News
News
X

Heart Health: గుండెకు మేలు చేసే నూనె ఇదే - ఏయే వంటలకు ఏయే నూనెలు మంచివో తెలుసా?

డీప్ ఫ్రై, కూరలు అన్నింటికీ ఒకే విధమైన నూనెలు వాడుతూ ఉంటారు. కానీ అవి ఎంత వరకు మంచిదో ఎప్పుడైనా ఆలోచించారా?

FOLLOW US: 
Share:

క్కొక్కరు వంట చేసేందుకు ఒక్కోరకమైన నూనెలు ఉపయోగిస్తారు. ఆవాలు, శుద్ధి చేసిన ఆలివ్ ఆయిల్, నువ్వుల నూనె, కొబ్బరినూనె, సన్ ఫ్లవర్ ఆయిల్, వేరుశెనగ నూనె ఇలా అనేక రకాల నూనెలు అందుబాటులో ఉంటున్నాయి. అయితే మీరు వాడుతున్న నూనె ఎంతవరకు ఆరోగ్యాన్ని ఇస్తుందనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. సరైన వంట నూనె ఉపయోగించడం వల్ల మొత్తం ఆరోగ్యంగా ఉంటారు. అయితే నూనె ఎంచుకునేటప్పుడు కొన్ని విషయాలు గురించి తెలుసుకోవాలి.

నూనె స్మోక్ పాయింట్ ముఖ్యం

నూనె స్మోక్ పాయింట్ ఎలా ఉందనేది గ్రహించాలి. నూనె అతిగా వేడి చేసినప్పుడు అందులో హానికరమైన రసాయనాలు విడుదల అవుతాయి. అందుకే నూనెలో స్మోక్ పాయింట్ తక్కువగా ఉన్నవి ఉపయోగిస్తారు. కానీ ఇవి డీప్ ఫ్రై వంటలు చేయడానికి మాత్రం పనికిరావు. అందుకే వంటలకి భారతీయులు ఆలివ్ నూనె ఉపయోగిస్తారు. కానీ ఫ్రైస్ చేసుకోవడానికి ఎంచుకోరు. వంటకి ఏ నూనె ఉత్తమంగా ఉంటుందో దాని స్మోక్ పాయింట్ ఆధారంగా నిర్ణయిస్తారు. నూనెని స్మోక్ పాయింట్ కి మించి ఎక్కువగా వండితే అది హానికరంగా మారిపోతుంది.  

తయారీ ప్రక్రియ

నూనె తయారీ విధానం కూడా ఎలా ఉందో తెలుసుకోవాలి. సోయాబీన్, కనోలా, కుసుమ వంటి కొన్ని నూనెలు హెక్సేన్ వంటి ద్రావకాలను ఉపయోగించి నూనె తీస్తారు. వీటిని ఎక్కువగా శుద్ధి చేస్తారు. ప్రాసెసింగ్, శుద్ధి చేసిన ఆయిల్స్ ఇప్పుడు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఆలివ్, కొబ్బరి నూనె మొదలైనవి శుద్ధి చేయడం చాలా సులభం.

నూనెలోని కొవ్వు రకాలు

నాలుగు రకాల కొవ్వులు ఉంటాయి. సంతృప్త కొవ్వులు, మోనో శాచురేటెడ్ కొవ్వులు, పాలీఅన్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, కొద్దిగా ట్రాన్స్ ఫ్యాట్ ఉంటాయి. ప్రతి నూనెలో ఈ నాలుగు మిశ్రమంగా ఉంటాయి. వాటి నిష్పత్తిలో తేడా ఉంటుంది. సంతృప్త కొవ్వులు 20-30 శాతం ఉన్న నూనెలు పరిమితంగా వాడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఏ ఆహారాలకు ఏ నూనె మంచిది?

⦿ ఆమ్లెట్, కూరగాయలు వేయించడానికి ఆలీవ్ నూనె/ నువ్వుల నూనె ఉపయోగించాలి. అది కూడా తక్కువ నుంచి మధ్యస్థ వేడి మీద ఉడికించాలి.

⦿ కూరగాయలు వండటానికి ఆవాల నూనె/ కోల్డ్ ప్రెస్డ్ కొబ్బరినూనె మంచిది.

⦿ శుద్ది చేసిన కొబ్బరి నూనె స్మోక్ పాయింట్ 232 డిగ్రీల సెల్సియస్ కలిగి ఉంటుంది. ఇది సాటింగ్, బేకింగ్ లేదా ఫ్రైస్ కి మంచి ఎంపిక. పచ్చి కొబ్బరి నూనె 177 డిగ్రీల సెల్సియస్ వరకు మాత్రమే ఉపయోగించాలి.

⦿ చపాతీలకు నెయ్యి వాడాలి. సీడ్ ఆయిల్ కి దూరంగా ఉండాలి.

