Digital Detox: నయా ట్రెండ్ - 'డిజిటల్ డిటాక్స్'తో ఆరోగ్యం, ఆనందం - ఇంతకీ దీన్ని ఎలా పాటించాలి?
నిద్రలేవగానే అమ్మనాన్న మొహం చూస్తారో లేదో తెలియదు కానీ చాలా మంది ఫోన్ ఓపెన్ చేసి సోషల్ మీడియా మొహం మాత్రం చూస్తారు.
ఫోన్ లేకుండా ఒక్క రోజు కాదు కదా కనీసం ఐదు నిమిషాలు కూడా ఉండలేరు. ఫేస్ బుక్, ఇన్ స్టా, యూట్యూబ్ అంటూ నిత్యం ఏవో ఒక వీడియోలు చూస్తూ టైమ్ పాస్ చేసేస్తూ ఉంటారు. ఫోన్ కి దూరంగా ఉండటం అంటే చాలా మంది నోటి నుంచి వచ్చే మాట అసాధ్యమని. దాదాపు 61 శాతం మంది ప్రజలు ఇంటర్నెట్ కి బానిసలుగా మారిపోయారని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. ఇంటర్నెట్, ఫోన్ అతి వినియోగం ఆరోగ్యాన్ని, జీవన నాణ్యతని దెబ్బతీస్తుంది. అటువంటి సమయంలో ప్రతీ ఒక్కరూ డిజిటల్ డిటాక్స్ చాలా ముఖ్యం.
డిజిటల్ డిటాక్స్ అంటే ఏంటి?
డిజిటల్ డిటాక్స్ అంటే ఒక వ్యక్తి టెలివిజన్, కంప్యూటర్లు, ట్యాబ్, స్మార్ట్ ఫోన్ వంటి సాంకేతిక పరికరాలు ఉపయోగించకుండా ఉండే సమయం. ఈ టైమ్ లో అసలు సోషల్ మీడియా జోలికి వెళ్లకూడదు. సింపుల్ గా చెప్పాలంటే ఫోన్ నుంచి తీసుకునే విరామం. దీని వల్ల పనుల మీద శ్రద్ద, ఏకాగ్రత పెరుగుతుంది. ఒత్తిడి, ఆందోళనని వదిలించుకోవచ్చు. డిజిటల్ డిటాక్స్ వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. మానసిక క్షేమం నుంచి మెరుగైన సంబంధాలు వరకు డిజిటల్ డిటాక్స్ ప్రతి ఒక్కరికీ ప్రయోజనకరంగా ఉంటుంది.
ప్రశాంతంగా ఉండవచ్చు
స్మార్ట్ ఫోన్, డిజిటల్ పరికరాయలు, సోషల్ మీడియా నుంచి విరామం తీసుకోవడం వల్ల ఒత్తిడి స్థాయిల్ని తగ్గించడంలో సహాయపడుతుంది. పరిసరాలపై దృష్టి పెట్టడానికి, పక్కన ఉన్న వ్యక్తులతో సమయం గడిపేందుకు దోహదపడుతుంది.
ఆరోగ్యంగా ఉంటారు
డిజిటల్ పరికరాలు ఉపయోగించడం వల్ల కంటి ఒత్తిడి, పొడి కళ్ళు, తలనొప్పికి కారణమవుతుంది. రోజంతా కంప్యూటర్ చూడటం వల్ల మెడ, నడుము నొప్పులు వస్తాయి. ఇవి ఎక్కువగా మారి శరీరంలోని అనేక ఇతర భాగాలకు వ్యాపించవచ్చు. అందుకే డిజిటల్ డిటాక్స్ ఫాలో అయితే శరీరంలోని వివిధ భాగాలని ఉపశమనం కలిగిస్తుంది.
కావల్సినంత టైమ్
ఫోన్ చూస్తూ ఉంటే అసలు టైమ్ అనేది తెలియదు. దీని వల్ల విలువైన టైమ్ వృధా అవుతుంది. డిజిటల్ డిటాక్స్ కి వెళ్ళినప్పుడు మీకు చాలా సమయం ఉంటుంది. ఇతర ముఖ్యమైన విషయాలపై దృష్టి పెట్టె అవకాశం లభిస్తుంది. కుటుంబంతో సమయం గడిపేందుకు ఇది చక్కగా ఉపయోగపడుతుంది.
హాయిగా నిద్రపోవచ్చు
ఫోన్ నుంచి వచ్చే కాంతి శరీరంలోని మెలటోనిన్ విడుదలని ప్రభావితం చేస్తుంది. ఇది నిద్రపాయి ప్రభావం చూపుతుంది. ఎందుకంటే మెలటోనిన్ నిద్ర పోవడానికి సహాయపడుతుంది. డిజిటల్ డిటాక్స్ వల్ల నిద్రకి ఎటువంటి అంతరాయం ఏర్పడుతుని. హాయిగా ప్రశాంతంగా ఎటువంటి ఒత్తిడి లేకుండా నిద్రపోవచ్చు.
చాలా సార్లు సోషల్ మీడియాలో వచ్చే వీడియోలు చూసినప్పుడు ఒక్కోసారి ఆత్మన్యూనత భావనకి గురవుతారు. ఎదుటి వారితో మిమ్మల్ని మీరు పోల్చుకుని బాధపడిపోతుంటారు. డిజిటల్ డిటాక్స్ కి వెళ్ళినప్పుడు మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మిమ్మల్ని మీరు సరిదిద్దుకునేందుకు అవకాశం ఉంటుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: పిల్లలతో జంక్ ఫుడ్ తినడం మాన్పించాలా? ఇలా చేసి చూడండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial