అన్వేషించండి

Prostate Cancer: రాత్రివేళ అతిగా మూత్రవిసర్జనకి వెళ్తున్నారా? ఆ క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు!

నిద్రలో పదే పదే టాయిలెట్ కి వెళ్లాల్సి వస్తుందా? అయితే వెంటనే వైద్యులని సంప్రదించాలి లేదంటే భయంకరమైన క్యాన్సర్ బారిన పడొచ్చు.

రాత్రి నిద్రలో ఒకటి లేదా రెండు సార్లు మూత్ర విసర్జనకి వెళ్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా పెద్దవాళ్ళలో ఇది గమనించవచ్చు. కానీ అంతకు మించి ఎక్కువ సార్లు వెళ్తే మాత్రం అది ఆలోచించాల్సిన విషయం. వెంటనే డాక్టర్ ని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అందుకు కారణం ప్రొస్టేట్ క్యాన్సర్ కావచ్చు. ప్రొస్టేట్ అనేది వాల్ నట్ పరిమాణంలో ఉండే గ్రంథి. మూత్రాశయం కింద ఉంటుంది. వీర్యం తయారు చేయడానికి ద్రవాన్ని ఉత్పత్తి చేస్తుంది. రాత్రిపూట అతిగా మూత్ర విసర్జన చేస్తే అది మీ నిద్రని చెడగొట్టడం మాత్రమే కాదు అనారోగ్యానికి సంకేతంగా భవించాలని యూరాలజిస్ట్ సూచిస్తున్నారు. అందుకే నిద్రపోయే ముందు ఈ చిట్కాలు పాటించమని చెబుతున్నారు.

పడుకునే ముందు నీరు తాగొద్దు

నిద్రకి ఉపక్రమించే ముందు నీటిని అతిగా తాగడం వల్ల మధ్యలో మూత్ర విసర్జనకి వెళ్లాల్సి వస్తుంది. పడుకునే ముందు రెండు గ్లాసుల నీరు అసలు తీసుకోవద్దు. ఒకవేళ మూత్ర విసర్జనకి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక గ్లాసు నీరు తాగి పడుకుంటారు చాలా మంది. అలా చేయడం వల్ల మీరు అర్థరాత్రి మళ్ళీ మూత్ర విసర్జనకి వెళ్లాల్సి వస్తుంది. అందుకే పడుకునే ముందు వీలైనంత తక్కువగా ద్రవ పదార్థాలు తీసుకోవడం మంచిది.

మద్యం సేవించవద్దు

కొన్ని పానీయాలు సహజ మూత్రవిసర్జన లక్షణాలు కలిగి ఉంటాయి. అవి శరీరం రెండు నుంచి నాలుగు గంటల తర్వాత ఎక్కువ ద్రవాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఉదాహరణకి కెఫీన్ ఒక సహజ మూత్రవిసర్జన. నిర్దిష్ట సమయంలో ఎక్కువ దర్వాన్ని ఉత్పత్తి చేస్తుంది. మరొకటి బీర్. ఇది అధిక ద్రవ పదార్థాన్ని కలిగి ఉంటుంది. అందుకే నిద్ర పోయే ముందు మద్యం సేవించడం వల్ల కూడా మధ్యలో మూత్రవిసర్జనకి వెళ్లాల్సిన అవసరం ఏర్పడుతుంది.

చెప్పులు

కాళ్ళలో ద్రవం నిలుపుదల సంకేతాలు ఏవైనా ఉంటే మోకాలి ఎత్తులో ఉండే చెప్పులు ధరించి పడుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఫ్యూయిడ్స్ నిలుపుదలని ఎడెమా అని పిలుస్తారు. చాలా మందికి రాత్రిపూట మూత్ర విసర్జన చేయడానికి ఇది ఒక కారణం. చీలమండలు, పాదాలు, కాళ్ళలో వాపు కలిగి ఉండటం ఎడెమా లక్షణాలు. ఎన్ హెచ్ ఎస్ ప్రకారం ఈ ప్రాంతాల్లో ద్రవం ఏర్పడినప్పుడు ఈ పరిస్థితి సంభవిస్తుంది.

