News
News
X

Bitter Almonds: చేదు బాదంపప్పులు గురించి మీకు తెలుసా? అవి ఆరోగ్యానికి మంచివేనా?

బాదం తింటే బరువు తగ్గుతారని అంటారు. మరి చేదు బాదం తింటే ఏమవుతుంది?

FOLLOW US: 
Share:

ప్రతిరోజు కొన్ని బాదంపప్పు తింటే శరీరానికి సరైన పోషణ అందుతుంది. శక్తిని ఇవ్వడంతో పాటు మెదడుకి ఆరోగ్యాన్ని ఇస్తాయి. నానబెట్టిన బాదంపప్పులు తింటే చాలా మంచిది. తియ్యగా  ఉండటంతో ఎంతో ఇష్టంగా తింటారు. కానీ మీరు ఎప్పుడైనా చేదు బాదంపప్పులు తిన్నారా? అవును బాదం తీపి, కాస్త వగరు రుచిని కలిగి ఉంటాయి. కానీ చేదు బాదం మాత్రం ఘాటైన రుచిగా ఉంటాయి. అయితే చేదుగా ఉన్న బాదం పప్పు తినొచ్చా, ఆరోగ్యానికి మంచిదేనా? అంటే కాదనే అంటున్నారు నిపుణులు.

పోషకాలు ఉన్నప్పటికీ

బాదంలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం, విటమిన్ ఇ, ఫాస్పరస్, రాగి నిండి ఉంటాయి. అందుకే వీటిని శక్తివంతమైన గింజలు అని అంటారు. అయితే బాదం పప్పుల్లో చేదువి కూడా ఉంటాయి. సాధారణ వాటి మాదిరిగానే ఇవి కూడా వాటిని పోలి ఉంటాయి. అందుకే వాటిని గుర్తించడం కష్టం. తిన్న తర్వాత మాత్రమే రుచిని బట్టి తెలుసుకోగలుగుతారు.

మామూలు బాదం మాదిరిగానే వాటిలోని పోషకాలు ఉంటాయి. కానీ మరి చేదు ఎందుకు ఉంటుందంటే.. అందులో కొద్ది మొత్తంలో అమిగ్డాలిన్ ఉంటుంది. ఇది శరీరం తీసుకున్నప్పుడు సైనెడ్ గా మారిపోతుంది. అందుకే చేదు బాదం తీసుకోవడం విషపూరితం అవుతుంది. ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావచ్చు. ఒక వేళ మీరు బాదం తినేటప్పుడు చేదు తగిలితే వాటిని మింగకుండా బయటకి ఉమ్మివేయడం మంచిది.

అధ్యయనాలు ఏం చెప్తున్నాయి?

2011 లో క్లినికల్ టాక్సికాలజీ జర్నల్ లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం పది మందితో కూడిన ఒక బృందం పరిశోధనలు చేసింది. చేదు బాదం తీసుకోవడం వల్ల శరీరంలో సైనైడ్ ఉత్పత్తి అవుతుంది. ఫలితంగా వికారం, వాంతులు, తల తిరగడం, తలనొప్పి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎక్కువ మొత్తంలో చేదు బాదం తీసుకుంటే ప్రాణాంతకం అవుతుందని సదరు అధ్యయనం నిర్థారించింది. 2009లో జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్స్ ప్రచురించిన జర్నల్ కూడ ఇదే విషయాన్ని వెల్లడించింది. చేదు బాదంలో వివిధ పరిమాణంలో ఉంటుందని వాటిని తీసుకోవడం నిజంగా హానికరమని అధ్యయనం చెప్పుకొచ్చింది.

