Toxic Parenting : క్రమశిక్షణ పేరుతో కట్టిపడేస్తున్నారా? అయితే మీరు తల్లిదండ్రులుగా పిల్లలకు ద్రోహం చేస్తున్నట్లే
Parenting Advice : పిల్లల పెంపకం తల్లిదండ్రులకు అతి పెద్ద టాస్క్. అయితే దీనిలో భాగంగా కొన్నిసార్లు సెన్సిటివిటీని దూరమైపోతూ ఉంటారు. అది కరెక్ట్ పేరెంటింగ్ కాదు. మరి మీరు మీ ఎలాంటి పేరెంట్స్?

Parenting Tips : తల్లిదండ్రులు పిల్లల జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. పిల్లలకు తల్లిదండ్రులు, కుటుంబమే మొదటి గురువు. తల్లిదండ్రులే సురక్షితమైన స్థలం. కానీ కొన్నిసార్లు తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎక్కువ శ్రద్ధ చూపిస్తూ.. ఆంక్షలు విధిస్తూ ఉంటారు. ఇది వారికి రక్షణ కల్పించడానికి బదులుగా పిల్లలకు సమస్యలను కలిగిస్తుంది. వాస్తవానికి తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమశిక్షణలో పెంచుతున్నామనుకుంటారు. కానీ ఈ తరహా కఠినమైన పెంపకం ఎప్పుడూ టాక్సిక్ మారుతుందో తెలుసుకోలేరు. కొన్నిసార్లు వాటివల్ల ఎక్కువ పేఆఫ్ చేయాల్సి వస్తుంది. మరి మీ పిల్లల పట్ల మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారా? క్రమశిక్షణ పేరుతో.. కఠినంగా ఉంటున్నారో చెక్ చేసుకోండి.
చెప్పిన మాట వినేయాలి..
తల్లిదండ్రులు కొన్నిసార్లు తమ పిల్లల నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఎలాంటి ప్రశ్నలు వేయకుండా పిల్లలు వారి మాట వినాలని కోరుకుంటారు. ఒకవేళ ఏదైనా అడగాలి అనుకున్నా.. ఆ ప్రశ్న బయటకి రాకముందే దానిని అడగకుండా చేసేస్తారు. భయపెడతారు. ఇలాంటి పరిస్థితిల్లో పిల్లలు మిమ్మల్ని అడగకపోవచ్చు కానీ.. వారి మనస్సులో ఉత్సాహం, ప్రశ్నలు వేయాలనే కోరిక పెరుగుతుంది. దాని కోసం వారు ఏ స్థాయికైనా వెళ్లేందుకు సిద్ధపడతారు. అప్పుడు ఆ మైండ్ సెట్ టాక్సిక్‌గా మారుతుంది.
ప్రతి విషయంలో పరిపూర్ణత కోరుకున్నప్పుడు
తల్లిదండ్రులు తమ పిల్లలు అభివృద్ధి చెందాలని కోరుకుంటారు. అలాగే వారి ఇష్టాఇష్టాలు తెలుసుకోకుండా సక్సెస్‌లో ఓ బార్ సెట్ చేసేస్తారు. పిల్లలకు ఏది కావాలి? ఏది వద్దు అనేది కనీసం వారితో చర్చించకుండా.. తమకి నచ్చినట్టు పిల్లలు చదవాలని.. సక్సెస్ అవ్వాలని కోరుకుంటారు. పిల్లలు తల్లిదండ్రుల మాట దాటలేక.. వారి ఇష్టాలు వదులుకోలేక సమతమవుతూ ఉంటారు. అప్పుడు పరిస్థితి దిగజారుతుంది. పిల్లలపై ఒత్తిడి పడుతుంది.
ఎక్కువగా కంట్రోల్ చేస్తే..
కొందరు తల్లిదండ్రులు పిల్లలను చిన్న విషయాలపై కూడా ఆంక్షలు విధిస్తారు. ఇక్కడకు వెళ్లకూడదు.. అక్కడికి వెళ్లకూడదు. అది చేయకు. ఇది చేయకు వంటివి చెప్తూ ఎక్కువగా కంట్రోల్ చేసేస్తారు. వారి కెరీర్ నుంచి జీవిత భాగస్వామి వరకు ప్రతిదీ తల్లిదండ్రులే నిర్ణయిస్తారు. అటువంటి పరిస్థితిలో పిల్లలు ఎప్పటికీ స్వతంత్రంగా ఉండలేరు. జీవితంలో ప్రశాంతత ఉండదు. తనకి నచ్చని జీవితంలో తాను బతికేందుకు కూడా భయపడతారు.
ఎమోషనల్ కంట్రోల్
కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను నొప్పి, విచారం, బలహీనత వంటి భావోద్వేగాలను చెప్తున్నప్పుడు.. వాటిని బలవంతంగా అణచివేస్తారు. దీనివల్ల వారు పూర్తిగా చెప్పడం మానేస్తారు. కొన్ని సందర్భాల్లో ఇది పిల్లల్లో పైశాచికత్వాన్ని కూడా పెంచే అవకాశం ఉంది. ఎమోషన్స్ అన్ని లోపలే ఉండడం వల్ల అన్ని ఒకటేసారి బయటకు రావడమో.. లేదా ఒకేసారి టాక్సిక్‌గా మారడమో జరుగుతాయి.
ప్రేమ ఇచ్చేది అప్పుడే
చాలా ఇళ్లలో పిల్లల్లు ఏదైనా సాధించినప్పుడే తల్లిదండ్రులు ప్రేమను చూపిస్తారు. లేదా తమ వింటున్నప్పుడే పిల్లలను ఇష్టంగా చూసుకుంటారు. ఈ రెండిటిలో ఏదైనా తేడా వస్తే మొత్తానికి దూరం పెట్టేస్తారు. మంచి మార్కులు లేదా పతకాలు-ట్రోఫీలు సాధించినప్పుడే ప్రేమను చూపించడం వల్ల పిల్లలకు తల్లిదండ్రుల మధ్య సంబంధం డిస్టర్బ్ అవుతుంది.
మీరు కూడా మీ పిల్లలతో ఇలాగే ఉంటున్నారేమో చూసుకోండి. పిల్లలకు భద్రత ఇవ్వడం ముఖ్యమే కానీ.. వారికి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం కూడా చేయాలి. అలాగే పిల్లలు మీ దగ్గర ఏదైనా చెప్పుకునే స్వతంత్య్రం ఇవ్వాలి. వారు మీకు భయపడేలా కాదు.. మీరంటే ప్రేమతో ఉండేలా పెంచడమే నిజమైన పేరెంటింగ్.






















