By: Haritha | Updated at : 13 Dec 2022 08:16 AM (IST)
పసుపు రంగులో మెరిసిపోతున్న గోల్డెన్ రైస్ (Image credit: Wikipedia)
మనదేశంలో ప్రధాన ఆహారం బియ్యమే. దీనిలో 75 శాతం కార్బోహైడ్రేట్లు ఉంటాయి. బియ్యంలో ఇప్పటికే చాలా రకాలు ఉన్నాయి. ఎర్ర బియ్యం, నల్ల బియ్యం, బ్రౌన్ బియ్యం... ఇలా. బియ్యాన్ని ఎంత తక్కువగా పాలిష్ చేస్తే అంత ఆరోగ్యం. అధికంగా పాలిష్ చేసిన బియ్యంతో మధుమేహం వచ్చే అవకాశం అధికం. బ్రౌన్ రైస్ ముతకగా ఉన్నా కూడా మధుమేహం వచ్చే అవకాశం తగ్గుతుంది. అందుకే బాగా తెల్లగా ఉన్న బియ్యాన్ని కాకుండా, ముతకగా ఉన్న బియ్యాన్ని తినడమే మంచిది. ఇక చైనాలో నల్లబియ్యాన్ని విపరీతంగా వాడతారు. మనదేశంలో నల్ల బియ్యాన్ని తినడానికి పెద్దగా ఎవరూ ఇష్టపడడం లేదు. వీటితో పాటూ గోల్డెన్ రైస్ కూడా ఈ భూమిపై పండుతోంది. ఇది కృత్రిమంగా సృష్టించి పండించినది.
గోల్డెన్ రైస్ అంటే ఏమిటి?
పేరుకు తగ్గట్టే ఇవి బంగారం రంగులో మెరిసిపోతుంటాయి. అన్నం వండితే పసుపు రంగులో ఉంటుంది. దీనికి ఈ రంగు రావడానికి కారణం బీటా కెరాటిన్. బీటా కెరాటిన్ ఉన్నందుకే క్యారెట్లు అలా ఆరెంజ్ రంగులో ఉంటాయి. ఈ బియ్యం జన్యు ఇంజనీరింగ్ ద్వారా అభివృద్ధి చేశారు. ఇదొక బయోఫోర్టిఫైడ్ పంట. బయోఫోర్టిఫికేషన్ పంటల పోషక విలువలను పెంచుతుంది. సాధారణంగా బియ్యంలో బీటా కెరాటిన్ ఉండదు. కేవలం కార్బోహైడ్రేట్లు మాత్రమే అందుతాయి. కానీ గోల్డెన్ రైస్‌లో బీటా కెరాటిన్ పుష్కలంగా లభిస్తుంది. బీటా కెరాటిన్ శరీరంలో చేరాక విటమిన్ Aగా మారుతుంది. విటమిన్ ఎ మన శరీరానికి ఎంత అవసరమో తెలిసిందే.
ఎవరు పండించారు?
ఇది ఇద్దరు శాస్త్రవేత్తల అద్భుత సృష్టి. వీరిద్దరూ జర్మనీకి చెందిన మొక్కత శాస్త్రవేత్తలు. వీరు 1990లలో ఈ గోల్డెన్ రైస్‌కు ప్రాణం పోశారు. విటమిన్ ఎ లోపాన్ని అరికట్టేందుకు, దీని ద్వారా వచ్చే అంధత్వాన్ని అడ్డుకునేందుకు వీరు ఈ బియ్యాన్ని సృష్టించారు. ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్ల మంది ప్రజలు విటమిన్ ఏ లోపం వల్ల ఇబ్బంది పడుతున్నట్టు అప్పట్లో అంచనా వేశారు. దీంతో ఆ ఇద్దరు శాస్త్రవేత్తలు ఈ బియ్యాన్ని కనిపెట్టారు. కానీ ఈ బియ్యాన్ని ఆమోదించేందుకు ఎంతో సమయాన్ని తీసుకున్నాయి ప్రపంచ దేశాలు.
ఏఏ దేశాల్లో...
ఈ బియ్యాన్ని పండించేందుకు ఫిలిప్పీన్స్‌లో ఉన్న ‘ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్సిట్యూట్’ 2001లో మొదటిసారి లైసెన్సు ఇచ్చింది. దీంతో ఫిలిప్పీన్స్ లో దీని వాడకం మొదలైంది. గోల్డెన్ రైస్ వాణిజ్య ఉత్పత్తిని ఆమోదించిన మొదటి దేశంగా ఫిలిప్పీన్స్ మారింది. తరువాత మెల్లగా ఇతర దేశాలు కూడా ఈ బియ్యం వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకున్నాయి. 2018లో కెనడా, అమెరికా కూడా ఈ బియ్యాన్ని దేశంలోకి ఆమోదించాయి. బంగ్లాదేశ్ రైతులు ఈ బియ్యాన్ని పండించేందుకు సిద్ధపడ్డారు.
Also read: వారానికోసారి నువ్వులన్నం ఇలా చేసుకుని తినండి చాలు - ఎంతో బలం
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Brain Health: మెదడుకు హాని చేసే ఆహారాలు ఇవే - వీటికి దూరంగా ఉండండి
Vitamin D: రోజూ 10 నిమిషాలు ఇలా చెయ్యండి - ‘విటమిన్ డి’ లోపమే ఉండదు
Weight Loss: బరువు తగ్గే ప్లాన్ వేసుకుంటున్నారా? జాగ్రత్త, ఈ అపోహలు నమ్మొద్దు
ఏవండోయ్ ఇది విన్నారా? 'జస్ట్ ఫ్రెండ్స్' అన్నందుకు మహిళపై రూ.24 కోట్లు పరువు నష్టం కేసు వేశాడు!
Curd Vs Buttermilk: పెరుగు కంటే మజ్జిగ తీసుకోవడం మంచిదా? ఆయుర్వేద శాస్త్రం ఏం చెబుతోంది?
Kishan Reddy On Governer Speech : అన్నీ అబద్దాలే - తమిళిసై ప్రసంగంపై కిషన్ రెడ్డి విమర్శలు !
Lokesh Padayatra Tension : లోకేశ్ పాదయాత్రలో మరోసారి ఉద్రిక్తత, బహిరంగ సభకు అనుమతి లేదని ప్రచార వాహనం సీజ్
Thalapathy67: కత్తులు, చాక్లెట్లు, విజయ్, విలన్స్ - ప్రోమోతోనే సిక్సర్ కొట్టిన లోకేష్ కనగరాజ్ - టైటిల్ ఏంటో తెలుసా?
Delhi YSRCP Mps : ప్రత్యేకహోదా కోసం ప్రైవేటు బిల్లు - ఢిల్లీలో వైఎస్ఆర్సీపీ ఎంపీల కీలక ప్రకటన !