By: ABP Desam | Updated at : 31 Oct 2021 01:42 PM (IST)
(Image credit: Pixabay)
ఆరోగ్యానికి ఉపయోగపడే చాలా ఔషధాలు అధికంగా మొక్కల నుంచే తయారవుతాయి. ఔషధగుణాలున్న మొక్కల్ని ఇంట్లోనే పెంచుకుంటే మీ ఇల్లే చిన్న సైజు ఫార్మసీ అయిపోతుంది. వీటిని పెంచడం కూడా చాలా సులువు. కాస్త ఎండ, నీరు దొరికితే చాలు మొండిగా బతికేసే మొక్కలు ఇవన్నీ. ఈ ఇంటి పంటను మీరు నిత్యం వంటల్లో వాడుకుంటూ ఉంటే చక్కని ఆరోగ్యం సొంతమవుతుంది. ఇంతకీ అవేం మొక్కలో చూద్దామా...
పుదీనా
వీటిని ప్రత్యేకంగా పెంచాల్సిన అవసరం లేదు. ఆకులు తుంచేశాక ఆ కాడల్ని నాటిసినా బతికేస్తాయి. ఎండ తగిలే స్థలంలో కుండీని ఉంచాలి. పుదీనాలో యాంటీ ఆక్సిడెంట్లు, అనేక రకాల విటమిన్లు, మినరల్స్, ఐరణ్, కాల్షియం, ఫాస్పరస్ వంటి ఏన్నో ఉత్తమ గుణాలు ఉన్నాయి. ఈ ఆకుల్ని ఏ కూరలోనో, అన్నంలోనో ఉడికించుకుని తింటే చాలా మంచిది. ముఖ్యంగా రోజూ తింటే రోగనిరోధశక్తి పెరుగుతుంది.
తులసి
తెలుగిళ్లల్లో కచ్చితంగా కనిపించే మొక్క ఇది. కానీ దీన్ని అందరూ దేవతగా పూజించడం వరకే కేటాయిస్తున్నారు. నిజానికి ఎన్నో ఔషధగుణాలున్న మొక్క ఇది. ఈ ఆకులు నీళ్లలో వేసి నానబెట్టుకుని, ఆ నీళ్లను తాగితే చాలా మంచిది. ఆకుల రసాన్ని రెండు రోజుకోసారి తాగితే జలుబు, దగ్గు వంటివి దరిచేరవు. ఈ ఆకులతో టీ చేసుకుని రోజూ తాగినా ఎంతో ఆరోగ్యం.
వాము
చిన్న కుండీలో వేసిన వాము చక్కగా పెరిగేస్తుంది. వంటింటి కిటికీ దగ్గర ఎండతగిలేలా పెట్టినా చాలు... వాము మొక్క చిగురిస్తుంది, మీకు మంచి ఆరోగ్యాన్నీ అందిస్తుంది. వాము ఆకులను నేరుగా నమిలినా లేదా కాస్త ఉప్పు, తేనె లాంటివి కలిపి ముద్దలా చేసి తిన్నా మంచిదే. జలుబు, జ్వరం, దగ్గు ఇట్టే తగ్గిపోతాయి. అలా తినలేం అనుకునే వారు వాము ఆకులతో బజ్జీలు చేసుకుని తినండి, లేదా పప్పులో వాము ఆకులు కలిపి వండుకుని తినండి. ఏదో రకంగా ఆ ఆకులు పొట్టలో చేరడం ముఖ్యం.
లెమన్ గ్రాస్
కుండీల్లో అందంగా పెరిగే మొక్కలివి. చూడటానికి గడ్డిలా కనిపించినా ఇవి ఆరోగ్యానికి చేసే మేలు ఇంతా అంతా కాదు. వీటిలో యాంటీ ఇన్ ప్లమ్మేటరీ గుణాలు అధికం. ఒత్తిడిని, యాంగ్జయిటీని నియంత్రించే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. దీన్ని తెలుగులో నిమ్మగడ్డి అని పిలుచుకుంటారు. వీటిని ఎండబెట్టి పొడిలా చేసుకుని వాడొచ్చు. లేదా పచ్చి ఆకుల్లా కూడా వాడుకోవచ్చు. సాధారణ వంటల్లో కలిపి వండేసుకోవచ్చు. బరువు తగ్గేందుకు, రక్తపోటు తగ్గించేందుకు ఇది ఉపయోగపడుతుంది.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: ఈ అయిదు పనులు చేయకపోతే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే అవకాశం... ముందుజాగ్రత్తపడమంటున్న వైద్యులు
Also read: CPR అంటే ఏమిటి? గుండె పోటు వచ్చిన వ్యక్తికి ప్రాణం పోస్తుందా? CPR ఎలా చేయాలి?
Miss India 2022: మిస్ ఇండియా 2022గా సినీ శెట్టి, నాట్యమే ప్రాణమంటున్న అందాల రాణి
Rose Petals: గులాబీ పూల రెక్కలను గిన్నెలో పోసి ఇంట్లో ఉంచితే ఆరోగ్యమా లేక ఆర్ధిక లాభమా?
Mandara Oil: జుట్టు ఒత్తుగా, నల్లగా పెరగాలా? ఇలా మందార తైలాన్ని తయారుచేసి వాడండి
Carrot Rice: పిల్లల లంచ్ బాక్స్ రెసిపీ క్యారెట్ రైస్, తెలివితేటలు పెంచుతుంది
matki dal uses: మట్కి పప్పు రుచి అమోఘం, పోషకాలు పుష్కలం
MP Raghurama Krishna Raju : ఎంపీ రఘురామకృష్ణరాజు భీమవరం పర్యటన రద్దు, మధ్యలోనే ట్రైన్ దిగిపోయిన ఎంపీ
Revanth Reddy Demands PM Modi: మా గడ్డపై మాకే అవమానమా - ప్రధాని మోదీ, అమిత్ షా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి : రేవంత్ రెడ్డి
Usha George Comments: సీఎంను కాల్చి చంపాలనుంది, రివాల్వర్ కూడా ఉంది - మాజీ ఎమ్మెల్యే భార్య సంచలన ఆరోపణలు
Alluri Encounter: దేశంలో తొలి ఎన్ కౌంటర్ అల్లూరి సీతారామరాజుదే - మన్యం వీరుడంటే బ్రిటీషర్లకు అంత భయమా !
PM Modi Speech: తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది, అభివృద్ధి డబుల్ అవుతుంది-ప్రధాని మోదీ