Arthritis: ఆర్థరైటిస్ బాధ నుంచి ఉపశమనం కావాలా? ఈ సూపర్ ఫుడ్స్ మీ డైట్లో చేర్చుకుంటే సరి
కీళ్ల నొప్పుల బాధ జీవితకాలం పడాల్సి ఉంటుంది. వాటి నుంచి ఉపశమనం పొందాలంటే ఆహారంలో మార్పులు చేసుకోవడం కూడా ఒక మార్గం.
వయసు మళ్లిన వారిలో ఎక్కువగా కనిపించే వ్యాధి ఆర్థరైటిస్. మోకాళ్ళు, హిప్ జాయింట్స్ పై ఇది ఎక్కువగా ప్రభావం చూపుతోంది. దీని వల్ల మోకాళ్ళు చాలా ఇబ్బంది పెడతాయి. ఎక్కువ దూరం నడవలేరు, కింద కూర్చోలేరు. ఏం చేసినా కీళ్ల నొప్పులు వేధిస్తాయి. జీవితాంతం మందులు వాడుకుంటూ చెప్పలేనంత మానసిక వేదన అనుభవిస్తారు. కీళ్ల నొప్పుల వల్ల కనీసం రోజువారీ సొంత పనులు చేసుకోవడం కూడా కష్టతరం అవుతుంది. ఆర్థరైటిస్ సాధారణంగా రెండు రకాలుగా ఉంటుంది. ఆస్టియో ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్. వివిధ రకాల పరిస్థితుల వల్ల కీళ్లలో వాపు కనిపిస్తుంది లేదా కండరాలు బలహీనతకి గురవుతుంది. ఆర్థరైటిస్‌కు ఎటువంటి నివారణ లేదు. రోజువారీ ఆహారంలో మార్పులు చేర్చుకోవడం వల్ల కొంతవరకు ఉపశమనం లభిస్తుంది.
కీళ్ల వాపు నుంచి ఉపశమనం కలిగించే ఆహారాలు
- చేపలు
- విత్తనాలు, నట్స్
- పండ్లు, కూరగాయలు
- బీన్స్
- ఆలివ్ నూనె
- తృణధాన్యాలు
ఆర్థరైటిస్ తో బాధపడే వాళ్ళు ప్రాసెస్ చేసిన ఆహారాలు, చక్కెర జోడించిన పదార్థాలు, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్ లు తినకపోవడమే మంచిది. ఈ ఆహారాలు ఆర్థరైటిస్ నొప్పిని మరింత తీవ్రతరం చేస్తాయి.
వ్యాధి లక్షణాలు
ఆర్థరైటిస్ రకాన్ని బట్టి సంకేతాలు వేర్వేరుగా ఉంటాయి. రెంటింటిలోని అత్యంత సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. కీళ్లలో విపరీతమైన నొప్పి, వాపు, నొప్పి ఉన్న ప్రదేశంలో ఎరుపుగా మారడం వంటివి కనిపిస్తాయి.
చికిత్స, వ్యాయామం
ఆర్థరైటిస్ తో బాధపడుతున్న రోగులు కొన్ని సవాళ్ళని ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకు వైద్యులు సూచించేది ఫిజికల్ థెరపీ. వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా నిర్దిష్టమైన వ్యాయామాలు చేయాలి. నొప్పి ఎక్కువగా ఉంటే కొన్ని సార్లు ఐస్ లేదా హాట్ ప్యాక్, మసాజ్ వంటివి చేస్తారు.
ఆక్యుపేషనల్ థెరపీ: రోజువారీ పనులని నిర్వహించడం, ప్రత్యేకమైన పరికరాలు ఎంచుకోవాలి. కీళ్ల మీద ఒత్తిడి పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థరైటిస్ ఉన్న వ్యక్తులు చిన్నగా వ్యాయామం చేయడం ప్రారంభించాలి. అవి చేస్తున్నప్పుడు నొప్పయిలో స్వల్ప కలయిక పెరుగుదల కనిపిస్తుంది కానీ ఫలితం దీర్ఘకాలికంగా ఉంటుంది. నిరంతర శారీరక శ్రమ దీర్ఘకాలిక లక్షణాలను సమర్థవంతంగా తగ్గిస్తుంది. ఆర్థరైటిస్‌తో బాధపడుతున్న చాలా మందికి గుండె జబ్బులు వంటి ఇతర వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. వాటికి తగినట్లుగా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఆర్థరైటిస్, గుండె జబ్బులు ఉన్న వాళ్ళు చేయాల్సిన కార్యకలాపాలు
- నడక
- ఈత
- సైక్లింగ్
ఆరోగ్యకరమైన జీవనశైలి పాటిస్తూ పోషకాలు నిండిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల మెరుగైన జీవితాన్ని పొందవచ్చు.
ఆయుర్వేద చికిత్స
వివిధ రకాల ఆర్థరైటిస్ కోసం అనేక సహజ నివారణలు సూచించబడుతున్నాయి. కొన్ని మూలికా సప్లిమెంట్లు తీసుకోవడం వల్ల నొప్పి, వాపు నుంచి ఉపశమనం పొందవచ్చు.
- బోస్వెల్లియా
- చమోమిలే
- పసుపు
- అల్లం
వంటి వాటిని తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి రక్షణగా ఉపయోగపడతాయి.
చివరిగా సర్జరీ
ఆర్థరైటిస్ రకాన్ని బట్టి కీళ్ల నొప్పులు ఎక్కువగా ఉంటే శస్త్రచికిత్స అవసరం కావచ్చు. ఇది రోగి లక్షణాలు, వధి తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది. శస్త్రచికిత్స చేసిన తర్వాత కూడా అవి విజయవంతం అవుతాయా లేదా అనేది వారి ఆరోగ్యపరస్థితి మీద ఆధారపడి ఉంటుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: టీ, కాఫీలు కాదు - ఉదయాన్నే ఈ పానీయాలు తాగితే బోలెడంత ఆరోగ్యం!
Also Read: భోజనం తర్వాత ఈ పనులు అస్సలు చేయకూడదు