంగా అలిసిపోతాయి. దీనికి స్క్రీన్ పక్కన పెట్టి కళ్లు మూసుకుని తరచూ రిలాక్స్ అవుతూ ఉండాలి.
వయస్సు సంబంధిత సమస్య
వయసు పరంగా వచ్చే సమస్య Age-Related Macular Degeneration (AMD). స్క్రీన్ నుంచి వచ్చే నీటి కాంతి వల్ల త్వరగా కాస్త వయసు పెరిగిన వారి రెటీనా దెబ్బతింటుంది. పట్టించుకోకుండా వదిలేస్తే చూపు కోల్పోయే పరిస్థితి దాపురిస్తుంది.
మయోపియా
మయోపియా అంటే దూరంగా ఉండే వస్తువులు కనిపించవు. ఇదొక రకమైన సైట్. కాస్త దూరంలో ఉన్న వస్తువులు అస్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే దగ్గరగా ఉన్నవి స్పష్టంగా ఉంటాయి. దీన్నే లాంగ్ సైట్ అంటారు. ఎక్కువ సేపు స్క్రీన్ చూడడం వల్ల ఈ సైట్ అవకాశాలు ఎక్కువ.
ఎలా కాపాడుకోవాలి?
మీ కళ్ళను కాపాడుకోవడానికి కొన్ని చిట్కాలు ఇవి.
1. స్క్రీన్ చూస్తున్నప్పటికీ రెప్పలు ఆర్పుతూ ఉండాలి. అలా కన్నార్ప చూడకూడదు. హైడ్రేటింగ్ ఐ డ్రాప్స్ ఉపయోగించడం వల్ల కళ్లు పొడిబారకుండా నివారించవచ్చు.
2. స్క్రీన్ చూస్తున్నంత సేపు కంటికి యాంటీ గ్లేర్ కళ్లద్దాలు వాడడం ఉత్తమం.స్క్రీన్ ఎక్కువ బ్రైట్‌నస్ పెట్టుకోకుండా తక్కువ పెట్టుకోండి.
3. స్క్రీన్ చూస్తున్న సమయంలో ప్రతి 40 నిమిషాలకు ఒకసారి కంటికి రెస్ట్ ఇవ్వడం ముఖ్యం. ఒక అయిదు నిమిషాలు అలా కళ్లు మూసుకుని రిలాక్స్ అవ్వాలి.
Also read: స్పైసీ ఫుడ్ తినాలన్న కోరిక కలగడానికి కారణాలు ఇవి కావచ్చు
Also read: పనీర్ అంటే ఇష్టమా? అధికంగా తింటే ఈ సైడ్ ఎఫెక్టులు తప్పవు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.