⦿ వాల్ నట్ ఆయిల్ లేదా అవిసె గింజల నూనె గుండెని ఆరోగ్యంగా ఉంచుతాయి. క్యాన్సర్ ని అడ్డుకునే యాంటీ ఇన్ఫ్లమేటరీ పోషకాలను కలిగి ఉంటుంది. ఈ నూనె స్మోక్ పాయింట్ 160 డిగ్రీల సెల్సియస్ కాగా అవిసె గింజల నూనె స్మోక్ పాయింట్ 107 డిగ్రీల సెల్సియస్. అందుకే సలాడ్ డ్రెస్సింగ్ వంటి వాటికోసం వీటిని ఉపయోగించవచ్చు.

⦿ డీప్ ఫ్రై కి నెయ్యిని ఉపయోగించుకోవచ్చు. ఇది ఎక్కువ స్మోక్ పాయింట్ కలిగి ఉంటుంది.

⦿ హమ్మస్/ సలాడ్ డ్రస్సింగ్ కోసం పచ్చి ఆలివ్ ఆయిల్ వేసుకోవచ్చు. దీని స్మోక్ పాయింట్ 2243 డిగ్రీల సెల్సియస్. రోస్టింగ్, గ్రిల్లింగ్ వంటి వాటి కోసం కూడా ఉపయోగించుకోవచ్చు.

⦿ నూనెలో ట్రాన్స్ ఫ్యాట్ నిష్పత్తి ఎక్కువగా ఉండే ఆయిల్స్ మళ్ళీ మళ్ళీ వేడి చేయడం మానుకోవాలి.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also read: ఆయుష్షు కావాలా? ఆయుర్వేదం చెప్పిన ‘70-30’ ఫార్ములా ఫాలో అయిపోండి

Published at : 07 Feb 2023 03:13 PM (IST) Tags: Cooking oils Oils Cooking Oil Benefits Which Oil Is Better Healthy Oils

సంబంధిత కథనాలు

Coffee: కొవ్వుని కరిగించే కాఫీలు- ఓసారి ట్రై చేసి చూడండి

Coffee: కొవ్వుని కరిగించే కాఫీలు- ఓసారి ట్రై చేసి చూడండి

Peanut Butter: పీనట్ బటర్, రోజుకో స్పూను తింటే ఎంతో ఆరోగ్యం

Peanut Butter: పీనట్ బటర్, రోజుకో స్పూను తింటే ఎంతో ఆరోగ్యం

Vegan Chicken: వేగన్ చికెన్ - ఈ శాఖాహార చికెన్‌ను ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు

Vegan Chicken: వేగన్ చికెన్ - ఈ శాఖాహార చికెన్‌ను ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు

సోయాతో చేసిన మీల్ మేకర్‌ను మగవారు తినకూడదని అంటారు, ఇది ఎంతవరకు నిజం?

సోయాతో చేసిన మీల్ మేకర్‌ను మగవారు తినకూడదని అంటారు, ఇది ఎంతవరకు నిజం?

Sleeping: రోజులో 9 గంటలకు మించి నిద్రపోతున్నారా? అతి నిద్ర వల్ల కలిగే సైడ్ ఎఫెక్టులు ఇవే

Sleeping: రోజులో 9 గంటలకు మించి నిద్రపోతున్నారా? అతి నిద్ర వల్ల కలిగే సైడ్ ఎఫెక్టులు ఇవే

టాప్ స్టోరీస్

Delhi Liquor Case: ఎమ్మెల్సీ కవితకు ఈడీ జాయింట్ డైరెక్టర్ లేఖ, ఈడీ ఆఫీస్‌కు లీగల్ అడ్వైజర్ సోమా భరత్

Delhi Liquor Case: ఎమ్మెల్సీ కవితకు ఈడీ జాయింట్ డైరెక్టర్ లేఖ, ఈడీ ఆఫీస్‌కు లీగల్ అడ్వైజర్ సోమా భరత్

Visakhapatnam: చనిపోతామంటూ భార్యాభర్తల సెల్ఫీ వీడియో! చూస్తే కన్నీళ్లే - కాలువ వద్ద షాకింగ్ సీన్

Visakhapatnam: చనిపోతామంటూ భార్యాభర్తల సెల్ఫీ వీడియో! చూస్తే కన్నీళ్లే - కాలువ వద్ద షాకింగ్ సీన్

Adipurush Update : వైష్ణో దేవి ఆశీస్సులు తీసుకున్న 'ఆదిపురుష్' దర్శక, నిర్మాతలు - ప్రభాస్ సినిమాకు నయా ప్లాన్

Adipurush Update : వైష్ణో దేవి ఆశీస్సులు తీసుకున్న 'ఆదిపురుష్' దర్శక, నిర్మాతలు - ప్రభాస్ సినిమాకు నయా ప్లాన్

MLA Durgam Chinnaiah: వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే! మహిళ సంచలన ఆరోపణలు, కోడ్‌ భాష‌లో ఛాటింగ్‌!

MLA Durgam Chinnaiah: వివాదంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే! మహిళ సంచలన ఆరోపణలు, కోడ్‌ భాష‌లో ఛాటింగ్‌!