బాదంతో ఇలా చేసుకోండి

భారత్ లో అనేక రకాల బాదం ఉన్నాయి. అవన్నీ రుచిలో ఒకేలా ఉన్నప్పటికీ వాటి పరిమాణం, రంగు, ఆకృతిపరంగా విభిన్నంగా ఉంటాయి. కాలిఫోర్నియా, షాలిమార్, గుర్బంది, ప్రన్యాజ్, ముఖ్దూమ్, మమ్రా, కాగ్జి వంటివి అత్యంత ప్రసిద్ధి బాదం రకాలు. నానబెట్టిన బాదంను పాలుగా చేసుకోవచ్చు. పేస్ట్ గా చేసుకుని కూరల్లో వేసుకోవచ్చు. ఇది కూరకి చిక్కదనం ఇస్తుంది. బాదం కేక్, చాక్లెట్ కోటెడ్ బాదం, బాదం కుకీలు, బాదం హల్వా, ఆల్మండ్ ఫడ్జ్, ఆల్మండ్ బ్రౌనీస్ వంటి స్వీట్ ట్రీట్‌లు వీటితో చేసుకోవచ్చు. బాదం పొడి గ్లూటెన్ రహిత పిండి. ఆల్మండ్ బటర్ ఆరోగ్యకరమైన కొవ్వులతో నిండి ఉంటుంది. బ్రెడ్, శాండ్ విచ్ మీద స్ప్రెడ్ చేసుకుని తింటే రుచిగా ఉంటుంది.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Also Read: కరివేపాకు ఇలా తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అసలు పెరగవు

Published at : 20 Feb 2023 12:27 PM (IST) Tags: Almonds Almonds Benefits Bitter Almonds Bitter Almonds Side Effects

సంబంధిత కథనాలు

Banana Coffee: సోషల్ మీడియాలో కొత్త ట్రెండ్ బనానా కాఫీ- ఇది ఎలా తయారు చేస్తారంటే!

Banana Coffee: సోషల్ మీడియాలో కొత్త ట్రెండ్ బనానా కాఫీ- ఇది ఎలా తయారు చేస్తారంటే!

ఆ వ్యక్తి గొంతులో మొక్కలు మొలిచేశాయ్, ఇదో విచిత్రమైన ఆరోగ్య సమస్య - ప్రపంచంలోనే ఇది తొలికేసు

ఆ వ్యక్తి గొంతులో మొక్కలు మొలిచేశాయ్, ఇదో విచిత్రమైన ఆరోగ్య సమస్య - ప్రపంచంలోనే ఇది తొలికేసు

Diabetes: ఓట్స్ ఇడ్లీ - డయాబెటిస్ వారి కోసం ప్రత్యేకం ఈ బ్రేక్‌ఫాస్ట్

Diabetes: ఓట్స్ ఇడ్లీ - డయాబెటిస్ వారి కోసం ప్రత్యేకం ఈ బ్రేక్‌ఫాస్ట్

రోటీని నేరుగా మంట మీద కాల్చడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా?

రోటీని నేరుగా మంట మీద కాల్చడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందా?

Ragi Cake Recipe: రాగి పిండితో చేసే ఆరోగ్యకరమైన చాక్లెట్ కేక్ - పిల్లలకు హెల్తీ రెసిపీ

Ragi Cake Recipe: రాగి పిండితో చేసే ఆరోగ్యకరమైన చాక్లెట్ కేక్ - పిల్లలకు హెల్తీ రెసిపీ

టాప్ స్టోరీస్

ఎమ్మెల్సీ కవిత జగిత్యాల పర్యటనలో అపశృతి- టూర్ రద్దు చేసుకొని తిరిగి పయనం

ఎమ్మెల్సీ కవిత జగిత్యాల పర్యటనలో అపశృతి- టూర్ రద్దు చేసుకొని తిరిగి పయనం

మంత్రివర్గ విస్తరణలో జగన్ టార్గెట్స్‌ ఇవేనా- మరి సీనియర్లు ఏమనుకుంటున్నారు?

మంత్రివర్గ విస్తరణలో జగన్ టార్గెట్స్‌ ఇవేనా- మరి సీనియర్లు ఏమనుకుంటున్నారు?

నిజామాబాద్‌లో ఫ్లెక్సీ వార్- నిన్న పసుపు బోర్డుపై బీఆర్‌ఎస్‌ సైటర్‌- నిరుద్యోగ భృతి ఎక్కడా అంటూ బీజేపీ కౌంటర్

నిజామాబాద్‌లో ఫ్లెక్సీ వార్- నిన్న పసుపు బోర్డుపై బీఆర్‌ఎస్‌ సైటర్‌-  నిరుద్యోగ భృతి ఎక్కడా అంటూ బీజేపీ కౌంటర్

శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో టెన్షన్ టెన్షన్ - పల్లె రఘునాథ్ రెడ్డి వర్సెస్‌ శ్రీధర్ రెడ్డి

శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో టెన్షన్ టెన్షన్ - పల్లె రఘునాథ్ రెడ్డి వర్సెస్‌ శ్రీధర్ రెడ్డి