News
News
X

Paneer: పనీర్ అంటే ఇష్టమా? అధికంగా తింటే ఈ సైడ్ ఎఫెక్టులు తప్పవు

Paneer: పనీర్ వంటకాలు ఇషపడనిది ఎవరు? కానీ దాంతో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి.

FOLLOW US: 
 
Paneer: పనీర్ బిర్యానీ, పనీర్ బటర్ మసాలా, పనీర్ 65... చెబుతుంటేనే నోరూరిపోతున్నాయి కదా. శాకాహారులే కాదు పనీర్ వంటకాలను మాంసాహారులు కూడా అభిమానులే. ఆరోగ్యమైన వంటకాల్లో పనీర్ కూడా ఒకటి. ఇది పాలతోనే రెడీ అవుతుంది కాబట్టి పాలు తాగడం వల్ల కలిగే లాభాలన్నీ పనీర్ తినడం వల్ల కూడా కలుగుతాయి.  విరగ్గొట్టిన పాలతో చేసే పనీర్లో కాల్షియం, ప్రొటీన్ పుష్కలంగా ఉంటాయి. దీన్ని కాటేజ్ చీజ్ అని కూడా పిలుస్తారు. పనీర్ తినడం వల్ల ఎముకలు బలంగా మారుతాయి. కీళ్లనొప్పులు రావు. జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు జరుగుతుంది. పనీర్ తినడం వల్ల అన్నీ లాభాలే. కానీ అతిగి తింటే మాత్రం అది కూడా కీడు చేస్తుంది. 

జీర్ణ సమస్యలు
మితంగా తింటే జీర్ణవ్యవస్థకు మేలు చేసే పనీర్, అతిగా తినడం వల్ల అదే జీర్ణ వ్యవస్థకు హాని చేస్తుంది. అధికంగా తింటే పొట్ట ఉబ్బరం కలుగుతుంది. దీనివల్ల గుండెల్లో మంట, కడుపునొప్పి వంటివి కలుగుతాయి. ఇందులో ప్రొటీన్లు పుష్కలంగా ఉన్నందున తిన్నాక జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఆ సమయంలో ఎలాంటి వ్యాయమం లేకుండా పడుకుంటే సమస్య ఇంకా పెరుగుతుంది. పొట్ట పట్టేసినట్టు అవుతుంది. పొట్టలో ఎసిడిటీ పెరిగిపోతుంది. 

బరువు పెరగడం
పనీర్ అధికంగా తినేవారు త్వరగా బరువు పెరుగుతారు. కాబట్టి ఇది రోజూ తినే ఆహారం కాదు. బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారికి పనీర్ తినడం మంచిది కాదు. ఇది శరీరంలో కొవ్వు స్థాయిలను పెంచుతుంది. కాబట్టి దీన్ని తిన్నా కూడా చాలా మితంగా తినండి. రెండు మూడు రోజులకోసారి కాస్త తింటే చాలు. బావుంది కదా అని లాగిస్తే అధిక బరువు సమస్యతో బాధపడాల్సి రావచ్చు. 

కొలెస్ట్రాల్‌ పెరుగుదల
శరీరంలో ఎల్డీఎల్ కొలెస్ట్రాల్ (చెడు కొలెస్ట్రాల్) పెరిగితే గుండె జబ్బులు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువ. కాబట్టి కొలెస్ట్రాల్ పెంచే ఆహారాన్ని ఎక్కువగా తినకూడదు. ఒక సర్వే ప్రకారం ప్రతి పది మంది భారతీయుల్లో ఆరుగురు అధిక చెడు కొలెస్ట్రాల్ స్థాయిలతో బాధపడుతున్నారు. కాబట్టి పనీర్ వినియోగాన్ని తగ్గించుకుంటే మంచిది. అలాగని పూర్తిగా తినడం మానేయమని చెప్పడం లేదు. మితంగా తినాలి. 

