News
News
X

Arthritis: చలికాలంలో ఆర్థరైటిస్ నొప్పులు ఎందుకు ఎక్కువగా ఉంటాయి? వాటిని తగ్గించుకోవడం ఎలా?

కీళ్ల నొప్పులు వస్తే జీవితాంతం వాటిని భరించాలి. వాతావరణం చల్లగా ఉంటే ఆర్థరైటిస్ నొప్పులు ఎక్కువగా బాధిస్తాయి. వాటి నుంచి ఉపశమనం పొందాలంటే ఈ చిట్కాలు పాటించాల్సిందే.

FOLLOW US: 
Share:

ఆర్థరైటిస్ తో బాధపడే వాళ్ళకి చలికాలం ఒక నరకం అనే చెప్పాలి. చల్లని వాతావరణం కారణంగా కీళ్ల నొప్పులు మరింత తీవ్రతరం అవుతాయి. సాధారణ రోజుల కంటే ఈ సీజన్ లో వారికి నొప్పులు అధికంగా ఉండటానికి పలు రకాల కారణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. బారోమెట్రిక్ ఒత్తిడిలో మార్పుల నుంచి కీళ్ల చుట్టూ ఉన్న రక్తనాళాలు దృఢంగా మారడం వరకు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకు పరిష్కారం ఒక్కటే. అదే జీవనశైలిలో మార్పులు చేసుకోవడం. అలా చేస్తే చలికాలంలో కూడా కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు. చురుకుగా ఉండటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, కీళ్ల మీద అధిక ఒత్తిడి కలిగించే కార్యకలాపాలకి దూరంగా ఉండటం వంటివి చెయ్యొచ్చు.

శీతాకాలంలో నొప్పులు ఎందుకు ఎక్కువ అవుతాయి?

శీతాకాలంలో నొప్పి పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎముకలు బలహీనంగా ఉండటం వల్ల నొప్పి ఎక్కువగా అనిపిస్తుంది. ఇది ఎముకలలోని నరాలు ఒత్తిడిలో మార్పులు తీసుకొస్తుంది. మరొక కారణం ఏంటంటే శీతాకాలంలో శరీరం వేడిని సంరక్షించుకోవడం కోసం రక్తం పెద్ద మొత్తంలో ప్రసరణ జరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో చేతులు, కాళ్లు, భుజాలు, మోకాలి కీళ్లలో ఉండే రక్తనాళాలు దృఢంగా మారతాయి. ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి అప్పుడు నొప్పి ఎక్కువగా అనిపిస్తుంది.

ఇలాంటి వారికి నొప్పులు మరింత ఎక్కువే

శీతాకాలంలో కండరాలు, స్నాయువు, సైనోవియం దృఢంగా ఏర్పడుతుంది. మోకాలిచిప్పలో ఉండే సైనోవియల్ ద్రవం తక్కువ ఉష్ణోగ్రత సమయంలో చిక్కగా ఉంటుంది. మోకాలి చుట్టూ ఉన్న గట్టి కండరాలు కదిలినప్పుడు ఘర్షణకి గురవుతాయి. అంతే కాదు సైనోవియల్ ద్రవం తక్కువ విడుదల కావడం వల్ల ఆస్టియోమలాసియా మార్పులకు దారితీస్తుంది. ఇవి ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న రోగులలో నొప్పిని పెంచుతుంది. కార్మికులు, రోజువారీ వేతన కూలీలు నిరంతరం శారీరక శ్రమకి గురవుతారు కాబట్టి వారిలో ఆర్థరైటిస్ ఉంటే ఈ సమస్యలు ఎదుర్కొంటారు. సైనోవియల్ ద్రవం కీళ్లలో వేడిని ఉత్పత్తి చేస్తుంది. శారీరక కార్యకలాపాలకి దూరంగా ఉన్న వాళ్ళు కూడా ఈ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

జీవనశైలిలో ఈ మార్పులు చేసి నొప్పిని ఎదుర్కోవచ్చు

⦿మిమ్మల్ని మీరు వెచ్చగా ఉంచుకునేందుకు నిండుగా ఉండే దుస్తులు ధరించాలి. ఇంటిని కూడా వేడిగా ఉంచుకునేందుకు ప్రయత్నించాలి.

⦿ఎండలో వేదంగా నడవడం లేదా జిమ్ చేయడం కూడా జీవక్రియ వేడిని పెంచడమే కాకుండా కీళ్ల పనితీరుని మెరుగుపరుస్తుంది. అలాగే కొన్ని స్పోర్ట్ యాక్టివిటీస్ లో పాల్గొనడం వల్ల కూడా నొప్పి తగ్గించుకోవచ్చు.

⦿ఆరోగ్యకరమైన ఆహారాలు ముఖ్యంగా పండ్లు, కూరగాయలు, చేపలు, గింజలు, డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి.

⦿విటమిన్ డి సప్లిమెంట్లు ప్రయోజనకరంగా ఉంటాయి.

⦿వేడి నీటితో స్నానం చేయడం కూడా మంచిది

⦿కీళ్లని కదిలిస్తూ రోజువారీ పనులు చేసుకోవాడచ్చు. కదలిక వల్ల నొప్పి తగ్గుతుంది. కండరాలు బలోపేతం చేస్తుంది.

