Valentine's Week Full List 2022: ‘వాలెంటైన్స్ డే’ వీక్ వచ్చేసింది, ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత, ఈ ‘డే’స్ మిస్ కావద్దు
ప్రేమికుల రోజు కోసం వేచి ఉండే ప్రేమ హృదయాలు ఎన్నో.
ఫిబ్రవరి నెలని ప్రేమ నెలగా పిలుస్తారు. ఎందుకంటే ఆ నెలలో వారం రోజులు ప్రేమికులకే అంకితం. ఫిబ్రవరి 7 నుంచి 14 వరకు పండగే పండగ. రోజుకో ప్రత్యేకత, ఆ ప్రత్యేకతకు తగ్గట్టే బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడాలు, ఎన్నో ఊసులు... అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ప్రేమ హృదయాలు ఉప్పొంగిపోతాయి. ఆ రోజుల ప్రత్యేకతలు ఇవిగో...
ఫిబ్రవరి 7 - రోజ్ డే
ఫిబ్రవరి 8 - ప్రపోజ్ డే
ఫిబ్రవరి 9 - చాకోలెట్ డే
ఫిబ్రవరి 10 - టెడ్డీ డే
ఫిబ్రవరి 11 - ప్రామిస్ డే
ఫిబ్రవరి 12 - హగ్ డే
ఫిబ్రవరి 13 - కిస్ డే
ఫిబ్రవరి 14 - వాలెంటైన్స్ డే
రోజ్ డే
ప్రేమికుల వేడుక మొదలవ్వడానికి మొదటి రోజు ఇదే. ఫిబ్రవరి 7న తాము ప్రేమించినవారికి గులాబీలను అందించి ప్రేమను వ్యక్తం చేస్తారు.
ప్రపోజ్ డే
రెండో రోజు ప్రపోజ్ డే. ఈ రోజున నచ్చిన వారికి లవ్ ప్రపోజ్ చేయచ్చు. లేకపోతే ఫిబ్రవరి 14 వరకు వేచి ఉండచ్చు.
చాకొలెట్ డే
వాలెంటైన్ వీక్‌లోని మూడో రోజు చాకొలెట్ డే. ఫిబ్రవరి 9న నిర్వహించుకుంటారు. ఆ రోజును ఇష్టమైన వారికి చాకొలెట్ లు పంచుతారు.
టెడ్డీ డే
అమ్మాయిలకు టెడ్డీలంటే చాలా ఇష్టపడతారు. అందుకే అబ్బాయిలంతా ఈ రోజున టెడ్డీ బేర్ బొమ్మలను ఇచ్చి ప్రేమను తెలియజేస్తారు.
ప్రామిస్ డే
అయిదో రోజు ప్రామిస్ డే. ప్రతి బంధానికి నమ్మకమైన వాగ్ధానం చాలా అవసరం. ప్రామిస్‌కు ఉండే విలువ అంతా ఇంతా కాదు. అందుకే దీనికంటూ ఓ రోజును కేటాయించారు.
హగ్ డే
మాటల్లో చెప్పలేని ఎన్నో భావాలను ఓ కౌగిలింతతో చెప్పచ్చు. ఆకాశమంతా ప్రేమను కూడా ఒక్క క్షణం కౌగిలించుకుని అర్థమయ్యేలా చేయచ్చు. అందుకే ఫిబ్రవరి 12న హగ్ డే.
కిస్ డే
ముద్దుకుంటే ప్రాధాన్యత ఇంతా అంతా కాదు. ప్రేమలోని గాఢతను తెలియజేసేందుకు ముద్దు చాలా అవసరం. అందుకే వాలెంటైన్ వీక్‌లో ఏడో రోజు కిస్ డే.
వాలెంటైన్స్ డే
ప్రేమికుల పెద్ద పండుగ ఫిబ్రవరి 14న. మూడో శతాబ్ధపు రోమన్ సాధువు సెయింట్ వాలెంటైన్ జ్ఞాపకార్థం ఈ రోజును నిర్వహించుకుంటాం.
Also Read: ప్రయాణంలో వాంతులు, వికారం వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
Also Read: దానిమ్మ గింజల్లోనే కాదు దాని తొక్కలో కూడా ఎన్నో సుగుణాలు, పొడి చేసి ఇలా వాడుకోండి