World Hardest Dish: అరె, రాళ్లను కూడా వదలరా? ఈ చైనీయుల వంటకం భలే ఫేమస్, తింటే అరుగుతుందా?
కవితకు ఏది అనర్హం కాదని రచయితలు చెప్తుంటారు. కానీ ఇక్కడ వంటకు ఏదీ కాదు అనర్హమని చైనీయులు నిరూపిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా రాళ్ళనే వండుకుని లాగించేస్తున్నారు.
పాకేవి, నడిచేవి, నీళ్ళలో ఈత కొట్టేవి అని తేడా లేకుండా చైనీయులు తినేందుకు ముందుంటారు. కప్పలు, పాములు ఇలా ఒకటేంటి భూమి మీద ఉన్న జీవరాశులు వేటిని వదిలిపెట్టరు. అన్నింటినీ చాలా ఇష్టంగా తినేస్తారు. ఇప్పుడు ఇక్కడ చేసే ఒక స్ట్రీట్ ఫుడ్ ఒకటి ప్రపంచంలోనే అత్యంత కష్టతరమైన వంటకం. ఇంతకీ దీన్ని ఏ ఆహార పదార్థంతో చేస్తారో తెలుసా..? ఈసారి జీవులు కాదండోయ్, తినేందుకు కూడా వీలు లేని రాళ్ళు. అవును మీరు విన్నది నిజమే. గులకరాళ్ళతో చేసిన స్టైర్ ఫ్రై చైనీస్ వంటకం ఇప్పుడు ఫుల్ ఫేమస్ అయిపోయింది. దీన్ని తినడానికి ఆహార ప్రియులు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అయినా గులకరాళ్లను తినడం ఏంటండీ బాబు, వాళ్లు మనుషులేనా, తింటే అరుగుతాయా? అని అనుకుంటున్నారా? దానికి కూడా ఒక పద్ధతి ఉంది. అదేంటో చూడండి.
సౌదుయి స్ట్రీట్ ఫుడ్
ఈ చైనీస్ వంటకం పేరు సౌదుయ్ (సక్ అండ్ త్రో). గులక రాళ్ళని బాగా వేయించి అందులో మిరప నూనె, వెల్లుల్లి, రోజ్మేరీ వంటి కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు వేసి బాగా రుచిగా వాటిని ఫ్రై చేస్తారు. అంతా బాగానే ఉంది కానీ, రాళ్ళు ఎలా నలుగుతాయని అని అనుమానంగా ఉందా? అందుకు కూడా మార్గం ఉందండోయ్.. జస్ట్ ఆ రాళ్ళను నోట్లో వేసుకుని చప్పరిస్తూ.. మిగతా కూరగాయలు తినేసి.. రాళ్ళు విసిరేయడమే. తూర్పు చైనీస్ ప్రావిన్స్ హుబేయ్ లో ఈ వంటకం బాగా ఫేమస్. ఘటుగా, రుచిగా ఉండే ఈ చిన్న రాళ్ళని చప్పరించడానికి జనాలు తెగ ఎగబడతన్నారు. కొందరు రాళ్లు కడుపులోకి జారిపోతాయనే భయంతో వాసన పీల్చుకుని పాడేస్తారు. అందుకే ఈ వంటకం పేరు సౌదుయి. దీని అర్థం పీల్చుకుని లేదా చప్పరించి పారేయడం. ఒక బౌల్ ధర సుమారు 2 డాలర్లు.
వందల ఏళ్ల నాటిది
సౌదుయి వందల సంవత్సరాల నాటిదని అక్కడి ప్రజల నమ్మకం. స్థానిక మిడియా నివేదిక పరాక్రమ బోట్ మెన్ వాళ్ళు తరతరాలుగా దీన్ని అందించారట. పాత రోజుల్లో పడవలు నడుపుకునే వాళ్ళు సముద్రం మధ్యలో చిక్కుకుని పోయినప్పుడు సరుకులు పంపిణీ చేసి వారికి ఆహారం లేకుండా పోయేది. అప్పుడు వాళ్ళు మసాలా దినుసులతో ఈ రాళ్ళ వంటకం కనుగొన్నారని నివేదిక పేర్కొంది. గత వారం రోజులుగా చైనీస్ సోషల్ మీడియా ఈ వంటకం వీడియో వైరల్ గా మారింది. స్ట్రీట్ వ్యాపారులు దీన్ని ఎలా వండుతారో వీడియోలు కూడా తీసి పెడుతున్నారు. గులక రాళ్ళతో ఈ వంటకం తయారీ ప్రారంభమవుతుంది. వేడిని సమానంగా ఉండే గులక రాళ్ళని వంటకి ఉపయోగిస్తారు. గ్రిల్ పై గులకరాళ్ళు వేసి చిల్లీ ఆయిల్ పోస్తారు. వాటిపై వెల్లుల్లి సాస్ చల్లి, వెల్లుల్లి రెబ్బలు, మిరియాల పొడి వేసి ప్రతిదీ వేయించుకోవాలి. ఈ వింత వంటకం సోషల్ మీడియాలో ఇదేమీ మొదటి సారి కాదు. గతంలో సెప్టెంబర్ లో రాళ్ళు బెర్రీలు లాగా ఉన్న వంట చేసి పోస్ట్ చేశారు.
Also Read: పప్పు ఉడికించేటప్పుడు నురుగు లాంటిది ఎందుకు వస్తుంది? అది హానికరమా?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Videos of chefs making stir-fried rocks are the latest trend on Chinese social media.
— Johannes Maria (@llNQf7dLuT90CWw) June 26, 2023
https://t.co/0Np5SyRUBr pic.twitter.com/RcDMswDCbn