Dating: ఈమెకు ఎవరూ నచ్చరు, రెండేళ్లలో 200 మంది ప్రియుళ్లను మార్చింది, స్టిల్ కౌంటింగ్
ప్రపంచంలో ఈమె కంటే పెద్ద స్వార్థపరురాలు ఎవరూ ఉండరు. రెండేళ్ల లోపే ఆమె 200 మందితో డేటింగ్ చేసిందట. అంతేమందికి బ్రేకప్ కూడా చెప్పేసిందట.
మనసు కోతిలాంటిది.. ఎప్పుడు ఎలా మారిపోతుందో తెలీదు. ముఖ్యంగా టీనేజ్ వయస్సులో.. నిర్ణయాలు తీసుకోవడంలో చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ విషయంలో అమ్మాయిలు, అబ్బాయిలనే తేడా ఏమీ ఉండదు. ఆ ఏజ్ వారికి ఎవరు నచ్చుతారో.. ఎవరో నచ్చరో తెలీదు. నచ్చిన వ్యక్తితో కొన్నాళ్లు లైఫ్‌లో జర్నీ చేసిన తర్వాతే ఒక క్లారిటీ వస్తుంది. అయితే, దక్షిణ కొరియాకు చెందిన ఈ యువతి టీనేజ్‌ను దాటేసినా.. ఇంకా కన్ఫ్యూజన్ దశలోనే ఉండిపోయింది. పెద్ద పెద్ద ఆశలతో ఎవరినీ తన బాయ్‌ఫ్రెండ్‌గా స్వీకరించలేకపోతోంది. ఫలితంగా రెండేళ్ల వ్యవధిలోనే 200 మంది బాయ్‌ఫ్రెండ్‌లను మార్చింది. ఇప్పటికీ ఆమె తీరు అలాగే ఉంది. దీంతో చాలామంది అబ్బాయిలు.. ఆమెతో ప్రేమ లేదా డేటింగ్ అంటే.. తుమ్మితే ఊడిపోయే ముక్కులాంటిదే అనే నిర్ణయానికి వచ్చేశారు. చివరికి ఆమె ఎంత పాపులర్ అయిపోయిందంటే.. ఓ టీవీ చానెల్ కూడా ఆమె ఇంటర్వ్యూ తీసుకుంది.
హాన్ మిరిమ్ అనే యువతి ఇటీవల స్థానిక కొరియన్ టీవీ షో ‘మార్స్ పీపుల్ ఎక్స్‌ఫైల్’ అనే కార్యక్రమంలో కనిపించింది. ఈ సందర్భంగా ఆమె ఇప్పటివరకు తాను చేసిన డేటింగ్స్ గురించి చెప్పింది. సుమారు 200 మంది అబ్బాయిలతో తాను డేట్ చేశానని చెప్పింది. కానీ, వారిలో తనకు ఎవరూ నచ్చేవారు కాదని తెలిపింది. ఏదో ఒక కారణంతో వారితో బ్రేకప్ అయ్యేదని, కొన్నిసార్లు మార్నింగ్ కలిసి.. సాయంత్రమే నచ్చలేదని చెప్పేసిన సందర్భాలు ఉన్నాయని తెలిపింది.
తాను డేటింగ్ చేసే అబ్బాయిలతో ఎందుకు బ్రేకప్ చెప్పాల్సింది వచ్చిందో కూడా ఆమె చెప్పింది. అయితే, ఆమె చెప్పిన కారణాలు వింటే చాలా సిల్లీగా అనిపిస్తాయి. రెస్టారెంట్‌లో ఫుడ్ తినేసిన తర్వాత బిల్ షేర్ చేసుకోవాలని అడిగినవాళ్లను, గిఫ్టులు ఇవ్వకుండా పీనాసితనం చూపేవాళ్లను, తన కోసం ఎలాంటి ఖర్చులు చేయని వ్యక్తులకు బ్రేకప్ చెప్పానని పేర్కొంది. అయితే, ఈ రెండేళ్లలో చేసిన 200 పైగా డేటింగ్‌ల వల్ల రూ.68.73 లక్షలు విలువ చేసే గిఫ్టులు లభించాయని తెలిపింది. వాటిలో ఆభరణాలు, దుస్తులు, వివిధ గ్యాడ్జెట్‌లు ఉన్నాయని తెలిపింది.
