News
News
X

Curd Vs Buttermilk: పెరుగు కంటే మజ్జిగ తీసుకోవడం మంచిదా? ఆయుర్వేద శాస్త్రం ఏం చెబుతోంది?

పెరుగు తింటే ఎన్నో లాభాలు ఉన్నాయి. కానీ ఈ సమస్యలు ఉన్న వాళ్ళు పెరుగు తినకపోవడమే ఉత్తమం.

FOLLOW US: 
Share:

పాలు, పెరుగు లేకుండా అసలు ఉండలేరు కొంతమంది. పాల నుంచి పెరుగు దాని నుంచి మజ్జిగ వచ్చినప్పటికీ మూడింటి మధ్య తేడాలు చాలా ఉన్నాయి. అవి అందించే పోషకాలు కూడా భిన్నంగా ఉంటాయి. కానీ చాలా మంది మాత్రం పెరుగు కంటే మజ్జిగ తీసుకోమని సూచించడానికి కారణం ఏంటి అంటే.. ఈ మూడు శరీరంలో ప్రతి స్పందించే విధానంలోని మార్పులే అందుకు కారణమని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది. ఇది వేడిని తాకినప్పుడు పులియబెడుతుంది. అది కడుపులోకి వచ్చినపుడు కూడా పొట్టలోని వేడి ఆమ్లాలు కారణంగా పులియబెట్టడం జరుగుతుంది. దాని వల్ల పేగులు వేడెక్కుతాయి. కానీ పెరుగు నుంచి వచ్చిన మజ్జిగ మాత్రం శరీరాన్ని చల్లబరుస్తుందని అంటారు. మజ్జిగ అన్ని రకాల శరీరాలకు, సీజన్లకు అనుకూలంగా ఉంటుంది. అందుకే పెరుగు కంటే మజ్జిగ చాలా ఆరోగ్యకరమైనదని స్పష్టం చేశారు. పెరుగు కొవ్వు, బలాన్ని పెంచుతాయి. వాత అసమతుల్యతను తగ్గించడంలో సహాయపడుతుంది. పెరుగుని అందరూ తినలేరు.

ఎవరు తినకూడదు?

ఊబకాయం, కఫ రుగ్మతలు, రక్తస్రావం, వాపు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళు పెరుగుకి దూరంగా ఉండాలి. అంతే కాదు రాత్రిపూట పెరుగు తినకూడదని ఆయుర్వేద శాస్త్రం నొక్కి చెప్తుంది. ఎందుకంటే ఇది జలుబు, దగ్గు, సైనస్ లు ప్రేరేపిస్తుంది. ఒకవేళ రాత్రిపూట పెరుగు తినకుండా ఉండలేరని అనుకుంటే అందులో చిటికెడు మిరియాలు లేదా మెంతులు వేసుకుని తినడం అలవాటు చేసుకోవాలి.

పెరుగుని వేడి చేయకూడదు. అందులొనీ మంచి బ్యాక్టీరియా నాశనం అవుతుంది. కొంతమంది పెరుగుని వేడి చేసి మజ్జిగ చారు వంటివి తయారు చేస్తారు. అయితే అది తరచూ తింటున్న వారి శరీరం మాత్రమే తట్టుకోగలదు.

చర్మ రుగ్మతలు, పిత్త అసమతుల్యత, తలనొప్పి, నిద్రలేమి, జీర్ణ సమస్యలు ఉన్న వాళ్ళు పెరుగు తినకపోవడం మంచిది.

అయితే పెరుగుకి బదులు దాని నుంచి వచ్చే మజ్జిగ ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. మజ్జిగలో కొద్దిగా జీలకర్ర పొడి, పింక్ సాల్ట్, కొత్తిమీర వేసి తాగితే రుచి అద్భుతంగా ఉంటుంది.

మజ్జిగ ప్రయోజనాలు

ఆరోగ్యాన్ని కాపాడుతుంది. వ్యాధులను నయం చేస్తుంది. జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. సులభంగా జీర్ణమవుతుంది. వాపు, జీర్ణ సమస్యలు, జీర్ణకోశ సమస్యలు ఆకలి లేకపోవడం, రక్తహీనత సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.

