అన్వేషించండి

Ganesh Chaturthi 2025 : వినాయకుడిని ఎన్ని రోజులు ఇంట్లో ఉంచాలి? చవితి వెనుక ఉన్న అపోహలు, వాస్తవాలు ఇవే

Vinayaka Chavithi 2025 : వినాయక చవితి అంటే భక్తి, ఆనందం, కుటుంబం కలిసే పండుగ. కానీ భక్తుల మధ్య కొన్ని అపోహలు ఇంకా ఉంటాయి. నిజాలు ఏమిటో తెలుసుకుంటే ఈ పండుగ మరింత అర్థవంతంగా మారుతుంది.

Ganesh Chaturthi 2025 Myths vs Facts : వినాయకుడిని ఇంటికి తీసుకువస్తే ఎన్నో రోజులు ఉంచాలి? మట్టి విగ్రహాలు పెడితేనే భక్తులకు గణపయ్య బ్లెస్సింగ్స్ అందుతాయా? నిమజ్జనంతో మనకి, వినాయకుడికి బంధం తెగిపోతుందా? వంటి అపోహాలు చాలామందిలో ఉంటాయి. అయితే వాస్తవాలు ఏంటి? మీకున్న అపోహలను క్లియర్ చేసే ఫ్యాక్ట్స్ ఇక్కడ ఉన్నాయి. మీ మైండ్​ని క్లియర్ చేసే నిజాలు తెలుసుకుని హాయిగా వినాయక చవితిని ఎంజాయ్ చేసేందుకు ఇవి హెల్ప్ అవుతాయి.  

నిమజ్జనం ఎప్పుడు చేయాలి?

Myth : వినాయకుడి విగ్రహాన్ని 10 రోజులు ఉంచగలిగితేనే తీసుకురావాలి!!??

Fact : వినాయకుడి విగ్రహాన్ని చాలామంది 10 రోజులు ఉంచాలేమో అనుకుంటారు. కానీ గణనాథుడిని 1.5, 3,5, 7 లేదా 10 రోజుల్లో నిమజ్జనం చేయవచ్చు. పదిరోజులు కచ్చితంగా ఆగాలన్నా రూల్​ లేదు. మీ కంఫర్ట్, కుటుంబ విధానాలు బట్టి స్వామి వారిని ఇంట్లో ఉంచుకోవచ్చు. అనంతరం నిమజ్జనం చేయాలి. అలాగే కొందరు 9, 12 రోజుల్లో కూడా నిమజ్జనం చేస్తారు. 

మట్టి విగ్రహాలే ఎందుకు?

Myth : పండక్కి కేవలం మట్టి విగ్రహాలే పెట్టాలా?

Fact : మట్టి విగ్రహాలు ఎకో ఫ్రెండ్లీ. వినాయకుడిని మళ్లీ నిమజ్జనం చేస్తాము కాబట్టి మట్టి వినాయకుడిని ఎంచుకుంటే మంచిదని చెప్తారు. అయితే నిజమైన భక్తితో పూజిస్తే.. ఎలాంటిదానితో విగ్రహం చేశారనేది పెద్ద మ్యాటర్ కాదు. 

Also Read : ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వద్దు, మట్టి విగ్రహాలే ముద్దు.. ఎకో ఫ్రెండ్లీ వినాయక చవితి చేసేందుకు ఫాలో అవ్వాల్సిన టిప్స్

మోదకాలు కేవలం ప్రసాదమేనా?

Myth : మోదకాలు కేవలం స్వీట్​గా చేసి వినాయకుడికి పెట్టే ప్రసాదమేనా?

Fact : మోదకాలు కేవలం ప్రసాదంగా పెట్టేందుకు చేసే స్వీట్ కాదు. ఇవి వినాయకుడికి ఇష్టమైన ఫుడ్​గా చెప్తారు. ఇవి వివేకం, సంతోషం, సమృద్ధిని సూచిస్తాయని భక్తులు భావిస్తారు.

Also Read : వినాయక చవితి స్పెషల్ రెసిపీ.. ఈజీగా, టేస్టీగా చేసుకోగలిగే ఆవిరి మోదకాలు

నిమజ్జనంతో బంధం తెగిపోతుందా?

Myth : నిమజ్జనం చేస్తే గణపతితో బంధం తెగిపోయినట్టేనా?

Fact : నిమజ్జనం చేసి వినాయకుడిని పంపించేస్తే అక్కడితో బంధం తెగిపోతుందా అంటే కాదు. ఈ ప్రక్రియ పుట్టుక, పునర్జన్మని సూచిస్తుంది. వినాయకుడు ప్రతి సంవత్సరం తిరిగి వస్తాడనే నమ్మకాన్ని ప్రజలకు ఇస్తుంది. అందుకే ఇన్నాళ్లు ఎలా ఉన్నా.. ఈ పదిరోజులు చాలామంది సంతోషంగా గడుపుతారని చెప్తారు. 

మహారాష్ట్ర వాళ్లే చేసుకోవాలా?

Myth : వినాయక చవితి కేవలం మహారాష్ట్రవాళ్లకేనా?

Fact : ఈ ప్రశ్న ఎందుకు వస్తుందంటే.. ఛత్రపతి శివాజీ ఈ పండుగను సెలబ్రేట్ చేసుకోవడానికి ప్రధాన కారణం కాబట్టి అక్కడివారు చాలామంది వినాకుడి పండుగ తమకు మాత్రమేనని అనుకుంటారు. కానీ దేశ వ్యాప్తంగా భక్తులు గణపయ్యను పూజిస్తారు. కొన్ని విదేశాల్లో కూడా వినాయకుడిని భక్తి శ్రద్ధలతో ప్రజలు పూజిస్తారు. 

