By: ABP Desam | Updated at : 20 Apr 2022 11:23 PM (IST)
Edited By: Suresh Chelluboyina
Image Credit: @DiamondLouX/Twitter
కదులుతున్న రైలు కిందపడితే ఏమవుతారు? చనిపోతారు లేదా అవయవాలను కోల్పోతారు కదా. కానీ, ఈ యువతికి ఈ భూమి మీద నూకలున్నాయ్. అందుకే, రైలు కిందపడినా స్వల్ప గాయాలతో తప్పించుకుంది. ఈ వీడియో చూస్తే మీరు తప్పకుండా షాకవుతారు. ఆమె నేరుగా ప్లాట్‌ఫామ్ మీద నుంచి రైలు బోగీల మధ్య ఉండే సంధులో పడిపోయినా ప్రాణాలతో ఉండటం చూస్తే ఆశ్చర్యపోతారు.
అర్జెంటీనాలో చోటుచేసుకున్న ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. క్యాండెల్లా అనే యువతి రైలు కోసం ప్లాట్‌ఫామ్ మీద నిలబడి ఉంది. ఇంతలో ఓ రైలు అటుగా వచ్చింది. అకస్మాత్తుగా ఏమైందో ఏమో ఆమె అడుగులు తడబడ్డాయి. నేరుగా కదులుతున్న రైలు బోగీల వైపుకు కదిలింది. రెప్పపాటు వ్యవధిలో రెండు బోగీల మధ్య ఉండే గ్యాప్ మధ్య పడిపోయింది. దీంతో వెంటనే రైలును ఆపేశారు. ఆ దృశ్యం చూసి చాలామంది ఆమె చనిపోయిందనే అనుకున్నారు. కానీ, ఆమె బతికే ఉంది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఆ ప్రమాదాన్ని ప్రత్యక్షంగా చూసినవారు.. ఆమె చనిపోతుందని భావించామని, నిజంగా అద్భుతం జరిగిందని, ఆమె మళ్లీ పుట్టిందని మీడియాకు వెల్లడించారు. ఈ ఘటన మొత్తం రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ కెమేరాలో రికార్డైంది. ఈ వీడియోను పలు టీవీ చానెళ్లు ప్రసారం చేయడంతో నెట్టింట కూడా చక్కర్లు కొట్టింది. ఈ వీడియో చూసి నెటిజనులు ఆశ్చర్యపోతున్నారు. ఆమె చాలా అదృష్టవంతురాలని అంటున్నారు.
So this happened recently in #BuenosAires #Argentina
This woman apparently fainted and she fell under on an oncoming train, BUT SHE SURVIVED! She's now out of the hospital 🙏 pic.twitter.com/EQA2V4foh9— Diamond Lou®™ 🔞 (@DiamondLouX) April 19, 2022
అయితే, ఆమె అకస్మాత్తుగా అలా వింతగా ఎందుకు కదిలింది? నేరుగా కదులుతున్న రైలు వైపు ఎలా కదిలిందనేదే ఎవరికీ అంతు చిక్కడం లేదు. చూస్తుంటే ఇది ఆత్మహత్యలా లేదని, ఏదో అనారోగ్య సమస్య వల్లే ఆమె అలా కదిలి ఉంటుందని భావిస్తున్నారు. కొద్ది రోజుల కిందట ఆగ్రాలోని రాజా కి మండీ రైల్వే స్టేషన్‌లో కూడా ఓ కానిస్టేబుల్ ఈ విధంగానే రైలు కిందపడ్డాడు. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అతడు కూడా రైలు కిందపడే ముందు గాల్లో ఏదో చూస్తూ గుండ్రగా తిరిగాడు.
Never stand near moving train. On duty GRP constable Ringal Kumar came under the wheels of freight train at Raja Ki Mandi railway station in #Agra. https://t.co/xaMSuncAwI pic.twitter.com/uiMrI6BQut
— Arvind Chauhan अरविंद चौहान (@Arv_Ind_Chauhan) March 27, 2022
Also Read: వైరల్ వీడియో - గాల్లో ఏదో చూశాడు, గిరగిరా తిరుగుతూ రైలు కిందపడ్డాడు, అసలేం జరిగింది?
Also Read: స్మార్ట్ ‘బొద్దింకలు’ - మనుషులను రక్షిస్తాయ్, చెప్పిన పని చేస్తాయ్! ఇదిగో ఇలా
Instant Breakfast Recipe : బరువును తగ్గించే ఈజీ రెసిపీ.. దీనికి ఆయిల్ అవసరమే లేదు
Diabetic Coma : డయాబెటిక్ కోమాకి కారణాలు ఇవే.. ప్రాణాలమీదకి తెచ్చే సమస్యకు చెక్ పెట్టొచ్చా?
Christmas Celebrations : క్రిస్మస్ పండుగ వచ్చేస్తోంది, ఏ దేశంలో ఎలా జరుపుకుంటారో తెలుసా?
Chicken Pakodi Recipe : సండే స్పెషల్ హాట్ అండ్ క్రిస్పీ చికెన్ పకోడి.. టేస్టీ టేస్టీ రెసిపీ ఇదే
Christmas Gifts : క్రిస్మస్కు గిఫ్ట్స్ ఇస్తున్నారా? అయితే ఇవి గుర్తించుకోండి
Revanth Reddy KCR: కోలుకొని అసెంబ్లీకి రావాలని కేసీఆర్ను కోరా, ఆస్పత్రికి వెళ్లి పరామర్శించిన సీఎం రేవంత్
Naga Chaitanya: మా తాత మాట నిజమయ్యింది, నా చిన్నప్పుడే అలా చెప్పేశారు: నాగ చైతన్య
Samantha Production House: సొంతంగా నిర్మాణ సంస్థ ప్రారంభించిన సమంత - తనకు నచ్చిన పాట పేరుతో!
Telangana News: రాష్ట్రంలోని 54 కార్పొరేషన్ల ఛైర్మన్ల నియామకాలు రద్దు, ఉత్తర్వులు జారీ
/body>