⦿బరువు తగ్గడం అన్ని సమస్యలకి గొప్ప పరిష్కారం

⦿శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వాలి, మితంగా తినాలి

⦿రన్నింగ్, జంపింగ్ వంటివి పదే పదే చేయడం మంచిది కాదు

⦿ధూమపానం వదిలేయాలి. ఇది కణజాలంపై ఒత్తిడిని పెంచి ఆర్థరైటిస్ నొప్పిని పెంచుతుంది.

చలికాలంలో ఆర్థరైటిస్ రోగులు ఈ చిట్కాలు పాటించాలి

☀కీళ్ల ప్రాంతం చుట్టూ చర్మాన్ని రక్షించుకోవడం చాలా ముఖ్యం. అది పొడిగా మారితే కీళ్లపై మంటని కలిగిస్తుంది.

☀విటమిన్ ఏ, ఇ కలిగిన మాయిశ్చరైజర్లు రాసుకోవడం వల్ల నొప్పిని తగ్గిస్తాయి.

☀సూర్యుని వేడి శరీరానికి తగిలేలా చెయ్యాలి. అలా చేస్తే విటమిన్ డి అంది ఎముకలు బలంగా ఉండేందుకు సహాయపడుతుంది.

☀రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్నవారు నొప్పిని తగ్గించడానికి వెచ్చని నీటితో స్నానం చెయ్యాలి.

☀వ్యాయామం చేయడం వల్ల మోకాళ్లు మెరుగైన కదలికల కోసం సైనోవియల్ ద్రవాన్ని తగినంత మొత్తంలో విడుదల చేస్తాయి.

☀విటమిన్ డి, విటమిన్ సి, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, అల్లం, సోయా బీన్, కొవ్వు చేపలు, పచ్చి కూరగాయలు, నట్స్, పుష్కలంగా నీరు తీసుకోవాలి. కొల్లాజెన్ సప్లిమెంట్లతో కూడిన సమతుల్య ఆహారం కీళ్ళని బలోపేతం చేసేందుకు సహాయపడుతుంది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also Read: డెంగ్యూ నుంచి త్వరగా కోలుకునేలా చేసే సూపర్ ఫ్రూట్స్

Published at : 01 Dec 2022 11:59 AM (IST) Tags: Health Tips Arthritis Arthritis Remedies Arthritis Pain Relief Techniques Arthritis Winter Pains

సంబంధిత కథనాలు

Diabetes: డయాబెటిస్ రోగులు ఈ టీని రోజూ తాగితే మందుల అవసరం ఉండదు

Diabetes: డయాబెటిస్ రోగులు ఈ టీని రోజూ తాగితే మందుల అవసరం ఉండదు

ఏడు కిలోలకు పైగా బరువుతో పుట్టిన బిడ్డ - ఇలా భారీ బిడ్డలు పుట్టేందుకు కారణాలు ఏమిటి?

ఏడు కిలోలకు పైగా బరువుతో పుట్టిన బిడ్డ - ఇలా భారీ బిడ్డలు పుట్టేందుకు కారణాలు ఏమిటి?

Brain Health: మెదడుకు హాని చేసే ఆహారాలు ఇవే - వీటికి దూరంగా ఉండండి

Brain Health: మెదడుకు హాని చేసే ఆహారాలు ఇవే - వీటికి దూరంగా ఉండండి

Vitamin D: రోజూ 10 నిమిషాలు ఇలా చెయ్యండి - ‘విటమిన్ డి’ లోపమే ఉండదు

Vitamin D: రోజూ 10 నిమిషాలు ఇలా చెయ్యండి - ‘విటమిన్ డి’ లోపమే ఉండదు

Weight Loss: బరువు తగ్గే ప్లాన్ వేసుకుంటున్నారా? జాగ్రత్త, ఈ అపోహలు నమ్మొద్దు

Weight Loss: బరువు తగ్గే ప్లాన్ వేసుకుంటున్నారా? జాగ్రత్త, ఈ అపోహలు నమ్మొద్దు

టాప్ స్టోరీస్

Demand For TDP Tickets : టీడీపీ టిక్కెట్ల కోసం ఫుల్ డిమాండ్ - యువనేతలు, సీనియర్ల మధ్య పోటీ !

Demand For TDP Tickets :  టీడీపీ టిక్కెట్ల కోసం ఫుల్ డిమాండ్ - యువనేతలు, సీనియర్ల మధ్య పోటీ !

Government Websites Hacked: ప్రభుత్వ వెబ్‌సైట్‌లను టార్గెట్ చేస్తున్న హ్యాకర్లు,అలెర్ట్ అవుతున్న అధికారులు

Government Websites Hacked: ప్రభుత్వ వెబ్‌సైట్‌లను టార్గెట్ చేస్తున్న హ్యాకర్లు,అలెర్ట్ అవుతున్న అధికారులు

Amigos Pre Release - NTR Jr : అన్నయ్య కోసం వస్తున్న ఎన్టీఆర్ - రేపే కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ప్రీ రిలీజ్

Amigos Pre Release - NTR Jr : అన్నయ్య కోసం వస్తున్న ఎన్టీఆర్ - రేపే కళ్యాణ్ రామ్ 'అమిగోస్' ప్రీ రిలీజ్

Pawan Kalyan Latest Stills : 'హరి హర వీర మల్లు' సెట్స్‌లో పవన్ కళ్యాణ్ నవ్వులు చూశారా?

Pawan Kalyan Latest Stills : 'హరి హర వీర మల్లు' సెట్స్‌లో పవన్ కళ్యాణ్ నవ్వులు చూశారా?