(Source: ECI/ABP News/ABP Majha)
Diet Soft Drinks: ‘డైట్’ డ్రింక్స్ తాగిన గంటలో జరిగేది ఇదే, ఈ ముప్పును మీరు అస్సలు ఊహించలేరు!
‘డైట్’ సోడా డ్రింక్స్‌ను అతిగా తాగుతున్నారా? అయితే, గంట తర్వాత అవే మిమ్మల్ని తాగేస్తాయి. ఇదిగో ఇలా..
డయాబెటిస్ ఉందనో, బరువు పెరుగుతామనే భయంతో చాలామంది జీరో సుగర్ ఉండే డైట్ డ్రింక్స్ వైపు మొగ్గు చూపుతుంటారు. వివిధ పేర్లతో లభించే డైట్ డ్రింక్స్‌ను తాగడం అలవాటు చేసుకుంటారు. అయితే, వాటిలో చక్కెర లేకపోయినా.. అవి చేయాల్సిన నష్టాన్ని చేస్తూనే ఉంటాయి. రోజులు.. నెలలు కాదు, కేవలం గంటలోనే మీ శరీరాన్ని అతలాకుతలం చేస్తాయి. కానీ, అది మీకు బయటకు కనిపించదు. వాటిని తాగినప్పుడల్లా జరిగే నష్టం.. భవిష్యత్తులో ఆకస్మికంగా అనారోగ్యానికి గురిచేస్తుంది.
డైట్ డ్రింక్స్‌లో తక్కువ క్యాలరీలు ఉంటాయనే కారణంతో చాలామంది వాటిని తాగేందుకే మొగ్గు చూపిస్తుంటారు. అయితే, వాటిని అలవాటుగా చేసుకుంటే మాత్రం భవిష్యత్తుకు ముప్పే. ఎందుకంటే.. ఇలాంటి డైట్ డ్రింక్స్‌లో చక్కెర ఉండకపోవచ్చు. కానీ కృత్రిమ తీపి పదార్థాలు ఉంటాయి. ఇలాంటి పానీయాలు తాగడం వల్ల మీ బరువు పెరిగే ప్రమాదం ఉందని గత అధ్యయనాలు తెలిపాయి.
‘కరెంట్ అథెరోస్క్లెరోసిస్ రిపోర్ట్స్’ అనే జర్నల్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం.. డైట్ డ్రింక్స్ వల్ల ‘టైప్ 2 డయాబెటిస్’ ముప్పు ఉందని హెచ్చరించింది. తక్కువ క్యాలరీలు గల ఈ డ్రింక్స్‌లో సుక్రోజ్, గ్లూకోజ్, ఫ్రక్టోజ్ స్థానంలో తక్కువ కేలరీల స్వీటెనర్‌లు ఉపయోగిస్తారు. అవి కేలరీలు లేకుండా ఆ డ్రింక్‌కు తియ్యగా ఉండేలా చేస్తాయి. కృత్రిమ తీపి పానియాలు(Artificially Sweetened Beverages - ASB) అతిగా తాగితే ఆకస్మిక మరణాలు, హృదయ సంబంధ వ్యాధులు తప్పవని అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. వృద్ధులలో పక్షవాతం, చిత్తవైకల్యం వంటి సమస్యలు ఏర్పడవచ్చు.
చైనాలోని జెంగ్‌జౌ యూనివర్శిటీ నిపుణుల అధ్యయనం ప్రకారం.. చక్కెర లేదా కృత్రిమ తీపి పానీయాలు అతిగా తీసుకొనే వ్యక్తుల్లో చనిపోయే ప్రమాదం ఐదు శాతం పెరిగింది. ‘డైట్’ పానీయాలు ఎందుకంత ప్రమాదమో తెలుసుకోవాలంటే.. అది నోటిలోకి వెళ్లిన క్షణం నుంచి చేసే నష్టం గురించి మీరు తప్పకుండా తెలుసుకోవల్సిందే.
పది నిమిషాల్లో పళ్లు గుల్లవుతాయి: తక్కువ క్యాలరీలు ఉన్న డైట్ డ్రింక్స్ తాగిన తర్వాత మీ దంతాల ఎనామిల్‌పై దాడి జరుగుతుంది. ఆ డ్రింక్స్‌లో ఉండే యాసిడ్ ఎనామిల్ ఉపరితలాన్ని తినేస్తుంది. అంతేకాదు, కృత్రిమ స్వీటెనర్స్ మీ మెదడును కూడా కన్‌ఫ్యూజ్ చేస్తాయి. డైట్ డ్రింక్ తాగగానే మీరు చక్కెర పానీయం తాగరని భావించి ప్రాసెసింగ్ ప్రక్రియ మొదలుపెడుతుంది. అది మరింత నష్టాన్ని కలిగిస్తుందట.
20 నిమిషాల తర్వాత..: డైట్ డ్రింక్ తాగిన 20 నిమిషాల తర్వాత మీ శరీరం కొవ్వును నిల్వ చేసే ప్రక్రియను మొదలుపెడుతుందని ‘నర్స్ హెల్త్’ స్టడీ వెల్లడించింది. ఈ ప్రక్రియ వల్ల ఆ డ్రింక్ తాగినవారిలో బ్లడ్ ప్రెజర్, టైప్-2 డయాబెటిస్ రిస్క్ పెరుగుతుంది.
40 నిమిషాల తర్వాత..: డైట్ డ్రింక్‌ను తాగిన తర్వాత.. అది మిమ్మల్ని తాగడం మొదలుపెడుతుంది. మిమ్మల్ని అడిక్ట్ అయ్యేలా చేస్తుంది. చెప్పాలంటే.. అది ‘కొకైన్’ తరహాలో వ్యసనంలా మారేలా ప్రేరేపిస్తుంది. డైట్ డ్రింక్‌లో ఉండే కెఫిన్, అస్పర్టమే(caffeine, aspartame) వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పానీయం రోజూ తీసుకున్నట్లయితే.. అందులో నుంచి విడుదలయ్యే ‘ఎక్సిటోటాక్సిన్’లు మీ మెదడును నిర్వీర్యం చేయగలవని అధ్యయనాలు హెచ్చరించాయి.
Also Read: వీర్య దానంతో డబ్బే డబ్బు, ఇలా చేస్తే మీరూ సంపాదించవచ్చు!
గంట తర్వాత..: డైట్ కోక్ వంటి పానీయాలు ఎక్కువ ఆకలి, దాహాన్ని కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. మీకు గతంలో ఎన్నడూ లేనంత ఆకలి వేసేలా చేస్తాయన్నారు. డైట్ డ్రింక్ మిమ్మల్ని డీహైడ్రేట్, చిరాకు కలిగిస్తాయి. అయితే, డైట్ డ్రింక్‌ను మితంగా తీసుకుంటే పర్వాలేదు. కానీ, ప్రతిరోజు తాగితే మాత్రం ప్రమాదమే. పైగా డైట్ డ్రింక్ మితంగా తీసుకోవడం వల్ల ప్రయోజనాలు కూడా ఉంటాయని మరికొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి, అతి ఎప్పటికీ ప్రమాదమే. కాబట్టి, అప్పుడప్పుడు మాత్రమే ఈ డ్రింక్ తీసుకోండి.
Also Read: ఇట్స్ బాయ్ థింగ్, అబ్బాయిలూ ఉదయాన్నే అలా జరక్కపోతే, త్వరగా చచ్చిపోతారట!
గమనిక: వివిధ అధ్యయనాలు, నిపుణులు, హెల్త్ ఆర్టికల్స్‌లో పేర్కొన్న వివరాలను మీ అవగాహన కోసం యథావిధిగా అందించాం. ఇందులో అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.