News
News
వీడియోలు ఆటలు
X

గర్భనిరోధక మాత్రల వల్ల రొమ్ము క్యాన్సర్ వస్తుందా?

రెండు గర్భనిరోధక మాత్రలైనా సరే రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని 30 శాతం పెంచుతాయని నిపుణులు హెచ్చిస్తున్నారు. కొత్త అధ్యయనాలు ఈ విషయానికి రుజువులు చూపుతున్నాయి.

FOLLOW US: 
Share:

అమ్మాయిలూ జాగ్రత్త.. గర్భ నిరోధక మాత్రలు, ఇతరాత్ర విధానాలను అతిగా పాటిస్తున్నారా? అలా చేయడం చాలా ప్రమాదకరమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాటి వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు.

ఇంప్లాంట్ లేదా యూఐడీగా పిలిచే ఇంట్రా యూటిరైన్ డివైజ్ తో సహా అన్ని రకాల హార్మోనల్ గర్భనిరోధక విధానాల వల్ల రొమ్ము క్యాన్సర్ ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటికి చెందిన శాస్త్రవేత్తలు ఈ గర్భనిదోధక విధానాల వల్ల క్యాన్సర్ ప్రమాదం 20 నుంచి 32 శాతం వరకు పెరుగుతున్నట్టు చెబుతున్నారు. జర్నల్ ప్లోస్ ఇటీవల ప్రచురించిన ఒక అధ్యయనంలో ఈ వివరాలను పొందుపరిచారు.

యువతుల్లో రొమ్ము క్యాన్సర్ ప్రమాదం ఇప్పటికీ చాలా తక్కువే అని, ఈ పిల్స్ వాడడం ఆపేసిన తర్వాత రిస్క్ కూడా తగ్గుతుందని నిపుణులు వెల్లడించారు. వయసు పైబడిన మహిళల్లోనే రొమ్ము క్యాన్సర్ కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయనేది వాస్తవమని అంటున్నారు.

కేవలం కంబైన్డ్ హర్మోన్లు కలిగిన మాత్రలు వాడిన వారిలో మాత్రమే ఇలా రొమ్ము క్యాన్సర్ ప్రమాదం పెరగవచ్చట. కంబైన్డ్ మాత్రల్లో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ రెండు హార్మోన్ల కాండినేషన్ ఉంటుంది. ఈ రెండు హార్మోన్లు నెలకు ఒకటిగా విడుదలయ్యే అండం మీద ప్రభావం చూపించి గర్భం రాకుండా నిరోధిస్తాయి. ఇవి 99.7 శాతం వరకు విజయవంతంగా గర్భాన్ని నిరోధిస్తాయి.

ఇందుకు విరుద్ధంగా ప్రొజెస్టొజెన్ పిల్స్ గర్భాశయ ముఖద్వారం దగ్గరున్న మ్యూకస్ మందాన్ని పెంచి శుక్రకణాలు గర్భాశయాన్ని చేరకుండా నిరోధిస్తాయి. ఇవి కూడా విజయవంతంగానే పనిచేస్తున్నాయి. ఈ రెండు రకాల పిల్స్ కూడా రకరకాల వేర్వేరు దుష్ప్రభావాలు కలిగిస్తాయి. రొమ్ములు భారంగా అనిపించడం, కొద్దిగా తల తిరుగుతున్నట్లు ఉండడం మాత్రమే కాదు కొంత మందిలో బరువు కూడా పెరుగుతారు. అంతేకాదు కొంత మందిలో మానసిక స్థితి, లిబిడోను కూడా ప్రభావితం చేయవచ్చని అంటున్నారు.

కుటుంబంలో రొమ్ము క్యాన్సర్ హిస్టరీ ఉంటే డాక్టర్లు కాంబినేషన్ పిల్స్ వాడకాన్ని ప్రొత్సహించరు. ప్రత్యేకంగా ఈ పిల్స్ వల్ల రొమ్ము క్యాన్సర్ ప్రమాదం పెరుగుతుందని పూర్తి స్థాయిలో అర్థం కాకపోయినా కొంత కారణమయ్యే ప్రమాదం పొంచి ఉందని మాత్రం భావస్తున్నారు.

ప్లోస్ మెడిసిన్ జర్నల్  లో ప్రచురించిన అధ్యయనంలో రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని గర్భనిరోధక మాత్రలు ఎలా ప్రభావితం సతాయో వివరించారు. 1996 నుంచి 2017 సంవత్సరాల మధ్య ఈ గర్భనిరోధకాలు వాడిని ఎలాంటి జబ్బులేని 18 వేల మంది స్త్రీల ఆరోగ్యచరిత్రను పరిశీలించారు. వీరిలో 20 నుంచి 30 శాతం మందిలో రొమ్ము క్యాన్సర్ ప్రమాదం ఉన్నట్టు కనుగొన్నారు.

రొమ్ము క్యాన్సర్ కు చికిత్స అందించే డాక్టర్ కొట్రినా టెమ్సినైట్ కేవలం ప్రొజెస్టెరాన్ మాత్రమే ఉన్న గర్భనిరోధక మాత్రలు వాడిన మహిళల్లో రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుందని అంటున్నారు. అయితే రెండింటిలో ఎలాంటి పిల్స్ ఉపయోగించినా సరే అవి మానేసిన తర్వాత నెమ్మదిగా వాటి ప్రభావం కూడా శరీరంలో తగ్గిపోతుందని కూడా చెబుతున్నారు.

Also Read: పాలు తాగితే ఎసిడిటీ సమస్య తగ్గుతుందా? అది ఎంతవరకు నిజం?

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Published at : 24 Mar 2023 08:00 AM (IST) Tags: Breast Cancer Contraceptive Pills Estrogen progestogen

సంబంధిత కథనాలు

Memory Loss: లైంగిక జీవితం సంతృప్తిగా లేకపోతే మతిమరపు వస్తుందా? స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Memory Loss: లైంగిక జీవితం సంతృప్తిగా లేకపోతే మతిమరపు వస్తుందా? స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

డయాబెటిక్ కంటి సమస్యలకు కొత్త మందు? కొత్త ఆవిష్కరణలు ఏం చెబుతున్నాయి?

డయాబెటిక్ కంటి సమస్యలకు కొత్త మందు? కొత్త ఆవిష్కరణలు ఏం చెబుతున్నాయి?

Farm Milk Vs Packet Milk: తాజా పాలు Vs ప్యాకెట్ పాలు: ఈ రెండింటిలో ఏది మంచిదో తెలుసా?

Farm Milk Vs Packet Milk: తాజా పాలు Vs ప్యాకెట్ పాలు: ఈ రెండింటిలో ఏది మంచిదో తెలుసా?

Joint Pains: కీళ్ల నొప్పులు వేధిస్తున్నాయా? ఈ ఆహారంతో నొప్పుల నుంచి ఉపశమనం

Joint Pains: కీళ్ల నొప్పులు వేధిస్తున్నాయా? ఈ ఆహారంతో నొప్పుల నుంచి ఉపశమనం

Thyroid Cancer: పదే పదే బాత్రూమ్‌కు పరుగులు పెడుతున్నారా? ఈ లక్షణం క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు

Thyroid Cancer: పదే పదే బాత్రూమ్‌కు పరుగులు పెడుతున్నారా? ఈ లక్షణం క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు

టాప్ స్టోరీస్

Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!

ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!

Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?

Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?