News
News
X

Woman Health: మహిళలకి శక్తినిచ్చే సూపర్ ఫుడ్స్- శీతాకాలంలో వీటిని తినడం అత్యవసరం

శీతాకాలంలో మహిళలు తాము తీసుకునే ఆహారంలో ఈ చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. శరీరం కూడా వెచ్చగా ఉంటుంది.

FOLLOW US: 
 

సీజన్ల వారీగా ఆహారంలోనూ, ఆరోగ్య పరిస్థితుల్లోనూ మార్పులు చోటు చేసుకుంటాయి. చలికాలంలో ఎక్కువగా జలుబు, ఫ్లూతో బాధపడతారు. ఇవే కాకుండా చాలా మంది వ్యక్తులు తామర, పొడి చర్మం, జుట్టు రాలడం, కీళ్ల నొప్పులు వంటి సమస్యలని ఎదుర్కోవాల్సి వస్తుంది. చల్లటి గాలుల వల్ల కీళ్ల నొప్పులు అధికమయ్యే అవకాశం ఉంది. తేమతో కూడిన గాలుల కారణంగా వాయు కాలుష్యం పెరిగిపోతుంది, రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. దీంతో అనారోగ్యానికి గురయ్యే అవకాశాలని పెంచుతుంది. అందుకే సీజన్ కి అనుగుణంగా ఆహారాన్ని మార్చుకోవడం వల్ల మహిళలు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

చల్లటి వాతావరం వల్ల శరీరం వెచ్చదనాన్ని కోరుకుంటుంది. ఈ పదార్థాలు తీసుకుంటే మీ శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. అన్ని రకాల చర్మ, ఆరోగ్య సంబంధిత సమస్యలని నివారిస్తాయి. శీతాకాలంలో మహిళలు తప్పనిసరిగా ఈ ఆరు హెల్తీ ఫుడ్స్ తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. బలంగా కూడా తయారవుతారు.

నెయ్యి: నెయ్యిలో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుందని అది శరీరంలోకి చేరితే లావు అయిపోతారనే అంటారు. కానీ వాస్తవానికి అది కేవలం అపోహ మాత్రమే. ఆవు పాలతో చేసిన నెయ్యి చలికాలంలో తీసుకుంటే అది మిమ్మల్ని వెచ్చగా ఉంచుతుంది. పోషకాలతో నిండిన ఆరోగ్యకరమైన కొవ్వు ఇది. ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని ఆహారంలో కలుపుకుని తీసుకోవచ్చు.

ఉసిరి: విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇండియన్ గూస్ బెర్రీ అని కూడా పిలుస్తారు. ఉదయం వేళ ఖాళీ కడుపుతో ఒక ఉసిరికాయ తినడం వల్ల ఎంతటి కఠినమైన వాతావరణ పరిస్థితులని ఎదుర్కోగల సామర్థ్యం పొందుతారు.

News Reels

వేరుశెనగ చిక్కి: పల్లీ పట్టి అని కూడా పిలుస్తారు. చాలా రుచికరంగా ఉండే ఈ చిక్కి తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. మహిళలు తరచూ పల్లీ చిక్కి తినడం వల్ల రక్తహీనత సమస్య ఎదుర్కోవచ్చు. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. చర్మ సంరక్షణకి మేలు చేస్తుంది. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ. ఇందులోని పోషకాలు చర్మ సమస్యలని దూరం చేస్తాయి. రోగనిరోధక శక్తి పెంచి వైరస్ లు దాడి చేయకుండా అడ్డుకుంటుంది. జీర్ణశక్తి పెంచుతుంది, బరువు తగ్గేందుకు దోహదపడుతుంది.

పంజిరి: అనేక రకాల గింజలు, బెల్లం తో కలిపి చేసే ఒక తీపి పదార్థం. ఇది ఆరోగ్యాన్ని ఇస్తుంది. రోగనిరోధక శక్తి పెంచుతుంది. జలుబు, దగ్గు నుంచి దూరం చేస్తుంది. దీన్ని నెయ్యితో కలిపి లడ్డూల రూపంలో తీసుకోవచ్చు.

బెల్లం: బెల్లం శరీరంలో వేడిని ఉత్పత్తి చేసే చక్కని పదార్థం. తాటి బెల్లం చాలా మంచిది. ఇది తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ (జిఐ) కలిగి ఉండటం వల్ల ఆరోగ్యానికి చాల మంచిది. పోషకాలతో నిండి ఉంటుంది. రోగనిరోధక శక్తి పెంచుతుంది. మధుమేహులు కూడా దీన్ని తినొచ్చు. చక్కెరకి ప్రత్యామ్నాయంగా బెల్లం తీసుకోవచ్చు.

శొంఠి: ఆరోగ్యంగా ఉండేందుకు దీన్ని మీ ఆహారంలో చేర్చుకోవాల్సిందే. రోగనిరోధక శక్తిని బలంగా ఉంచుతుంది. టీలో కూడా వేసుకుని తాగొచ్చు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Also Read: చలికాలంలో సన్ స్క్రీన్ లోషన్ ఎందుకు రాసుకోవాలి? దాని వల్ల ఉపయోగాలు ఏంటి?

Published at : 16 Nov 2022 02:55 PM (IST) Tags: women Health Jaggery Diet Food Woman Health Care Winter Diet For Woman Immunity Food

సంబంధిత కథనాలు

దగ్గితే పక్కటెములు విరిగాయ్, మహిళకు వింత పరిస్థితి - ఇలా మీకూ జరగవచ్చు, ఎందుకంటే..

దగ్గితే పక్కటెములు విరిగాయ్, మహిళకు వింత పరిస్థితి - ఇలా మీకూ జరగవచ్చు, ఎందుకంటే..

Curd: చలికాలంలో పెరుగు తినొచ్చా? అపోహలు- వాస్తవాలు ఇవే

Curd: చలికాలంలో పెరుగు తినొచ్చా? అపోహలు- వాస్తవాలు ఇవే

Tattoo: టాటూ పిచ్చి కంటి చూపుని పోగొట్టింది- పచ్చబొట్టు వల్ల ఇన్ఫెక్షన్స్, అంటు వ్యాధులు రావొచ్చు

Tattoo: టాటూ పిచ్చి కంటి చూపుని పోగొట్టింది- పచ్చబొట్టు వల్ల ఇన్ఫెక్షన్స్, అంటు వ్యాధులు రావొచ్చు

Bathing: గడ్డకట్టేలా ఉన్న నీళ్లలో ఈత కొడితే ఏమవుతుంది? అలా స్నానం చేస్తే మైండ్ ఫ్రెష్ అవుతుందా !

Bathing: గడ్డకట్టేలా ఉన్న నీళ్లలో ఈత కొడితే ఏమవుతుంది? అలా స్నానం చేస్తే మైండ్ ఫ్రెష్ అవుతుందా !

Milk: నెయ్యి కలిపిన పాలు రోజుకో గ్లాస్ తాగారంటే ఈ సమస్యలన్నీ దూరం అవుతాయి

Milk: నెయ్యి కలిపిన పాలు రోజుకో గ్లాస్ తాగారంటే ఈ సమస్యలన్నీ దూరం అవుతాయి

టాప్ స్టోరీస్

Breaking News Live Telugu Updates: టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా గుర్తిస్తూ ఈసీ ప్రకటన! 

Breaking News Live Telugu Updates: టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా గుర్తిస్తూ ఈసీ ప్రకటన! 

AP BJP Reaction On Sajjla : మళ్లీ వైఎస్ఆర్‌సీపీ , టీఆర్ఎస్ డ్రామా స్టార్ట్ - సజ్జల సమైక్యవాదంపై ఏపీ బీజేపీ సెటైర్ !

AP BJP Reaction On Sajjla :  మళ్లీ వైఎస్ఆర్‌సీపీ , టీఆర్ఎస్ డ్రామా స్టార్ట్ - సజ్జల సమైక్యవాదంపై ఏపీ బీజేపీ సెటైర్ !

Why Vijaysaireddy Lost Post : అసభ్య ట్వీట్లే పదవిని దూరం చేశాయా ? విజయసాయిరెడ్డికి " ప్యానల్ వైస్ చైర్మన్" పోస్ట్ ఎలా దూరం అయింది ?

Why Vijaysaireddy Lost Post :  అసభ్య ట్వీట్లే పదవిని దూరం చేశాయా ? విజయసాయిరెడ్డికి

Weather Updates AP: మాండూస్ తుపాన్ ఎఫెక్ట్ - రాబోయే మూడు రోజులు ఏపీలో వర్షాలు!

Weather Updates AP: మాండూస్ తుపాన్ ఎఫెక్ట్ - రాబోయే మూడు రోజులు ఏపీలో వర్షాలు!