Blue Wine: బ్లూ వైన్ ఎప్పుడైనా తాగారా? దీనికి అసలు ఆ రంగు ఎలా వచ్చిందో తెలుసా?
రెడ్, వైట్ కలర్ లో ఉండే వైన్ చూస్తూనే ఉంటారు. కానీ ఈ నీలం రంగు వైన్ తన కలర్ తోనే అందరినీ ఆకట్టుకుంటుంది.
వైన్ అంటే ఎరుపు, తెలుపు, గులాబీ రంగులో ఉంటుందని ఎక్కువగా తెలుసు. కానీ ఇటీవల వచ్చిన కొత్త రకం వైన్ కలర్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. అదే బ్లూ వైన్. చూడటానికి చాలా అందంగా కనిపిస్తున్న ఈ వైన్ తాగేందుకు తెగ ఉత్సాహం చూపిస్తున్నారు. మార్కెట్లో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న ఈ వైన్ గురించి తెలుసుకోవాలని ఉందా? అయితే ఇది చదివేయండి.
ఎలా వచ్చిందంటే..
బ్లూ వైన్ 2016 నాటిది. స్పానిష్ బృందం వైన్ రంగు మీద ప్రయోగాలు చేయాలని కొన్ని నిబంధనలు ఉల్లంఘించి దీన్ని సృష్టించారు. యువతరాన్ని ఆకర్షించేందుకు ఈ సంప్రాదాయేతర పానియాన్ని రూపొందించడానికి ప్రయత్నించారు.
నీలం రంగు ఎలా వచ్చింది?
బ్లూ కలర్ ద్రాక్షతో తయారు చేయడం వల్ల దీనికి ఈ రంగు వచ్చిందని అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఈ వైన్ రంగు కోసం ఉపయోగించే ద్రాక్ష దగ్గర నుంచి ప్రతీ ఒక్క విషయం ఆశ్చర్యం కలిగించేదే. దీని కోసం తెల్ల ద్రాక్షని ఉపయోగిస్తారు. ఈ ద్రాక్షని ప్రత్యేకమైన మెసేరేషన్ టెక్నిక్ ద్వారా రంగు తెప్పిస్తారు. ఈ టెక్నిక్ ద్రాక్ష రసాన్ని ఆంథోసైనిన్ అనే ఎర్ర ద్రాక్షతో కలిపారు. దీని వల్ల ఈ వైన్ కి నీలం రంగు వచ్చింది. వైన్ బ్లూ కలర్ రావడంలో ఆంథోసైనిన్ కీలక పాత్ర పోషించింది. మెసేరేషన్ ప్రక్రియలో అన్ని ద్రవాలని ఒకే విధమైన కొలతతో తీసుకున్నారు. అయితే ఈ వైన్ కోసం ఎటువంటి కృత్రిమ రంగులు ఉపయోగించనలేదు. దీనికి వచ్చిన నీలం రంగు పూర్తిగా సహజ వనరుల నుంచి వచ్చిందే.
ఆంథోసైనిన్ ప్రభావం
ఆంథోసైనిన్ వైన్ రుచిపై తక్కువ ప్రభావాన్ని చూపుతుంది. ఇది ప్రధానంగా తెల్ల ద్రాక్ష అసలు రుచి, ప్రొఫైల్ ని కలిగి ఉంటుంది. అందుకే ఈ వైన్ రీఫ్రెష్ గా అనిపిస్తుంది.
విపరీతమైన పాపులారిటీ
బ్లూ వైన్ ప్రత్యేకించి మిలినీయల్స్, కొత్తదనం కోరుకునే వైన్ ప్రియుల కోసం చేసింది. పెద్ద పెద్ద పార్టీలో ఇది స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది. డిఫరెంట్ స్టైల్ కోరుకునే వాళ్ళు దీన్ని తాగేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. బ్లూ వైన్ ని తరచుగా వైట్ వైన్ లేదా ఫ్రూటీ కాక్టెయిల్ తో పోలుస్తారు.
వివాదాలు
నిబంధనలు ఉల్లంఘించి చేసిన వైన్, విపరీతమైన పాపులారిటీ తెచ్చుకుంది. అందుకే దీని పైన విపరీతమైన వివాదాలు కూడా ఉన్నాయి. సంప్రదాయ వైన్ తో దీనికి ఎటువంటి సంబంధం లేదని కొందరు వాదిస్తారు. ఇది కేవలం మార్కెటింగ్ జిమ్మిక్ గా పరిగణిస్తారు. మరికొందరైతే తెల్ల ద్రాక్షకి ఆంథోసైనిన్ ను జోడించడం అసలు జరిగే పని కాదని అంటారు. దీని మీద ఎన్ని వాదనలు, వివాదాలు ఉన్నప్పటికీ మాత్రం ఇది ఔత్సాహికుల్ని తెగ ఆకర్షిస్తుంది. ఎందుకంటే ఇది కంటికి ఇంపుగా అనిపించే నీలం రంగుని కలిగి ఉండటమే. మార్కెట్ లో దీనికి డిమాండ్ కూడా బాగుంటుందట.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: నయా ట్రెండ్ - 'డిజిటల్ డిటాక్స్'తో ఆరోగ్యం, ఆనందం - ఇంతకీ దీన్ని ఎలా పాటించాలి?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial