WhatsApp New Feature: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్ - అందుబాటులోకి ‘స్క్రీన్ షాట్ బ్లాకింగ్' ఫీచర్!
వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్ ను విడుదల చేసింది. ‘స్క్రీన్ షాట్ బ్లాకింగ్’ పేరిట ఈ ఫీచర్ ను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. ఇకపై ఫోటోలు, వీడియోలను స్క్రీన్ షాట్స్ తీసే అవకాశం ఉండదు.
వినియోదారులకు సురక్షితమైన మేసేజింగ్ సౌకర్యాన్ని కలిగించేందుకు ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఎప్పటికప్పుడు కొత్త ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఇప్పటికే పలు ఫీచర్లను అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్.. తాజాగా ‘స్క్రీన్ షాట్ బ్లాకింగ్' ఫీచర్ ను యూజర్లకు పరిచయం చేసింది. ఈ ఫీచర్ వినియోగదారులు ఫోటోలను, వీడియోలను స్క్రీన్ షాట్ తీసుకోకుండా నిరోధిస్తుంది. బెటర్ యూజర్ ఇంటర్ ఫేస్ కోసం వాట్సాప్.. చాలా రోజులుగా పలు రకాల అప్ డేట్స్ మీద పరిశోధన చేస్తున్నది. అందులో భాగంగానే మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ ఈ యాప్ కొన్ని iOS బీటా టెస్టర్‌లకు ‘స్క్రీన్‌షాట్ బ్లాకింగ్’ ఫీచర్‌ను విడుదల చేసింది. ఈ విషయాన్ని WABetaInfo వెల్లడించింది. టెస్ట్‌ఫ్లైట్ బీటా ప్రోగ్రామ్ ద్వారా కొత్త అప్ డేట్ అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపింది. దీని వెర్షన్ ను 22.21.0.71 వరకు తీసుకువస్తుంది.
ఈ ఫీచర్ వినియోగదారుల ఫోటోలను, వీడియోలను స్క్రీన్ షాట్ తీసుకోకుండా నిరోధిస్తుంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ WABetaInfo ఫీచర్ కు సంబంధించి స్క్రీన్ షాట్ ను షేర్ చేసింది. "ఫోటోలు, వీడియోలను స్క్రీన్ షాట్ లు తీయడం, స్క్రీన్ రికార్డింగ్ చేయడం ఇకపై సాధ్యం కాదు" అని WABetaInfo తెలిపింది. ఈ ఫీచర్ ఇప్పటి వరకు కొంత మంది iOS బీటా వినియోగదారులకు మాత్రమే అందుబాటులోకి రాగా.. రాబోయే కొద్ది వారాల్లో మరిన్ని యాక్టివేషన్‌లు జరిగే అవకాశం ఉంది. ఫోటోలు, వీడియోలు డిఫాల్ట్ గా బ్లాక్ చేయబడిన తర్వాత స్క్రీన్ రికార్డింగ్, స్కీన్ షాట్ తీయడాన్ని వాట్సాప్ అనుమతించదు.
📝 WhatsApp beta for iOS 22.21.0.71: what's new?
— WABetaInfo (@WABetaInfo) October 4, 2022
WhatsApp is releasing screenshot blocking for view once images and videos to some beta testers!https://t.co/fXvDQIlSxi pic.twitter.com/tIiR3FpBNs
మెటా CEO మార్క్ జుకర్‌బర్గ్ ఈ నెల ప్రారంభంలో WhatsApp కోసం మూడు కొత్త ప్రైవసీ ఫీచర్‌లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అందులో భాగంగానే ఇటీవల కొంత మంది iOS బీటా వినియోగదారుల కోసం పోల్‌లను సృష్టించే అవకాశాన్నిఅందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ తో, వినియోగదారులు చాట్ చర్యలలో ఒక ఎంట్రీ పాయింట్‌ను చూడగలరు. వారు పోల్ లో భాగంగా గరిష్టంగా 12 ఎంపికలను పెట్టుకునే అవకాశం ఉంది. గ్రూప్ లోని వాళ్లంతా ఈ పోల్ ను చూసే అవకాశం ఉంటుంది.
అటు ఇన్ స్టంట్ వాట్సాప్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కు భారత్ లో భారీ స్థాయిలో వినియోగదారులు ఉన్నారు. దేశ వ్యాప్తంగా 500 మిలియన్లకు పైగా యూజర్లతో.. ప్రపంచంలోనే అత్యధిక యూజర్ బేస్ ను కలిగి ఉంది. ఈ నేపథ్యంలో భారత యూజర్ల కోసం వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తుంది. త్వరలో మరిన్ని ఫీచర్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు మెటా కంపెనీ వెల్లడించింది.
Also Read: వాట్సాప్‌లో కొత్త ఫీచర్ - జూమ్, గూగుల్ మీట్ తరహాలో!
Also Read: వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్, అందుబాటులోకి ఐదు ఫీచర్లు!