By: ABP Desam | Updated at : 06 Apr 2023 09:16 AM (IST)
Edited By: Soundarya
Image Credit: Pixabay
కలలు అందరికీ వస్తాయి. కొన్ని అందంగా ఉంటే మరికొన్ని పీడకలలు అవుతాయి. రోజూ మీకు పీడకలలు వస్తున్నాయా? ప్రతిరోజూ అలాంటి కలలే వస్తుంటే అదొక రుగ్మత అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనికి చికిత్స చేయకుండా వదిలేస్తే అది జీవితాలపై వినాశకరమైన ప్రభావాన్ని చూపుతుంది.
అసలు నైట్ మేర్ డిజార్డర్ అంటే ఏంటి?
ఒక వ్యక్తి తన జీవితంలో బలహీనమైన లేదా భయంకరమైన కలలను పదే పదే వస్తుంటే మీరు నైట్ మేర్ డిజార్డర్ బారిన పడినట్టే. ఇదొక రకమైన పారాసొమ్నియా. వ్యాధి తీవ్రత ఆధారంగా ఈ రుగ్మత ఆధారపడి ఉంటుంది. వారానికి ఒకటి కంటే తక్కువ సార్లు పీడకలలు వస్తాయి. వారానికి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సార్లు పీడకలలు వస్తే రుగ్మత మితం ఉందని అర్థం. మరికొంతమందికి ప్రతి రాత్రి పీడకలలు వస్తాయి. దీర్ఘకాలిక పీడకల రుగ్మత అనేది ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువ కాలం ఉంటుంది. నిద్ర మేల్కొన్న తర్వాత ఆ కలలు భయాందోళన కలిగిస్తాయి. ఈ పరిస్థితి నిద్రను దెబ్బతీస్తుంది. డిప్రెషన్, యాంగ్జయిటీ వంటి మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఈ రుగ్మత ఎవరిని ప్రభావితం చేస్తుంది?
ఈ వ్యాధి పిల్లలు, పెద్దలతో సహా ఎవరినైనా ప్రభావితం చేస్తుంది.
⦿నాక్రోలెప్సీ
⦿స్లీప్ అప్నియా
⦿పీరియాడిక్ లింబ్ మూమెంట్ డిజార్డర్ (PLMD)
⦿పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (PTSD)
⦿యాంగ్జయిటీ
⦿డిప్రెషన్
ఈ వ్యాధి లక్షణాలు
⦿చెమటలు పట్టడం
⦿శ్వాస ఆడకపోవడం
⦿గుండె వేగంగా కొట్టుకోవడం
⦿ఆందోళన
⦿మూడ్ స్వింగ్స్
⦿అలసట
⦿నిద్రలేమి
⦿ఏకాగ్రత దెబ్బతినడం
⦿ప్రవర్తనలో మార్పులు
నైట్ మేర్ డిజార్డర్ కి కారణమేంటి?
పీడకలలు రావడానికి సరైన కారణాలు ఏమిటనేది పరిశోధకులకు కూడా తెలియలేదు. హైపర్‌రౌసల్ కారణంగా ఇది సంభవిస్తుందనే భావన ఉంది. ఇది మానసిక స్థితిని మార్చే లక్షణం. దీని వల్ల ఎప్పుడూ చిరాకు, కోపంగా అనిపిస్తుంది. హైపర్‌రౌసల్ నిద్రపోతున్నప్పుడు మెదడులోని కొన్ని ప్రాంతాలను అతిగా చురుగ్గా ఉండేలా చేస్తుంది. దీని వల్ల పీడకలలు వస్తాయి. ఒత్తిడికి గురవుతున్న వాళ్ళు ఎక్కువగా పీడకలలకు ఎక్కువగా గురవుతారు. కొన్ని సార్లు ఇంట్లో, ఆఫీసు పని ఒత్తిళ్లు వల్ల కూడా పీడకలలు వస్తాయి. గాయాలు, శారీరక, లైంగిక వేధింపుల వల్ల కూడా ఈ కలలు రావడం సర్వసాధారణంగా జరుగుతుంది.
నిద్రలేమి మరొక కారణం. యాంటీ డిప్రెసెంట్ మందులు, రక్తపోటు మందులు ధూమపానం, మద్యపానం అలవాట్లు కూడా పీడకలలను ప్రేరేపిస్తాయి.
చికిత్స ఉంటుందా?
ఈ వ్యాధిని గుర్తించేందుకు ప్రత్యేకమైన రోగనిర్ధారణ పరీక్షలు ఏమి ఉండవు. వచ్చిన కలల ఆధారంగా వైద్యులు గుర్తిస్తారు. టాక్ థెరపీ ద్వారా చికిత్స చేస్తారు. బిహేవియర్ థెరపీ (CBT) ఆధారిత చికిత్సలు, ఇమేజరీ రిహార్సల్ థెరపీ (IRT), ఎక్స్పోజర్, రిలాక్సేషన్, రిస్క్రిప్టింగ్ థెరపీ (ERRT) చేస్తారు. పెద్దవారిలో ERRT చికిత్స పీడకల రుగ్మతకు అత్యంత ప్రభావవంతమైన చికిత్సగా అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్ సిఫార్సు చేసింది.
CBT-ఆధారిత చికిత్సలు పీడకలలు రాకుండా తీవ్రతను తగ్గిస్తాయి. ఈ వ్యాధికి చికిత్స చేయకుండా వదిలేస్తే అది చాలా తీవ్రంగా మారుతుంది. ఆత్మహత్యకు ప్రయత్నించే ప్రమాదం ఉంది. అందుకే తరచూ పీడకలలు వస్తుంటే నిర్లక్ష్యం చేయకుండా వైద్యులని సంప్రదించడం చాలా అవసరం.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: పేదవాడి ప్రోటీన్ పౌడర్ సత్తు పొడి, ఎంత తిన్నా బరువు పెరగరు
ఈ అలవాట్లు మీకున్నాయా? జాగ్రత్త, డయాబెటిస్ రావొచ్చు!
Children Health: పిల్లలకి ఫీవర్‌గా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఈ తప్పులు అసలు చేయొద్దు
Heatstroke: సమ్మర్ స్ట్రోక్ నుంచి బయటపడాలంటే ఈ ఫుడ్స్ తప్పకుండా మెనూలో చేర్చుకోవాల్సిందే
Skipping Meals: భోజనం మానేస్తున్నారా? దానివల్ల శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
Pregnant Travel Tips: గర్భిణీలు ప్రయాణాలు చేయొచ్చా? ఒకవేళ చేయాల్సి వస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి
Balakrishna at Mahanadu: ఎన్టీఆర్ తెచ్చిన సంక్షేమ పథకాలు చిరస్మరణీయం, చంద్రబాబు విజన్ ఎందరికో ఆదర్శం
IPL 2023: వర్షం కారణంగా ఐపీఎల్ ఫైనల్ వాయిదా - రేపు కూడా జరగకపోతే!
చనిపోవడానికి ముందు తాత చెప్పిన ఆ మాటలు ఇప్పటికీ గుర్తున్నాయ్: జూనియర్ ఎన్టీఆర్
Ambati Rayudu Political Entry: క్రికెట్ కు అంబటి రాయుడు గుడ్ బై - నెక్ట్స్ పొలిటికల్ ఇన్నింగ్స్ ఆడతారా!