తనకు ఏం కావాలనే దానిపై క్లారిటి ఉందని హాన్ చెబుతోంది. అయితే, ఫైనాన్షియల్ డిమాండ్స్‌ను తాను డేట్ చేసే వ్యక్తులు రీచ్ కాలేకపోతున్నారని తెలుపుతోంది. ఆ విషయంలో విఫలమైనవారిని వెంటనే వదిలేసి.. మరొకరిని వెతుకుతున్నానని తెలిపింది. ఆ టీవీ చానెల్.. ఆమెతో డేటింగ్ చేసిన అబ్బాయిలతో కూడా మాట్లాడింది. అయితే, వారు తమని ఆమెకు ‘ఎక్స్’ అని చెప్పుకోడానికి బదులు.. ఆమె బాధితులమని తెలుపుతున్నారు. ఓ యువకుడు హాన్ గురించి మాట్లాడుతూ.. ‘‘తాను అస్తమాను తన మొబైల్ బిల్లు చాలా వచ్చేసిందని, కట్టాలని చెబుతుండేది. ఆఖరికి నేను కడతానని చెప్పేవరకు ఆమె పదే పదే ఆ విషయాన్నే చెప్పేది. దీంతో నేను నీ మొబైల్ బిల్లు నేను కడతా. డిన్నర్ బిల్లు నువ్వు కట్టు అని అడిగాను. ఇందుకు ఆమె అంగీకరించలేదు. బ్రేకప్ చెప్పేసి వెళ్లిపోయింది’’ అని తెలిపాడు.
ఇంటర్వ్యూలో భాగంగా టీవీ రిపోర్టర్.. ‘‘మీరు మీ బాయ్‌ఫ్రెండ్‌తో డేటింగ్ చేస్తున్నప్పుడు షూట్ చేయొచ్చా?’’ అని అడిగారు. ఇందుకు ఆమె సమాధానం ఇస్తూ.. ‘‘చేయొచ్చు, కానీ.. అప్పటికప్పుడు బ్రేకప్ అయితే నేను ఏమీ చేయలేను’’ అని సమాధానం ఇచ్చింది. అయితే, ఈ కార్యక్రమం ప్రసారమైన తర్వాత ఆమె ఎన్నో నెగటివ్ కామెంట్లను ఎదుర్కోవలసి వచ్చింది. నెటిజనులు సోషల్ మీడియాలో ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. వేలాది నెగటివ్ మెసేజ్‌లు ఆమెను ఉక్కిరి బిక్కిరి చేశాయి. దీంతో ఆమె వెంటనే మాట మార్చింది. ‘‘నేను 30 మంది కంటే ఎక్కువ మందితో డేటింగ్ చేయలేదు. అది చాలా తక్కువ సంఖ్య అని టీవీ చానెల్ వాళ్లు చెప్పారు. అందుకనే 200 మందితో డేటింగ్ చేశానని చెప్పా. నా బాయ్‌ఫ్రెండ్‌గా కనిపించిన అబ్బాయితో గతంలో ఓసారి డేటింగ్ చేశాను. అదంతా స్క్రిప్టెడ్ (రచయిత సృష్టి). వాళ్లు చెప్పినట్లే చేశా’’ తెలిపింది. అయితే, టీవీ చానెల్ వాళ్లు ఈ విషయాన్ని ఖండించారు. ఆమె అంతమందితో డేటింగ్ చేశానని చెప్పడం వల్లే షోకి తీసుకొచ్చామని స్పష్టం చేశారు. మరి, నిజం ఏమిటనేది ఆ టీవీ చానెల్‌కు, హాన్‌కు మాత్రమే తెలియాలి.