Window Seat in Plane: విమానం విండో సీటులో కూర్చోకూడదట - ఎందుకో తెలిస్తే వణికిపోతారు!
తరచుగా విమానంలో విండో సీట్లో కూర్చుని ప్రయాణం చేస్తే అది మీ ఆరోగ్యానికి అంత మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకో ఇక్కడ తెలుసుకుందాం.
ప్రయాణం ఎలాంటిదైనా సరే విండో సీట్ దగ్గర కూర్చుంటే ఆ కిక్కే వేరు. బయటకు చూస్తూ కాసేపు ప్రయాణ సమయాన్ని మరిచిపోవచ్చు. ఇక అది విమాన ప్రయాణమైతే ఆ ఆనందమే వేరు. విమానంలో విండో సీటు దగ్గర కూర్చుని విహంగ విక్షణం చెయ్యడంలో ఉండే మజా గురించి చెప్పేందుకు మాటలు చాలవు. కానీ విమానంలో విండో సీటు దగ్గర కూర్చోడం వల్ల కొన్ని భయానక సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
విమానం విండో సీట్ దగ్గర కూర్చుంటే ఏం జరుగుతుంది?
విమానంలో విండో సీటు ప్రయాణం అన్నిసార్లు మంచిదని నిపుణులు చెబుతున్నారు. మీరు ఎక్కువగా విమాన ప్రయాణాలు చేస్తుంటే తప్పకుండా ఈ విషయంలో జాగ్రత్త తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే విమానంలో విండో సీటు ప్రయాణం వల్ల చర్మ క్యాన్సర్‌కు గురయ్యే ప్రమాదం ఉందట. అలాగే.. వృద్ధాప్య ఛాయలు సైతం చర్మం మీద కనిపిస్తాయట. అంతేకాదు చర్మ క్యాన్సర్ ప్రమాదం కూడా పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ఎందుకలా జరుగుతుంది?
విమానం ఎత్తులో ప్రయాణిస్తున్నప్పుడు అతి నీలలోహిత కిరణాల రేడియేషన్ తీవ్రంగా ఉంటుందంట. అంటే నేల మీద ఉన్నప్పటి కంటే కూడా ఎత్తులో ఎగురుతున్న విమానంలో యూవీ రేడియేషన్ ఎక్కువగా ఉంటుందని అర్థం. అతినీలలోహిత కిరణాలు సూర్యుడి నుంచి నేరుగా వచ్చే కిరణాలు. ఇవి చర్మాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి. సాధారణంగా రెండు రకాల యూవీ కిరణాలు భూమి మీదకు చేరుతాయి. అవి UV B, UV A.
UV B వడదెబ్బకు కారణమవుతుంది. కానీ UV A చర్మంలోపలికి చొచ్చుకుని పోతుంది. మేఘావృతంగా ఉన్న సందర్భాల్లో కూడా ఈ కిరణాలు భూమిని చేరుతాయి. ఈ రెండు రకాల కిరణాలు కూడా క్యాన్సర్ కు కారణం అవుతాయి. విమానం కిటికీ అద్దాలు చాలా వరకు UV Bని నిరోధించగలుగుతాయి. కానీ UV A రేడియేషన్ ను పూర్తిగా ఫిల్టర్ చెయ్యలేవు. UV A కిరణాల తరంగదైర్ఘ్యం చాలా ఎక్కువ. ఇవి గాజు నుంచి కూడా చొచ్చుకుని వెళ్ల గలవు. ఈ కిరణాల రేడియేషన్ ఎక్కువ సమయం పాటు గురికావడం వల్ల చర్మం దెబ్బతింటుంది. అకాల వృద్ధాప్యం, చర్మ క్యాన్సర్‌కు కారణం కావచ్చు.
సాధారణ ప్రయాణికులతో పోల్చినపుడు పైలెట్లు, ఇతర క్యాబిన్ సిబ్బంది మైలోమా అనే చర్మ క్యాన్సర్ బారిన పడే ప్రమాదం రెండు రెట్లు ఎక్కువ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చర్మానికి జరిగే సన్ డ్యామెజ్, ఫ్లయింగ్ మధ్య సంబంధం ఉందన్న మాట. భూమధ్య రేఖ దగ్గరగా విమానం ఎగురుతుంటే ఈ ప్రమాదం మరింత ఎక్కువగా ఉంటుందట. మధ్యాహ్న సమయాల్లో స్పెయిన్ మీదుగా ప్రయాణం సాగుతుంటే ఎక్కువ రేడియేషన్ కు గురయ్యే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. భూమధ్య రేఖ పరిసరాల్లో రేడియేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి విమాన ప్రయాణంలో సూర్య కాంతి నుంచి రక్షించుకోవడానికి బెస్ట్ ప్లేస్ మధ్య సీట్ ఎంచుకోవడమే అని నిపుణులు సూచిస్తున్నారు.
ఒకవేళ విండో సీట్ ఎంచుకుంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి
లేదా ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు విండోస్ క్లోజ్ చేసుకోవడం ఉత్తమం. ఇలా చెయ్యడం వల్ల చర్మాన్ని రేడియేషన్ నుంచి రక్షించుకోవచ్చు.
బ్రాడ్ స్పెక్ట్రమ్ సన్ స్ర్కీన్ ని చర్మం మీద రాసుకుని ప్రయాణం చెయ్యాలి. ప్రొటెక్టివ్ క్లోతింగ్, సన్ గ్లాసెస్ ధరించడం కూడా మంచి ఆప్షన్ గా నిపుణులు సూచనలు చేస్తున్నారు.
Also read : బరువు పెరుగుతున్నారా? జాగ్రత్త, ఈ 5 రకాల క్యాన్సర్లు ప్రాణాలు తీయొచ్చు!
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial