(Source: ECI/ABP News/ABP Majha)
Finger Cracking Habit: చేతి వేళ్లు విరుచుకొనే అలవాటుందా? ‘మెటికలు’పై డాక్టర్ ఏం చెప్పారో చూడండి
చేతి వేళ్లు విరచకూడదని పెద్దలు ఎందుకు చెబుతారో తెలుసా? మెటికల అలవాటుపై డాక్టర్ ఏం చెప్పారో చూడండి
చేతి వేళ్లను విరుచుకోవడం లేదా మెటికలు.. మంచి అలవాటు కాదని, ఇంటికి చెడు జరుగుతుందని మీ పెద్దలు చాలాసార్లు మీకు చెప్పే ఉంటారు. కానీ, మీరు దాన్ని ఎన్నోసార్లు పెడచెవిని పెట్టి ఉంటారు. చేతి వేళ్లను విరుచుకొనేప్పుడు వచ్చే శబ్దం వినేందుకు బాగుంటుందనే కారణంతో చాలామంది చీటికి మాటికి వేళ్లను విరుచుకుంటూ ఉంటారు. మరి, ఈ అలవాటు మంచిదేనా? పెద్దలు చెప్పింది కరెక్టేనా?
మెటికల వల్ల ఇంటికి చెడు జరగుతుందా, లేదా అనేది తెలీదుగానీ.. ఆరోగ్యానికి మాత్రం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. డాక్టర్ క్లార్ క్రస్టెల్నీకి ఓ సోషల్ మీడియా వేదికగా చేతి వేళ్లను విరుచుకొనే అలవాటు గురించి స్పష్టమైన వివరాలు చెప్పారు. మీకు చేతి వేళ్లను విరుచుకొనే అలవాటు ఉంటే వెంటనే మానుకోవాలని, లేకపోతే భవిష్యత్తులో సమస్యలు తప్పవన్నారు.
చేతి వేళ్లను విరవడం లేదా మెటికల అలవాటు కలిగిన వ్యక్తులు భవిష్యత్తులో 75 శాతం వరకు చేతి పట్టును కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. కనీసం సీసా మూత కూడా తీయలేనంతగా చేతి వేళ్ల కీళ్లు బలహీనమైపోతాయన్నారు. మెటికలు అలవాటే కాదు, పిడికిలి బిగించి వస్తువులను పగలగొట్టడం కూడా సమస్యలు తెచ్చిపెడతాయన్నారు. అయితే, చేతి వేళ్లను విరిచే అలవాటు వల్ల ‘అర్థరైటిస్’ సమస్యలు వస్తాయనడంలో మాత్రం వాస్తవం లేదన్నారు.
ఆ శబ్దం ఎందుకు వస్తుంది?: మీరు వేలును విరుచుకొనేప్పుడు.. ఎముకల మధ్య ఉండే ఖాళీ మధ్య గ్యాప్ ఏర్పడుతుంది. దీంతో జాయింట్ల మధ్య ఉండే సినోవియల్ లిక్విడ్‌లో గ్యాస్ బుడగ ఏర్పడుతుంది. వేళ్లను వంచడం లేదా విరుచుకోవడం వల్ల ఆ బుడగ పేలి శబ్దం వస్తుంది. అయితే, ఆ శబ్దం మనకు చేతి ఎముక విరిగినట్లుగా అనిపిస్తుంది. దానివల్ల ఏర్పడే శక్తి వల్ల 7 శాతం వరకు మృదులాస్థి దెబ్బతినవచ్చని చెప్పారు.
Also Read: అతడి అంగాన్ని చేతికి కుట్టేసిన వైద్యులు, కారణం తెలిస్తే మైండ్ బ్లాక్ అవుతుంది!
‘అర్థరైటిస్’పై అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?: ఓ అధ్యయనం ప్రకారం.. ఓ వ్యక్తికి ఎడమ చేతి కీళ్ళను విరిచే అలవాటు ఉంది. గత 50 సంవత్సరాలుగా అతడికి ఆ అలవాటు ఉంది. ఇప్పటికీ అతడి రెండు వేళ్లు సక్రమంగానే ఉన్నాయి. అతడి ఎడమ చేతికి ‘ఆర్థరైటిస్’ సమస్యలేవీ లేవు. కానీ, వ్యక్తిని దీనికి ఉదాహరణగా చెప్పడం భావ్యం కాదన్న ఉద్దేశంతో మరోస్టడీ 300 మందిపై అధ్యయనం చేశారు. 35 ఏళ్లుగా ఆ అలవాటు ఉన్న ఆ వ్యక్తుల వేళ్లను పరిశీలించారు. అయితే, వారిలో కూడా అర్థరైటిస్ సమస్యలేవీ కనిపించలేదు. కానీ వారి కీళ్లు మాత్రం వాచాయి. కానీ, పట్టు ప్రతి నలుగురిలో ఒకరు పట్టును కోల్పోయినట్లు గుర్తించారు. వేళ్లు విరుచుకొనే అలవాటు వల్ల అర్థరైటిస్ రాకపోవచ్చు. కానీ, పట్టును కోల్పోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి, దాన్ని అలవాటు చేసుకోవద్దు. కాబట్టి, పెద్దలు చెప్పేది కూడా వినండి. ఒంటికి, ఇంటికి మంచిది.
Also Read: క్రీడాకారుల మలంతో ప్రత్యేక మాత్రలు - వీటిని ఏ వ్యాధికి వాడతారో తెలుసా?