News Reels

అలెర్జీలు
పాలు కొందరికి పడవు. అలాంటివారికి పనీర్ కూడా పడకపోవచ్చు. ఇది చాలా అరుదుగా వచ్చే అలెర్జీ. పనీర్ తిన్న తరువాత వికారంగా అనిపించి వాంతులు కావడం, చర్మంపై పగుళ్లు, దద్ధుర్లు రావడం జరిగితే వెంటనే పనీర్ తినడం ఆపేయండి. నాణ్యత లేని, గడువు ముగిసన పాలతో చేసినా కూడా అలెర్జీలు వస్తాయి. 

Also read: మళ్లీ పుట్టుకొచ్చిన రెండు కొత్త కోవిడ్ వేరియంట్లు, పలు దేశాల్లో బయటపడుతున్న కేసులు, అవి ప్రాణాంతకమే అంటున్న నిపుణులు

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Published at : 13 Oct 2022 07:56 AM (IST) Tags: Paneer Paneer Side Effects Paneer Benefits Paneer Dishes

సంబంధిత కథనాలు

మిరపకాయలకు ఓ హిస్టరీ ఉందన్న విషయం మీకు తెలుసా.? అసలు మిర్చీ ఎందుకు కారంగా ఉంటుంది?

మిరపకాయలకు ఓ హిస్టరీ ఉందన్న విషయం మీకు తెలుసా.? అసలు మిర్చీ ఎందుకు కారంగా ఉంటుంది?

Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా? రోజూ ఈ పిండితో చేసిన రోటీలు తినండి - ఆ నటి డైట్ ఇదేనట!

Weight Loss: బరువు తగ్గాలనుకుంటున్నారా? రోజూ ఈ పిండితో చేసిన రోటీలు తినండి - ఆ నటి డైట్ ఇదేనట!

Ears Cleaning: ఇయర్ బడ్స్‌తో చెవులు శుభ్రం చేస్తున్నారా? ఈ పొరపాట్లు చేశారంటే వినికిడి లోపం రావొచ్చు

Ears Cleaning: ఇయర్ బడ్స్‌తో చెవులు శుభ్రం చేస్తున్నారా? ఈ పొరపాట్లు చేశారంటే వినికిడి లోపం రావొచ్చు

Cancer: వైన్ ఆరోగ్యానికి మంచిదేనా? క్యాన్సర్ ప్రమాదం ఉందా?

Cancer: వైన్ ఆరోగ్యానికి మంచిదేనా? క్యాన్సర్ ప్రమాదం ఉందా?

Garlic: చలికాలంలో వెల్లులి తింటే జలుబు, దగ్గు దరిచేరవా?

Garlic: చలికాలంలో వెల్లులి తింటే జలుబు, దగ్గు దరిచేరవా?

టాప్ స్టోరీస్

TS Govt : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం, దివ్యాంగుల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ

TS Govt :  తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం, దివ్యాంగుల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ

NRI Hospital Godava : ఎన్నారై ఆస్పత్రి డైరక్టర్ల మధ్య గొడవలే కొంప ముంచాయా ? ఈడీ, ఐటీ దాడుల వెనుక అసలేం జరిగింది ?

NRI Hospital Godava : ఎన్నారై ఆస్పత్రి డైరక్టర్ల మధ్య గొడవలే కొంప ముంచాయా ? ఈడీ, ఐటీ దాడుల వెనుక అసలేం జరిగింది ?

Impact Player: ఐపీఎల్‌లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్ - ఒక ఆటగాడిని అదనంగా!

Impact Player: ఐపీఎల్‌లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్ - ఒక ఆటగాడిని అదనంగా!

Monster Movie Review : హానీ రోజ్‌తో లక్ష్మీ మంచు లిప్ లాక్, మోహన్‌లాల్‌తో ఫైట్ - 'మాన్‌స్టర్' ఎలా ఉందంటే?

Monster Movie Review : హానీ రోజ్‌తో లక్ష్మీ మంచు లిప్ లాక్, మోహన్‌లాల్‌తో ఫైట్ - 'మాన్‌స్టర్' ఎలా ఉందంటే?