చలికాలంలో అయితే అజీర్ణం సమస్య రాకుండా నివారిస్తుంది. మజ్జిగ తేలికగా ఉండటం వల్ల జీర్ణం కావడం సులభం. ఆకలిని ప్రేరేపించడానికి సహాయపడుతుంది. అదే పెరుగు తీసుకుంటే జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. మలబద్ధకం, గ్యాస్ట్రిక్ లేదా యాసిడ్ రిఫ్లక్స్ వంటి జీర్ణ సమస్యలు ఉంటే మజ్జిగ చక్కని ఎంపిక

బరువు తగ్గేందుకు దోహదపడుతుంది. బరువు పెరగాలంటే పెరుగు తగ్గాలంటే మజ్జిగ ఎంచుకోవాలి. మజ్జిగ తేలికగా ఉండటం వల్ల శరీరానికి చల్లదనం ఇస్తుంది. వేడికి దూరంగా ఉంచుతుంది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Also Read: శరీరం డీహైడ్రేట్‌కు గురైతే తాగాల్సింది నీరు కాదు - ఇవిగో ఇవి తాగండి

Published at : 02 Feb 2023 03:41 PM (IST) Tags: Curd Ayurvedam Buttermilk Curd Vs Buttermilk Yogurt Benefits Of Buttermilk

సంబంధిత కథనాలు

సోయాతో చేసిన మీల్ మేకర్‌ను మగవారు తినకూడదని అంటారు, ఇది ఎంతవరకు నిజం?

సోయాతో చేసిన మీల్ మేకర్‌ను మగవారు తినకూడదని అంటారు, ఇది ఎంతవరకు నిజం?

Sleeping: రోజులో 9 గంటలకు మించి నిద్రపోతున్నారా? అతి నిద్ర వల్ల కలిగే సైడ్ ఎఫెక్టులు ఇవే

Sleeping: రోజులో 9 గంటలకు మించి నిద్రపోతున్నారా? అతి నిద్ర వల్ల కలిగే సైడ్ ఎఫెక్టులు ఇవే

ఈ హెయిర్ మాస్క్‌లు ట్రై చెయ్యండి - ఇక జుట్టు అందానికి తిరుగుండదు

ఈ హెయిర్ మాస్క్‌లు ట్రై చెయ్యండి -  ఇక జుట్టు అందానికి తిరుగుండదు

Salt Side Effects: ఉప్పు ఎక్కువైతే ముప్పే - ఈ సూచనలు పాటిస్తే మీ ఆరోగ్యం సేఫ్!

Salt Side Effects: ఉప్పు ఎక్కువైతే ముప్పే - ఈ సూచనలు పాటిస్తే మీ ఆరోగ్యం సేఫ్!

Overripe Banana: ఒత్తిడి తగ్గించుకోవాలా? మాగిన అరటిపండు తినేయండి - ఇంకా లాభాలెన్నో!

Overripe Banana: ఒత్తిడి తగ్గించుకోవాలా? మాగిన అరటిపండు తినేయండి - ఇంకా లాభాలెన్నో!

టాప్ స్టోరీస్

Dharmapuri Sanjay On DS : డీఎస్ కు ప్రాణ హాని ఉంది, ఎంపీ అర్వింద్ పై సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Dharmapuri Sanjay On DS :  డీఎస్ కు ప్రాణ హాని ఉంది, ఎంపీ అర్వింద్ పై సంజయ్ సంచలన వ్యాఖ్యలు

అమరావతి కేసుపై నేడు సుప్రీంలో విచారణ- 3 రాజధానుల సంగతి తెలియదన్న కేంద్రం

అమరావతి కేసుపై నేడు సుప్రీంలో విచారణ- 3 రాజధానుల సంగతి తెలియదన్న కేంద్రం

Ram Charan Birthday - NTR : రామ్ చరణ్ బర్త్‌డే పార్టీకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు?

Ram Charan Birthday - NTR : రామ్ చరణ్ బర్త్‌డే పార్టీకి ఎన్టీఆర్ ఎందుకు రాలేదు?

Hyderabad News: ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవాలనుకుంటున్నారా - మీకోసమే కొత్త వెబ్ సైట్

Hyderabad News: ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవాలనుకుంటున్నారా - మీకోసమే కొత్త వెబ్ సైట్