News
News
X

Cancer: పిల్లల్లో పెరిగిపోతున్న క్యాన్సర్ కేసులు- లక్షణాలు ఏంటి? గుర్తించడం ఎలా?

పెద్దలనే కాదు పిల్లలను కూడా క్యాన్సర్ ప్రభావితం చేస్తుంది. దేశంలో రోజు రోజుకీ క్యాన్సర్ కేసులు పెరిగిపోతూ ఉన్నాయి.

FOLLOW US: 
Share:

అనేక వ్యాధులను అదుపుచేయటంలో గణనీయమైన విజయం సాధించిన భారతదేశానికి క్యాన్సర్ వ్యాధి ఒక సవాలుగా మారింది.  భారత్ లో ఏటా 50,000 మంది పిల్లలు వివిధ రకాల కాన్సర్లతో బాధపడుతున్నారు. ఇతర దేశాల్లో 80-90% మంది పిల్లలు క్యాన్సర్ ను జయిస్తే, మన దేశంలో మాత్రం 60 శాతం వరకే చేరుకోగలుగుతుంది. అందుకు కారణం రోగనిర్థారణ ఆలస్యం కావడం. మరికొంతమందికి ఆర్థికస్థితి, సామాజిక భావోద్వేగాలకు గురి కావడం వల్ల చికిత్సను మధ్యలోనే వదిలేస్తున్నారు. అందుకే ప్రజల్లో  కాన్సర్లపై అవగాహన కల్పించేందుకు ఏటా ఫిబ్రవరి 15న 'ప్రపంచ చిన్నపిల్లల క్యాన్సర్ అవగాహన దినోత్సవం'గా పాటిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2023 సంవత్సరానికిగాను “క్లోజ్ ది కేర్ గ్యాప్" నినాదాన్ని ఎంచుకుంది. 

14 ఏళ్ల లోపు వచ్చే క్యాన్సర్ ను చైల్డ్ హుడ్ క్యాన్సర్ అని అంటారు. పిల్లల్లో క్యాన్సర్ ను ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. అప్పుడే త్వరగా చికిత్స అందించి నయం చేయవచ్చని వైద్యులు నిపుణులు సూచిస్తున్నారు. చిన్నపిల్లల క్యాన్సర్ అవేర్‌నెస్ డే సందర్భంగా కామినేని హాస్పిటల్స్ సీనియర్ పీడియాట్రిక్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఎస్ జయంతి క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయో చెప్పారు. 

పిల్లల్లో క్యాన్సర్ లక్షణాలు

అలసట, తలనొప్పి, కీళ్లనొప్పి, వాపు, జ్వరం లేదా రాత్రిపూట చెమటలు పట్టడం, మెడ లేదా చంకలలో వాపు లేదా శోషరస కణుపులు, సులభంగా గాయపడటం, రక్తస్రావం వంటివి ముఖ్య లక్షణాలు. వీటిలో ఏవైనా ఉన్నట్లయితే వీలైనంత త్వరగా పీడియాట్రిక్ ఆంకాలజిస్ట్ నుంచి వైద్య సలహా పొందడం చాలా అవసరమని ఆమె తెలిపారు. 
“చిన్న పిల్లల క్యాన్సర్ గురించి తల్లిదండ్రులు ఈ విషయాల గురించి తప్పకుండా తెలుసుకోవాలని డాక్టర్ జయంతి సూచించారు. అనారోగ్య సమస్యలు, తరచుగా వచ్చే ఇన్ఫెక్షన్‌లు, తీవ్రమైన వైరల్ ఇన్‌ఫెక్షన్‌లు, బరువు తగ్గడం లేదా ఆకలి లేకపోవడం, తలనొప్పి లేదా తట్టుకోలేని జ్వరం వంటివి పిల్లల్లో కనిపించే క్యాన్సర్‌కు కారణాలు కావచ్చు. తల్లిదండ్రులు వీటిపై అశ్రధ్ద చూపకుండా వీలైనంత త్వరగా వైద్య సలహా తీసుకోవాలని డాక్టర్ జయంతి చెప్పుకొచ్చారు.

క్యాన్సర్ రకాలు 

లుకేమియా, లింఫోమాస్, ప్రాణాంతక ఎపిథీలియల్ నియోప్లాజమ్స్, వెన్నుపాము కణితులు, మూత్రపిండాల కణితులను అత్యంత సాధారణ క్యాన్సర్ రకాలుగా చెప్పవచ్చు. పిల్లలలో కనిపించే ప్రధాన క్యాన్సర్లు లుకేమియా, ఎవింగ్ సార్కోమా వంటి మెదడు/వెన్నెముక కణితులు. పిల్లలలో ఇటీవల గుర్తించబడిన కొత్త రకాల క్యాన్సర్లలో లుకేమియా, లింఫోమా కూడా ఉన్నాయి. శరీరంపై అసాధారణ గడ్డలు, నిరంతర తలనొప్పి లేదా వాంతులు, బరువు తగ్గడం లేదా అలసట వంటివి పిల్లల్లో కనిపిస్తే తల్లిదండ్రులు వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఈ చిన్నపాటి క్యాన్సర్‌లకు చికిత్స చేయడానికి ముందస్తుగా గుర్తించడం కీలకం. తల్లిదండ్రులు ఈ లక్షణాల గుర్తించి అప్రమత్తంగా ఉండటం ఎంతో అవసరం.

లుకేమియా వంటి రక్త క్యాన్సర్‌లను నిర్దారించడానికి అనుభవైజ్ఞులైన వైద్యులచేత రోగ నిర్ధారణ కోసం ఎముక మజ్జ పరీక్షలు అవసరం ఉంటాయి. ఎర్ర రక్త కణాల కౌంట్ కొన్ని రకాల బాల్య క్యాన్సర్‌ని నిర్ధారించడానికి వైద్యులు ఉపయోగించే ముఖ్యమైన సూచికలు. తల్లిదండ్రులు, సంరక్షకులు చిన్న వయస్సు పిల్లల్లో వచ్చే క్యాన్సర్ సంకేతాల గురించి తెలుసుకోవడం, తద్వారా వారు ఏవైనా లక్షణాలు గుర్తించినట్లయితే త్వరగా వైద్య సలహా పొందవచ్చు. ముందస్తుగా క్యాన్సర్ ను గుర్తించడం ద్వారా వారి జీవితాలను రక్షించవచ్చు. ఏటా  ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది చిన్నారులు రెటినోబ్లాస్టోమా అనే కంటి క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఈ వ్యాధి కంటి క్యాన్సర్ లో  అత్యంత సాధారణ రకం.  ఒకేసారి రెండు కళ్ళను కూడా ప్రభావితం చేస్తుంది. కంటి చూపులో కనిపించే తెల్లటి మెరుపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కంట్లో ఎరుపు, వాపు, ఒకటి లేదా రెండు కళ్ళలో నొప్పి వంటివి గమనించినట్లయితే వైద్యున్ని సంప్రదించాలి.

Also Read: ఫ్లూ బారిన పడినప్పుడు ఈ తప్పులు అసలు చేయొద్దు, ఇలా రక్షణ పొందండి

Published at : 15 Feb 2023 12:41 PM (IST) Tags: Cancer Cancer symptoms Cancer Treatment Children Health Children Cancer

సంబంధిత కథనాలు

Red Meat: రెడ్ మీట్ అతిగా తింటున్నారా? జాగ్రత్త ప్రాణాలు తీసే ఈ వ్యాధులు వచ్చేస్తాయ్

Red Meat: రెడ్ మీట్ అతిగా తింటున్నారా? జాగ్రత్త ప్రాణాలు తీసే ఈ వ్యాధులు వచ్చేస్తాయ్

Gut Health:స్వీట్స్ తినాలనే కోరిక ఎక్కువగా ఉంటుందా? అందుకు కారణం ఇదే

Gut Health:స్వీట్స్ తినాలనే కోరిక ఎక్కువగా ఉంటుందా? అందుకు కారణం ఇదే

Womans Health: మహిళలూ మీ వయసు నలభై దాటిందా? ఈ రోగాలు దాడి చేసే ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త

Womans Health: మహిళలూ మీ వయసు నలభై దాటిందా? ఈ రోగాలు దాడి చేసే ప్రమాదం పొంచి ఉంది జాగ్రత్త

Sore Curd: పులిసిన పెరుగు పడేస్తున్నారా? ఈ ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు

Sore Curd: పులిసిన పెరుగు పడేస్తున్నారా? ఈ ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు

Food Habits: మీ ఆహారపు అలవాట్లు ఇలా ఉంటే రోగాల భయమే ఉండదు

Food Habits: మీ ఆహారపు అలవాట్లు ఇలా ఉంటే రోగాల భయమే ఉండదు

టాప్ స్టోరీస్

Revanth Reddy On TSPSC : ప్రశ్నాపత్రాలు పల్లి బఠాణీలు అమ్మినట్లు అమ్మేశారు, టీఎస్పీఎస్సీ కేసును సీబీఐకి బదిలీ చేయాలి- రేవంత్ రెడ్డి

Revanth Reddy On TSPSC : ప్రశ్నాపత్రాలు పల్లి బఠాణీలు అమ్మినట్లు అమ్మేశారు, టీఎస్పీఎస్సీ కేసును సీబీఐకి  బదిలీ చేయాలి- రేవంత్ రెడ్డి

KCR in Khammam: రైతులకు కేసీఆర్ గుడ్‌న్యూస్ - ఎకరానికి 10 వేలు, గంటలోనే నిధులు మంజూరు: సీఎం

KCR in Khammam: రైతులకు కేసీఆర్ గుడ్‌న్యూస్ - ఎకరానికి 10 వేలు, గంటలోనే నిధులు మంజూరు: సీఎం

Orange Re-release: ‘ఆరెంజ్’ రీరిలీజ్ నుంచి వచ్చే ప్రతీ రూపాయి జనసేనకే!

Orange Re-release: ‘ఆరెంజ్’ రీరిలీజ్ నుంచి వచ్చే ప్రతీ రూపాయి జనసేనకే!

Balagam OTT Release Date: ఓటీటీకి వచ్చేస్తున్న ‘బలగం’ - ఇంత త్వరగానా - ఎందులో స్ట్రీమ్ అవుతుంది?

Balagam OTT Release Date: ఓటీటీకి వచ్చేస్తున్న ‘బలగం’ - ఇంత త్వరగానా - ఎందులో స్ట్రీమ్ అవుతుంది?