శరీరం మూత్రవిసర్జన నిరోధక హార్మోన్ ని తక్కువగా స్రవిస్తుంది. అందుకే కొంతమందికి అసలు నైట్ టైమ్ బాత్ రూమ్ కి వెళ్ళే అవసరం ఉండకుండా హాయిగా నిద్రపోతారు. చిన్న వయసులో ఉన్నప్పుడు ఈ హార్మోన్ రాత్రి ఏడు నుంచి ఎనిమిది గంటలకి విడుదల అవుతుంది. అందుకే 20 నుంచి 30 ఏళ్ల వయసు వాళ్ళు మేల్కోనే సమయంలో ఎక్కువ మంది మూత్ర విసర్జన చేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇది కేవలం పురుషులకి మాత్రమే కాదు స్త్రీలకు కూడా వర్తిస్తుంది. ఇవి పాటించిన తర్వాత కూడ రాత్రిపూట ఎక్కువగా మూత్ర విసర్జన చేయాల్సి వస్తే ఆందోళన కలిగించే అంశమే. హార్మోన్ల అసమతుల్యత లేదా ప్రొస్టేట్ క్యాన్సర్ కి సంకేతం కావచ్చు.

యూకే నివేదిక ప్రకారం ప్రొస్టేట్ క్యాన్సర్ ఎనిమిది మంది పురుషులలో ఒకరిని ప్రభావితం చేసే ఒక వ్యాధి. క్యాన్సర్ స్టేజ్ పెరిగే కొద్ది దీని లక్షణాలు కనిపిస్తాయి. ఈ సంకేతాలు కనిపిస్తే మాత్రం జాగ్రత్తగా ఉండాలి.

⦿ మూత్ర విసర్జన చేయడం కష్టంగా మారడం

⦿ మూత్రం సరిగా రాకపోవడం

⦿ యూరిన్ కి వెళ్ళినా కూడా మూత్రాశయం నిండుగా ఉన్న భావన

⦿ సాధారణం కంటే ఎక్కువగా మూత్ర విసర్జన చేయాల్సి రావడం, ముఖ్యంగా రాత్రి సమయంలో

⦿ అకస్మాత్తుగా మూత్ర విసర్జన

ఈ లక్షణాలు కనిపించినంత మాత్రాన అది క్యాన్సర్ అయి ఉంటుందని అర్థం కాదు. కానీ ఈ లక్షణాలు మాత్రం విస్మరించకుండా వైద్యులని సంప్రదించడం ముఖ్యం.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు. 

Also Read: డిప్రెషన్ నుంచి బయట పడాలంటే ఈ పానీయం తాగండి!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Australia vs India 1st Test : టీమిండియా గ్రేట్‌ కమ్‌ బ్యాక్‌ - ఆస్ట్రేలియా గడ్డపై తొలి టెస్టులో గ్రాండ్ విక్టరీ
టీమిండియా గ్రేట్‌ కమ్‌ బ్యాక్‌ - ఆస్ట్రేలియా గడ్డపై తొలి టెస్టులో గ్రాండ్ విక్టరీ
Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Ram Gopal Varma Latest Updates: రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Australia vs India 1st Test : టీమిండియా గ్రేట్‌ కమ్‌ బ్యాక్‌ - ఆస్ట్రేలియా గడ్డపై తొలి టెస్టులో గ్రాండ్ విక్టరీ
టీమిండియా గ్రేట్‌ కమ్‌ బ్యాక్‌ - ఆస్ట్రేలియా గడ్డపై తొలి టెస్టులో గ్రాండ్ విక్టరీ
Ram Gopal Varma Latest Updates: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?
Andhra Pradesh News Today: 18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
18 రాష్ట్ర స్థాయి రోడ్లకు ప్రయోగాత్మకంగా టోల్ టాక్స్- ఏపీ ప్రభుత్వ ఆలోచన వర్కౌట్ అవుతుందా?
Ram Gopal Varma Latest Updates: రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
రామ్‌గోపాల్ వర్మ అరెస్టు ఖాయమా? ఏపీ పోలీసులు ఏం చెబుతున్నారు? ఆర్జీవీ అడ్వకేట్ వాదన ఏంటీ?
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
Kissik Vs Oo Antava: కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
కిస్సిక్ కాదు... తుస్ - సమంత 'ఊ అంటావా' పాటకే నెటిజన్స్ ఓటు?
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
IPL Auction 2025 Highlights: భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
భారత ఆటగాళ్ల ధాటికి బద్దలైన ఐపీఎల్ బాక్సులు- తగ్గేదేలే అన్నట్టు పోటీ పడ్డ యాజమాన్యాలు
Embed widget