ఈ అపోహలన్నీ పక్కన పెట్టి ఇంటికి వచ్చిన వినాయకుడికి భక్తి శ్రద్ధలతో పూజించండి. ముఖ్యంగా ఎకో ఫ్రెండ్లీ విధానం ఫాలో అయితే పర్యావరణానికి కూడా మంచిది. అలాగే నిమజ్జనం సమయంలో చాలామంది పూజకు ఉపయోగించిన వస్తువులు కూడా నీటిలో వేస్తారు. ఇది నీటి కాలుష్యాన్ని పెంచుతుంది. కాబట్టి పూజకు వినియోగించిన వస్తువులతో కంపోస్ట్ చేసుకోండి. అలాగే వినాయకుడిని మాత్రమే నీటిలో నిమజ్జనం చేస్తే సరిపోతుందని గుర్తించుకోవాలి. 

Also Read : వినాయక చవితిని ఇండియాలో ఎప్పటి నుంచి చేసుకుంటున్నారో తెలుసా? చరిత్ర, ప్రాముఖ్యతలివే

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆమె, డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ (Dr. BRAOU) నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2018లో హైదరాబాద్‌లో ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ ఆమె మూడేళ్లు పనిచేశారు.

తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో ఒక సంవత్సరం పాటు పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశం లో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ అందిస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

VB G Ram G Bill : లోక్‌సభలో వ్యతిరేకత మధ్య వీబీజీ రామ్ జీ బిల్లు ఆమోదం! ప్రతులు చించి నిరసన తెలిపిన ప్రతిపక్షం!
లోక్‌సభలో వ్యతిరేకత మధ్య వీబీజీ రామ్ జీ బిల్లు ఆమోదం! ప్రతులు చించి నిరసన తెలిపిన ప్రతిపక్షం!
Telangana Congress : తెలంగాణలో గాంధీ గరం గరం! బీజేపీ ఆఫీస్‌ల ముట్టడి ఉద్రిక్తత! 
తెలంగాణలో గాంధీ గరం గరం! బీజేపీ ఆఫీస్‌ల ముట్టడి ఉద్రిక్తత! 
YS Jagan:లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
Tirumala News: తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?

వీడియోలు

James Cameron Shoot Varanasi Mahesh Scenes | జేమ్స్ కేమరూన్ డైరెక్షన్ లో వారణాసి మహేశ్ బాబు | ABP
అన్‌క్యాప్డ్ ప్లేయర్లకి అన్ని కోట్లా? చెన్నై ప్లాన్ అదే!
టీమిండియా, సౌతాఫ్రికా మధ్య 4వ t20 నేడు
2019 నాటి స్ట్రాంగ్ టీమ్‌లా ముంబై ఇండియన్స్ కంబ్యాక్
ధోనీ ఆఖరి ipl కి సిద్దం అవుతున్నాడా?

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
VB G Ram G Bill : లోక్‌సభలో వ్యతిరేకత మధ్య వీబీజీ రామ్ జీ బిల్లు ఆమోదం! ప్రతులు చించి నిరసన తెలిపిన ప్రతిపక్షం!
లోక్‌సభలో వ్యతిరేకత మధ్య వీబీజీ రామ్ జీ బిల్లు ఆమోదం! ప్రతులు చించి నిరసన తెలిపిన ప్రతిపక్షం!
Telangana Congress : తెలంగాణలో గాంధీ గరం గరం! బీజేపీ ఆఫీస్‌ల ముట్టడి ఉద్రిక్తత! 
తెలంగాణలో గాంధీ గరం గరం! బీజేపీ ఆఫీస్‌ల ముట్టడి ఉద్రిక్తత! 
YS Jagan:లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
లోక్‌భవన్‌కు చేరిన వైసీపీ కోటి సంతకాల ప్రతులు! సాయంత్రం గవర్నర్‌ను కలవనున్న జగన్
Tirumala News: తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
తిరుమల శ్రీవారి ప్రసాదం తింటే కడుపునొప్పి వస్తుందా? ఎవరీ థామస్ మన్రో?
Telangana Congress: తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
తెలంగాణ పంచాయతీని గెలిపించిన వ్యూహం ఇదే! ఫలితాలపై కాంగ్రెస్ నేతల సరికొత్త విశ్లేషణ!
Sahana Sahana Song Lyrics : ప్రభాస్, నిధి అగర్వాల్ రొమాంటిక్ మెలొడి సాంగ్ - 'సహనా సహనా' క్యూట్ లిరిక్స్
ప్రభాస్, నిధి అగర్వాల్ రొమాంటిక్ మెలొడి సాంగ్ - 'సహనా సహనా' క్యూట్ లిరిక్స్
ISIS Terrorist Sajid Akram: జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
జరిగింది పెళ్లి మళ్లీ మళ్లీ! తన భవిష్యత్‌ను ఊహించి ఆస్తులు భార్యపేరిటన రాసిన ఉగ్రవాది సాజిద్‌ అక్రమ్‌!
Dacoit Teaser : అడివి శేష్ 'డెకాయిట్' టీజర్ వచ్చేసింది - కింగ్ నాగార్జున ఫేమస్ సాంగ్ విత్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్
అడివి శేష్ 'డెకాయిట్' టీజర్ వచ్చేసింది - కింగ్ నాగార్జున ఫేమస్ సాంగ్ విత్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్
Embed widget