డయాబెటిక్ రెటినోపతిని ఎలా గుర్తించాలి? కంటి చూపు శాశ్వతంగా పోతుందా?
మధుమేహం వల్ల కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.
ప్రపంచంలో చాలా మంది ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య మధుమేహం. ఇది వచ్చిందంటే దాని ప్రభావం అన్నీ అవయవాల మీద పడుతుంది. మధుమేహం కారణంగా సంభవించే వ్యాధి డయాబెటిక్ రెటినోపతి. ఇది కళ్ళని ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. దీని వల్ల కంటి రక్త నాళాలు దెబ్బతింటాయి. దీనికి సంబంధించిన లక్షణాలు చాలా తక్కువగా కనిపిస్తాయి. కానీ కాలక్రమేణా పరిస్థితి తీవ్రంగా మారి అంధత్వానికి కారణం కావచ్చు. ఈ సమస్య రెండు కళ్ళని ప్రభావితం చేస్తుంది. టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ ఉన్న వ్యక్తులు ఈ పరిస్థితి ఎదుర్కోవచ్చు. ఎక్కువ కాలం పాటు రక్తంలో చక్కెర స్థాయిలని నియంత్రించకుండా ఉన్న వాళ్ళల్లో డయాబెటిక్ రెటినోపతి అభివృద్ధి చెందే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
డయాబెటిక్ రెటినోపతి లక్షణాలు
పరిస్థితి ప్రారంభంలో ఎటువంటి లక్షణాలు కనిపించవు. కానీ మధుమేహం పెరిగే కొద్ది కంటికి తీవ్రమైన హాని కలుగుతుంది. డయాబెటిక్ రెటినోపతి నివారించడానికి కళ్ళకి సంబంధించి మీరు ఎటువంటి సమస్య ఎదుర్కొంటున్నా ఆలస్యం చేయకుండా వైద్యులని సంప్రదించడం ముఖ్యం.
☀ రాత్రిపూట కంటి చూపులో ఇబ్బంది
☀ మసకగా కనిపించడం
☀ దృష్టి కోల్పోవడం
☀ రంగులని గుర్తించడంలో ఇబ్బంది
డయాబెటిక్ రెటినోపతి దశలు
ఈ స్థితి నాలుగు వేర్వేరు దశాలుగా, రెండు వేర్వేరు రకాలుగా విభజించవచ్చు. రెండు రకాలు విస్తరణ, నాన్‌ప్రొలిఫెరేటివ్. ప్రారంభ దశని నాన్‌ప్రొలిఫెరేటివ్ గా పరిగణిస్తారు. ప్రొలిఫెరేటివ్ అనేది వ్యాధి అధునాతన దశలను సూచిస్తుంది.
తొలి దశ: రేటినాలోని రక్త నాళాలలో చిన్న వాపు కనిపిస్తుంది. ఈ వాపుని మైక్రోఅన్యూరిజమ్స్ అంటారు. ఈ దశలో ద్రవాలు రెటీనాలోకి లీక్ కావచ్చు. ఇది వాపును ప్రేరేపిస్తుంది.
రెండో దశ: నాన్‌ప్రొలిఫెరేటివ్ డయాబెటిక్ రెటినోపతి రక్తనాళాల వాపు రెటీనాకు రక్త ప్రవాహానికి ఆటంకం కలిగిస్తుంది. ఇది రక్తం, ఇతర ద్రవాలు మాక్యులాలో పేరుకుపోయేలా చేస్తుంది.
మూడో దశ: నాన్‌ప్రొలిఫెరేటివ్ డయాబెటిక్ రెటినోపతి మూడో దశలో రక్త నాళాలలో పెద్ద భాగం నిరోధించబడుతుంది. ఇది రెటీనాలో రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది.
నాలుగో దశ: దీన్ని ప్రొలిఫెరెటివ్ డయాబెటిక్ రెటినోపతి అధునాతన దశ. రేటినాలో కొత్త రక్తనాళాలు ఏర్పడటం మొదలవుతుంది. అస్పష్టమైన దృష్టి లోపం కలిగేలా చేస్తుంది. తీవ్రమైన సందర్భాల్లో శాశ్వత అంధత్వం వచ్చే అవకాశాలు ఉన్నాయి.
డయాబెటిక్ రెటినోపతికి చికిత్స
ఈ వ్యాధి వల్ల ఏర్పడిన దృష్టి లోపం తగ్గించడం కష్టం. కానీ కొంతవరకు చికిత్స చేయవచ్చు. అందుకు తప్పనిసరిగా రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంచుకోవాలి. వైద్యులని సంప్రదించి తగిన విధంగా మందులు ఉపయోగించడం చెయ్యాలి. వాటితో పాటు ఆహారంలో మార్పులు, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటివి చేస్తూ ఉండాలి. చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తే వ్యాధి వృద్ధి మందగిస్తుంది. ఈ వ్యాధికి సంబంధించి చికిత్స ఎంపికలు దాని దశల మీద ఆధారపడి ఉంటాయి. ప్రారంభ దశలో గుర్తిస్తే రేటినాకు ఎటువంటి నష్టం జరగకుండా వ్యాధి వృద్ధి చెందకుండా చికిత్స చేసే అవకాశం ఉంటుంది.
వ్యాధి వ్యాప్తి కంటే ముందే చేసే చికిత్సలు ఇవే:
లేజర్ శస్త్రచికిత్స: లేజర్ శస్త్రచికిత్స అసాధారణ రక్త నాళాలు, రెటీనాలో వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.
కంటి మందులు: స్టెరాయిడ్ ఇంజెక్షన్లు వాపు, కొత్త రక్త నాళాలు ఏర్పడకుండా నిరోధిస్తుంది. వైద్యుడు VEGF వ్యతిరేక మందులను కూడా ఇవ్వవచ్చు. ఇది మాక్యులాలో వాపును తగ్గించడానికి పని చేస్తుంది. ఒక్కోసారి మందులు, ఇంజెక్షన్ రెండింటినీ కూడా సిఫార్సు చేసే అవకాశం ఉంది.
విట్రెక్టమీ: ఇది ప్రొలిఫెరేటివ్ డయాబెటిక్ రెటినోపతి ఉన్న బాధితుల కోసం. శస్త్రచికిత్స అవసరమయ్యే పరిస్థితి ఉన్న రోగులకి విట్రెక్టమీని సూచిస్తారు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: మహిళలూ.. రొమ్ము క్యాన్సర్లు చాలా రకాలున్నాయ్, చికిత్స మార్గాలివే!