Water Workouts: ఈ వాటర్ వర్కౌట్స్ తో మీ బరువు భారం దించేసుకోండి
బరువు తగ్గించుకునేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. ఒకటి తీసుకునే ఆహారంలో మార్పులు అయితే మరొకటి వ్యాయామం.
జిమ్ లేదా ఇంట్లో వ్యాయామాలు చేయడం వల్ల మాత్రమే కాదు నీటి వ్యాయామాలు కూడా ఫిట్ నెస్ అందిస్తాయి. నీటిలో వ్యాయామం చేయడం వల్ల వివిధ ప్రయోజనాలు లభిస్తాయి. స్విమ్మింగ్ చేయడం వల్ల బరువు తగ్గుతారని చాలా మందికి తెలుసు. అది మాత్రమే కాదు ఫిట్ నెస్ సాధించడం కోసం వాటర్ వర్కౌట్స్ బాగా పని చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇది కీళ్లపై ఉత్తమ ప్రభావం చూపుతుంది. నీరు కండరాల బలాన్ని పెంచుతాయి. శరీర గాయాలని నీటి వ్యాయామాలు తగ్గిస్తాయి. ఫిట్ గా ఆరోగ్యంగా ఉండటానికి ఇది అద్భుతమైన ఎంపిక.
వాటర్ వాక్
వాటర్ వాక్ ఆరోగ్యానికి చాలా మంచిది. నీటిలో నడవడం అలవాటు చేసుకుంటే మీరు స్ట్రాంగ్ గా ఉండేందుకు దోహదపడుతుంది. నడుము వరకు పూల్ లో నిలబడి నడవడం స్టార్ట్ చేయాలి. కాలి వేళ్ళ మీద కాకుండా మాదమాల మీద ఒత్తిడి పెట్టి నడిచేందుకు ప్రాధాన్యత ఇవ్వాలి. చేతులు నీటిలో ఉంచి వాటిని ముందుకు వెనుకకు స్వింగ్ చేస్తూ ఉంచాలి. ఇవి మీ కోర్ ని బలంగా మారుస్తాయి.
నీటిని తన్నడం
కాళ్ళు బలంగా మార్చుకోవడానికి కేలరీలు బర్న్ చేసుకోవడానికి వాటర్ కికింగ్ ఉత్తమమైన ఎంపిక. పూల్ అంచుని పట్టుకుని నీటిలో కాళ్ళు వేగంగా ఆడించాలి. నీటి ఉపరితలం మీద కాళ్ళ వేలాడిస్తూ ఉంచాలి. మొదట మెల్లగా చేస్తూ ఆ తర్వత వేగవంతమైన కిక్స్ ఇస్తూ ఉండాలి. ఇవి కేలరీలు కరిగించేందుకు చాలా ఉపయోగపడతాయి. 3 నుంచి 4 నిమిషాల పాటు ఫ్లట్టర్ కికింగ్ చేయాలి. మీకు ఇది అలవాటు పడిన తర్వాత సమయాన్ని పెంచుకుంటూ ఉండవచ్చు.
టక్ జంప్స్
టక్ జంప్ కేలరీలని త్వరగా బర్న్ చేయడానికి ఉత్తమ నీటి వ్యాయామాలలో ఒకటి. ఇది కోర్, లెగ్ కండరాలని బలోపేతం చేయడంలో సహాయపడుతుంది. ఛాతీ ఎత్తు వరకు ఉన్న స్విమ్మింగ్ పూల్ నిలబడి మోకాళ్ళని పైకి కిందకి కదుపుతూ ఉండాలి. రెండు మోకాళ్ళు ఛాతీ వరకు తీసుకురావడానికి ప్రయత్నించండి. పూల్ అడుగున పాదాలు తగలకుండా ఎక్సర్ సైజ్ చేయాలి.
వాటర్ పుషప్
వాటర్ పుషప్స్ చేతులకు మాత్రమే కాదు కాళ్ళ కండరాలని బలాన్ని ఇస్తాయి. పూల్ అంచున నిలబడి చేతులని అంచుకీ పెట్టి పుషప్స్ తీయాలి. ఈ పుషప్స్ ఛాతీ, చేతులు, భుజాలు సమర్థవంతంగా పని చేసేలా చేస్తాయి. నీటిలో బ్యాలెన్స్ చేసుకుంటూ పుషప్స్ తీయాలి. ప్రతి కదలికలో శరీరం నిటారుగా ఉండే విధంగా చూసుకోవాలి.
బరువులు ఎత్తవచ్చు
పూల్ వర్కౌట్ లో బరువులు చేర్చుకుని వ్యాయామం చేయవచ్చు. చేతులు, కాళ్ళు టోన్ చేయడంలో సహాయపడుతుంది. వ్యాయామం సమయంలో ఎక్కువ కేలరీలు బర్న్ చేస్తుంది. అలాగే బరువు తగ్గే ప్రక్రియని వేగవంతం చేస్తుంది. ఛాతీ వరకు నీటిలో ఉండి చేతులతో డంబెల్స్ లేదా మరేదైనా బరువైన వస్తువు ఎత్తుతూ వ్యాయామం చేయవచ్చు. అయితే ఇవన్నీ నిపుణుల సమక్షంలో మాత్రమే చేయాలి.
డాల్ఫిన్
బరువు తగ్గడం కోసం కాళ్ళు, వీపు, కోర్ మీద ఒత్తిడి తీసుకుని కేలరీలు బర్న్ చేయడానికి డాల్ఫిన్ వ్యాయామం అద్భుతమైన మార్గం. 5-6 అడుగుల లోతు ఉన్న స్విమ్మింగ్ పూల్ లో నిలబడాలి. పాదాలు పూల్ నేలపై ఉండేలా చూసుకోవాలి. మీ గడ్డం నీటి పైన ఉండేలా చూసుకోవాలి. చేతులు వెనక్కి తోసుకుంటూ నీటిలో స్విమ్మింగ్ చేస్తూ కాళ్ళు కదిలిస్తూ ఉండాలి. డాల్ఫిన్ మాదిరిగా నీటి లోపలికి బయటకి వస్తూ వ్యాయామం చేయాలి.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.
Also Read: మొన్న ఎరిస్, తాజాగా పిరోలా- ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా కొత్త వేరియంట్