News
News
X

Walking Robot Dogs: పెంపుడు కుక్కల స్థానంలో రోబోటిక్ డాగ్స్, చైనాలో నయా ట్రెండ్! ఎందుకలా?

చైనాలో సరికొత్త ట్రెండ్ మొదలయ్యింది. నిన్న మొన్నటి వరకు మామూలు డాగ్స్ తో వాకింగ్ కు వెళ్లిన చైనీలు, ఇప్పుడు సరికొత్త రోబోటిక్ కుక్కలను వెంట తీసుకెళ్తున్నారు. యువతలో ఈ ట్రెండ్ మరింత పెరిగింది.

FOLLOW US: 

సాధారణంగా ఉదయం లేవగానే చాలా మంది వాకింగ్ కు వెళ్తారు. విశాలమైన మైదానాల్లో లేదంటే ఆహ్లాదకరమైన పార్కుల్లో నడుస్తారు. ఆరోగ్యంతో పాటు ఆహ్లాదాన్ని పొందుతుంటారు. వెళ్తూ వెళ్తూ కొందరు తమతో పాటు పెంపుడు కుక్కలను కూడా తీసుకెళ్తారు. వాటితో కలిసి అలా జాలీగా నడిచి వస్తారు. కానీ, చైనాలో ఇప్పుడు కొత్త ట్రెండ్ మొదలయ్యింది. వాకర్స్ మామూలు డాగ్స్ కు బదులుగా రోబోటిక్ డాగ్స్ ను తీసుకెళ్తున్నారు.

చైనాలో ఎప్పుడో రోబోటిక్ డాగ్స్ అందుబాటులోకి వచ్చాయి. కానీ అవి ఎక్కువగా షాపింగ్ ప్లాట్‌ ఫారమ్‌ లలోనే కనిపించేవి. ప్రస్తుతం వీటిని జనాలు బాగా కొనుగోలు చేస్తున్నారు. పెట్ డాగ్ ప్లేస్ లో వీటిని రీప్లేస్ చేస్తున్నారు. రియల్ డాగ్స్ తో పోల్చితే ఇవే చాలా సౌకర్యవంతంగా ఉన్నట్లు చైనీయులు భావిస్తున్నారు. తమ యజమానులను ఎంతో ప్రేమించే నిజమైన కుక్కలతో రోబోటిక్ డాగ్స్ ఎప్పటికీ సరితూగనప్పటికీ.. వీటితోనూ ప్రయోజనాలు లేకపోలేదు.

ఇటీవల చైనాలో వాకింగ్ కు వెళ్లే వారి చేతిలో చాలా వరకు రోబోటిక్ డాగ్స్ దర్శనం ఇస్తున్నాయి.  మున్ముందు మామూలు డాగ్స్ మాయమై.. వాటి ప్లేస్ లో రోబోటిక్ డాగ్స్ వచ్చి చేరే అవకాశం లేకపోలేదు. నిజమైన డాగ్స్ తో పోల్చితే రోబోటిక్ డాగ్స్ తో పెద్దగా సమస్యలు ఉండవనేది చైనీయుల భావన. రోబో కుక్కలకు ఎలాంటి ఆహారం ఇవ్వాల్సిన అవసరం లేదు. వాటికి స్నానం చేయించాల్సిన పని ఉండదు. మీకు అవసరం లేకపోతే వాటితో సమయం గడపవలసిన అవసరం లేదు.

నిజమైన కుక్కలకైతే సమయానికి ఫుడ్ పెట్టాలి. రోజూ స్నానం చేయించాలి. ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించాలి. సవాలక్ష సవాళ్లు ఎదుర్కొవాల్సి ఉంటుంది.  అసలు కుక్కలతో ఉండే అనుబంధం, ప్రేమ రోబోటిక్ డాగ్స్ తో ఉండకపోయినా.. ఉరుకుల పరుగుల జీవితంలో పెట్ డాగ్స్ మంచి చెడులను పట్టించుకునే స్థితిలో లేమంటున్నారు చైనీయులు. అందుకే రోబోటిక్ డాగ్స్ ను కొనుగోలు చేస్తున్నారు. యాంత్రిక ప్రేమను పొందుతున్నారు.

News Reels

షాంఘై, బీజింగ్ వంటి చైనీస్ నగరాల వీధుల్లో ఇప్పుడు ఎక్కువగా రోబోటిక్ డాగ్స్ దర్శనం ఇస్తున్నాయి. వీటిలో ఎక్కువ భాగం దేశీయంగా ఉత్పత్తి చేయబడినవి. ఈ డాగ్స్ ఫాలోయింగ్, రోలింగ్, సిట్టింగ్, రన్నింగ్, బరువులు మోయడం లాంటి అనేక అంతర్నిర్మిత లక్షణాలను కలిగి ఉన్నాయి. ఒక్కో రోబోటిక్ డాగ్ 5 కిలోల వరకు బరువును మోసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. తలపై ఉన్న కెమెరా ద్వారానే రోబోటిక్ డాగ్ యాక్టివ్ గా ఉంటుంది. ఈ కెమెరా తనకు ఎదురయ్యే  అడ్డంకులను గుర్తించడానికి, వాటిని దాటవేయడానికి, యజమానిని గుర్తించడానికి ఉపయోగపడుతుంది.

చైనీస్ రోబోట్ డాగ్‌ల ధరలు బిల్డ్ క్వాలిటీ, బిల్ట్-ఇన్ ఫీచర్‌లు, బ్యాటరీ లైఫ్ ఆధారంగా 15,000 యువాన్ నుంచి 100,000 యువాన్ వరకు ఉంటుంది. భారత కరెన్సీలో సుమారు రూ. లక్షన్నర నుంచి రూ.11 లక్షల వరకు ఉంటుంది. ఈ డాగ్స్ ఒక్క ఛార్జ్ తో 45 నిమిషాల పాటు పని చేస్తాయి. ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న రోబోటిక్ డాగ్స్ వ్యాపారం మున్ముందు మరింత విస్తరించే అవకాశం ఉంది. రానున్న  రోజుల్లో రోబోటిక్ డాగ్స్ బిజినెస్ బిలియన్ డాలర్లకు చేరుకున్నా ఆశ్చర్యపోవక్కర్లేదు.

Also Read: మీ స్మార్ట్‌ఫోన్‌లో 5G నెట్‌వర్క్‌ను ఇలా యాక్టివేట్ చేసుకోండి!

Also Read: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్ - అందుబాటులోకి ‘స్క్రీన్‌ షాట్ బ్లాకింగ్' ఫీచర్‌!

Published at : 06 Oct 2022 03:46 PM (IST) Tags: china Robot Dogs Walking Robot Dogs Trend in China

సంబంధిత కథనాలు

చర్మం మీద దద్దుర్లా? ఈ ఆయుర్వేద చిట్కాలు ఒకసారి ట్రై చేసి చూడండి

చర్మం మీద దద్దుర్లా? ఈ ఆయుర్వేద చిట్కాలు ఒకసారి ట్రై చేసి చూడండి

Skin Disease: మీ మంచం మీద బెడ్‌షీట్స్‌ను ఉతకడం లేదా? జాగ్రత్త, ఈ భయానక వ్యాధి సోకవచ్చు!

Skin Disease: మీ మంచం మీద బెడ్‌షీట్స్‌ను ఉతకడం లేదా? జాగ్రత్త, ఈ భయానక వ్యాధి సోకవచ్చు!

ఈ లక్షణాలు మీలో కనిపిస్తున్నాయా? అయితే, ‘ఐరన్’ లోపం ఉన్నట్లే!

ఈ లక్షణాలు మీలో కనిపిస్తున్నాయా? అయితే, ‘ఐరన్’ లోపం ఉన్నట్లే!

Ayurvedam: చలికాలంలో రోగనిరోధక శక్తి పెంచే ఆయుర్వేద మార్గాలు ఇవే

Ayurvedam: చలికాలంలో రోగనిరోధక శక్తి పెంచే ఆయుర్వేద మార్గాలు ఇవే

క్వీన్ ఎలిజబెత్ డెత్ మిస్టరీ - చివరి రోజుల్లో ఆమెకు నరకం చూపిన ఆ వ్యాధి ఇదే, ఈ లక్షణాలుంటే జాగ్రత్త

క్వీన్ ఎలిజబెత్ డెత్ మిస్టరీ - చివరి రోజుల్లో ఆమెకు నరకం చూపిన ఆ వ్యాధి ఇదే, ఈ లక్షణాలుంటే జాగ్రత్త

టాప్ స్టోరీస్

Minister Ambati Rambabu : పవన్ సినిమాల్లోనే హీరో, రాజకీయాల్లో పెద్ద జోకర్ - మంత్రి అంబటి రాంబాబు

Minister Ambati Rambabu : పవన్ సినిమాల్లోనే హీరో, రాజకీయాల్లో పెద్ద జోకర్ - మంత్రి అంబటి రాంబాబు

AP: ఏపీలో 6,511 పోలిస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

AP: ఏపీలో 6,511 పోలిస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల

Sharmila Arrest : షర్మిల అరెస్ట్ - పాదయాత్ర ఆపబోనన్న వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు !

Sharmila Arrest :   షర్మిల అరెస్ట్ - పాదయాత్ర ఆపబోనన్న వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు !

Yadamma Raju Engagement: ఓ ఇంటివాడు కాబోతున్న కమెడియన్ యాదమ్మ రాజు, ఎంగేజ్మెంట్ పోటోలు వైరల్

Yadamma Raju Engagement: ఓ ఇంటివాడు కాబోతున్న కమెడియన్ యాదమ్మ రాజు, ఎంగేజ్మెంట్ పోటోలు వైరల్