అన్వేషించండి

Mouth Freshener : నోటి దుర్వాసన ఇబ్బంది పెడుతుందా? ఈ ఒక్క పదార్థం చాలు దానికి చెక్ పెట్టడానికి

నోటి నుంచి చెడు వాసన వస్తుంటే నలుగురిలో మాట్లాడేందుకు చాలా ఇబ్బంది పడతారు. ఆ సమస్య నుంచి బయట పడాలంటే పసుపు నీటితో ఇలా చేస్తే సరిపోతుంది.

నోటి శుభ్రత చాలా ముఖ్యం. అధికంగా తీపి పదార్థాలు, పేస్ట్రీస్ వంటి వాటిని తరచూ తినడం వల్ల దంతాలు పుచ్చిపోవడం సమస్య తలెత్తుతుంది. పంటి సమస్యలు వస్తే వాటిని భరించడం చాలా కష్టం. అందుకే దంతాలు, నోరు పరిశుభ్రత మీద ప్రత్యేక శ్రద్ధ వహించాలి. నోరి దుర్వాసన పోగొట్టేందుకు మార్కెట్లో మౌత్ వాష్ లు అందుబాటులో ఉన్నాయి. కానీ వాటి కంటే అద్భుతమైన వస్తువు మన వంటింట్లోనే ఉంది. అదే పసుపు. దీంతో నోటి శుభ్రత సింపుల్ గా చేసుకోవచ్చు. ఎన్నో ఔషధ గుణాలు ఉన్న పసుపు ఆరోగ్యం దగ్గర నుంచి అందం వరకి అన్నింటినీ ఇస్తుంది. దీనితో అనేక వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు.

ప్రతి ఒక్కరి ఇంట్లో పసుపు తప్పనిసరిగా ఉంటుంది. నోటి సంరక్షణ, పరిశుభ్రతకి ఇంతకంటే గొప్ప ఔషధం మరొకటి ఉండదు. పసుపులో కర్కుమిన్ అనే ఆర్గానిక్, నాన్ టాక్సిక్ రసాయన సమ్మేళనం ఉంది. ఇందులో  యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటిసెప్టిక్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ లక్షణాల కారణంగానే పసుపు పీరియాంటల్ వ్యాధులు, నోటి క్యాన్సర్‌ల చికిత్సకు అత్యంత ప్రభావవంతమైన పదార్ధంగా మారింది. ఇది మౌత్ వాష్, దంతాల తెల్లబడేలా చేసేందుకు సహకరిస్తుంది. పసుపు కలిపిన నీటితో నోటిని శుభ్రం చేసుకుంటే అనేక ప్రయోజనాలు పొందవచ్చు.

పసుపు నీళ్ళు ఎలా తయారు చేసుకోవాలి?

పసుపు నీటితో నోరు పుక్కిలించడం వల్ల చాలా ప్రయోజనాలు పొందుతారు. వాటిని తయారు చేసుకోవడం కూడా పెద్ద కష్టం ఏమి కాదు. ఒక గ్లాసు కోరు వెచ్చని నీటిని తీసుకుని అందులో ½ టీ స్పూన్ పసుపు వేసుకుని 2 చిటికెళ్ల నల్ల ఉప్పు వేసి కలుపుకోవాలి. లేదంటే ఒక గిన్నెలో కొద్దిగా నీళ్ళు తీసుకుని అందులో పసుపు వేసి బాగా మరిగించుకోవచ్చు. ఆ నీరు గోరువెచ్చగా ఉన్నప్పుడు సాధారణ ఉప్పు కొద్దిగా కలుపుకోవచ్చు కూడా. పళ్ళు తోముకున్న తర్వాత ఈ నీటిని పుక్కిలిస్తే నోరు రోజంతా తాజాగా ఉంటుంది.

పసుపు నీళ్ళతో ప్రయోజనాలు

పసుపు నీటిని పుక్కిలించడం వల్ల నోటి పూతల నుంచి ఉపశమనం లభిస్తుంది. నోటిలో పుండ్లు ఏవైనా ఉండి తినడానికి ఇబ్బందిగా అనిపిస్తే ఈ నీటిని కొద్ది సేపు నోట్లో ఉంచుకుని పుక్కిలించడం వల్ల వారంలోనే అద్భుత ఫలితాలు పొందవచ్చు.

మౌత్ ఫ్రెషనర్ గా

పసుపు నీరు మౌత్ ఫ్రెషనర్ గాను ఉపయోగపడుతుంది. నోటి దుర్వాసన పోగొట్టి మంచి వాసన వచ్చేలా చేయడంలో సహాయపడుతుంది. నోట్లో ఉండే వైరస్, చెడు బ్యాక్టీరియాని చంపుతుంది. చిగుళ్ళని ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడుతుంది.

గొంతు నొప్పి నుంచి ఉపశమనం

కరోనా వైరస్ బారిన పడి కోలుకున్న వారిలో ఎక్కువ మంది గొంతు నొప్పి సమస్యతో బాధపడుతున్నారు. అంతే కాదు సీజనల్ గా వచ్చే జలుబు, ఫ్లూ బారిన పడినప్పుడు కూడా నిరంతరం గొంతు నొప్పి వేధిస్తూనే ఉంటుంది. అటువంటి పరిస్థితితో బాధపడే వాళ్ళకి పసుపు నీళ్ళు ఉపశమనం కలిగిస్తాయి. రోజుకి రెండుసార్లు వీటిని తీసుకోవడం వల్లఅ తక్షణ ఫలితాన్ని అనుభవిస్తారు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.

Also Read: మెరిసే చర్మం కోసం లెమన్ బామ్- ప్రయోజనాలు తెలిస్తే అసలు వదిలిపెట్టరు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

రివర్స్ గేర్‌లో కారు.. ఇంతలో భారీ ప్రమాదం సీసీటీవీ వీడియోరామ్ చరణ్ దర్గా వివాదంపై స్ట్రాంగ్‌గా రియాక్ట్ అయిన ఉపాసనబాచుపల్లిలో కాలకూట విషంగా మారిన తాగు నీళ్లువాలంటీర్ జాబ్స్‌పై ఏపీ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Group 2 Halltickets: తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
తెలంగాణలో గ్రూప్ 2 అభ్యర్థులకు అలర్ట్ - ఆ రోజు నుంచి హాల్ టికెట్ల డౌన్ లోడ్, డైరెక్ట్ లింక్ ఇదే!
Crime News: ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
ఏపీలో తీవ్ర విషాద ఘటన - అప్పుల బాధతో చిన్నారితో సహా కుటుంబం ఆత్మహత్య
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Ek Love Story: ఆమె నిజమైన అర్థాంగి - లివర్ దానం చేసిన భర్తను బతికించుకున్న భార్య - ఖమ్మంలో కంటతడి  పెట్టిస్తున్న యువజంట ప్రేమ కథ
ఆమె నిజమైన అర్థాంగి - లివర్ దానం చేసిన భర్తను బతికించుకున్న భార్య - ఖమ్మంలో కంటతడి పెట్టిస్తున్న యువజంట ప్రేమ కథ
Naga Chaitanya - Sobhita : ఇఫీ వేడుకల్లో నాగచైతన్య - శోభిత సందడి, రెడ్ కార్పెట్ పై ఫోటోలకు ఫోజులు
ఇఫీ వేడుకల్లో నాగచైతన్య - శోభిత సందడి, రెడ్ కార్పెట్ పై ఫోటోలకు ఫోజులు
Embed widget