News
News
వీడియోలు ఆటలు
X

స్టయిల్ పెంచే బ్యాగులు, ఏ బ్యాగ్ ఎప్పుడు?

హ్యాండ్ బ్యాగులు ఎన్ని రకాలు? ఎలాంటి బ్యాగులు ఎప్పుడు వాడాలి? ఎలాంటి బ్యాగులు మన దగ్గర ఉండాలి? ఫ్యాషన్ ఎక్స్పర్ట్స్ ఏం చెబుతున్నారో చూడండి.

FOLLOW US: 
Share:

అమ్మాయిలు చాలా ఇష్ట పడే అక్సెసరీస్ లో హ్యాండ్ బ్యాగ్ కూడా ఒకటి. కరీనా కపూర్ లాంటి సెలబ్రిటిలకైతే బ్యాగ్ కలెక్షన్ ఒక హాబీ.  బ్యాగ్ సూటయింది ఉంటే తప్ప లుక్ పూర్తయినట్టు కాదు. అమ్మాయి బ్యాగ్ అంటే సూపర్ మార్కెట్ అని ఒక నానుడి కూడా ఉంది. అందులో పూర్తి ప్రపంచాన్ని చుట్టేస్తుంటారు. కొందరి బ్యాగుల్లో దొరకని వస్తువు ఉండదు. సేఫ్టీ పిన్ నుంచి బిస్కట్లు, వాటర్ బాటిల్ వరకు అన్నింటిని హ్యాండ్ బ్యాగులో సర్దెయ్యగలరు మగువలు. చాలా మంది బ్యాగ్ లేకపోతే భుజం లేనట్టే అంటుంటారు కూడా. ఎన్నో రకాల బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. మరి కొందరు మానసిక నిపుణులైతే మగువలు ఉపయోగించే బ్యాగు సైజు, ఆకారాన్ని బట్టి వారి సైకాలజీ కూడా చెప్పేస్తుంటారు. పార్టీలకు, పెళ్లిల్లకు, ప్రయాణాలకు, షాపింగ్ లకు ఇలా రకరకాల హ్యాండ్ బ్యాగులు సందర్భానికి తగినట్టుగా వాడుతుంటారు.

డఫెల్ బ్యాగ్

ఇది స్థూపాకారంలో కాస్త పొడుగ్గా ఉంటుంది. ఎక్కువ సమాన్లు వెంట ఉంటాయని అనుకుంటే ఇది వెంట తీసుకువెల్లడం మంచిది. జిమ్ కి, వీకెండ్ టూర్స్ కి బావుంటుంది. బ్యాగ్ పెద్దది కనుక అన్ని వస్తువులు సర్దుకునే వీలుంటుంది.

టోట్ బ్యాగ్

ఇది ప్రతి రోజూ ఆఫీసు వినియోగానికి చక్కగా ఉంటుంది. కాలేజీ అవసరాలకు కూడా బాగా సౌకర్యంగా ఉంటుంది. కనుక రోజువారీ బ్యాగ్ గా చెప్పుకోవచ్చు.

క్లచ్

సాయంత్రాలు పార్టీలకు, పొడవాటి గౌన్లు వేసుకున్నపుడు కాస్త మెరుపు కలిగిన క్లచ్ చేతిలో పట్టుకుంటే చాలా అందంగా, స్టయిలిష్ గా కనిపిస్తుంది. నలుపు, మెటాలిక్, బంగారు, వెండి రంగుల్లో ఉండే క్లచ్ లు సాయంత్రం పార్టీలకు చాలా బావుంటాయి. అయితే ఇవి చాలా చిన్నగా ఉంటాయి. కేవలం ఫోను, కాస్త డబ్బులు, కార్డ్ లవంటివి మాత్రమే అమర్చుకునే వీలుంటుంది.

బ్యాక్ పాక్

ఈ మధ్య సౌకర్యంగా ఉండే ఈ బ్యాక్ ప్యాక్ బ్యాగులు చాలా ట్రెండ్ లో ఉన్నాయి. ఇది కాలేజి బ్యాగు రూపాంతరం చెందినట్టు ఉంటుంది. చిన్నచిన్న ట్రిప్పులకు, ఆఫీసులకు, రోజువారీ పనులకు కూడా వాడుకోవచ్చు. రకరకాల సైజుల్లో, రకరకాల మోడల్స్ లో మార్కెట్ లో ఇవి విరివిగా అందుబాటులో ఉన్నాయి. కాస్త ట్రెండీగా కనిపించేవారికి ఈ రకమైన భ్యాగులు మంచి చాయిస్.

స్లింగ్ బ్యాగ్

పొడుగ్గా ఉండే బెల్ట్ తో ఉండే  ఆ బ్యాగ్ టూవీలర్ నడిపే వారికి చాలా సౌకర్యంగా ఉంటుంది. మెడ పైనుంచి భుజం మీదుగా సైడ్ కి తగిలించుకునే వీలుండే ఈ బ్యాగ్ నడవడానికైనా, సైక్లింగ్, బైక్ రైడింగ్ కి చాలా అనువైంది. వివిధ రకాల సైజుల్లో ఇవి అందుబాటులో ఉన్నాయి. లాప్ టాప్  అమర్చుకునే వీలుండే బ్యాగులు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి. చిన్నగా ఫోన్, డబ్బులు మాత్రమే పెట్టుకునే సైజు నుంచి లాప్ టాప్, టిఫిన్ బాక్స్ ల వరకు అన్నీ సర్దేసే సైజు వరకు అన్ని సైజుల్లో దొరుకుతాయి ఇవి.

Published at : 03 May 2023 11:21 AM (IST) Tags: Hand bags styling Best Hand Bag Hand Bags for Women

సంబంధిత కథనాలు

Diabetes: మీ పొట్టే మిమ్మల్ని డయాబెటిస్ నుంచి రక్షిస్తుందట - తాజా స్టడీతో సరికొత్త ఆశలు!

Diabetes: మీ పొట్టే మిమ్మల్ని డయాబెటిస్ నుంచి రక్షిస్తుందట - తాజా స్టడీతో సరికొత్త ఆశలు!

Babies In Lab: గర్భంలో కాదు ల్యాబ్‌లోనే పిల్లల సృష్టి - ఇంకో ఐదేళ్లలో అందుబాటులోకి!

Babies In Lab: గర్భంలో కాదు ల్యాబ్‌లోనే పిల్లల సృష్టి - ఇంకో ఐదేళ్లలో అందుబాటులోకి!

Curd: సమ్మర్‌లో రోజూ పెరుగు ఎందుకు తీసుకోకూడదు? ఎలా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది

Curd: సమ్మర్‌లో రోజూ పెరుగు ఎందుకు తీసుకోకూడదు?  ఎలా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది

Diabetes: మతిమరుపు, మధుమేహానికి దారితీస్తుందా?

Diabetes: మతిమరుపు, మధుమేహానికి దారితీస్తుందా?

ఈ అలవాట్లు మీకున్నాయా? జాగ్రత్త, డయాబెటిస్ రావొచ్చు!

ఈ అలవాట్లు మీకున్నాయా? జాగ్రత్త, డయాబెటిస్ రావొచ్చు!

టాప్ స్టోరీస్

CPI Narayana : సీఎం జగన్‌కు పదవిలో ఉండే అర్హత లేదు - రాజీనామా చేయాలన్న సీపీఐ నారాయణ !

CPI Narayana :   సీఎం జగన్‌కు పదవిలో ఉండే అర్హత లేదు - రాజీనామా చేయాలన్న సీపీఐ నారాయణ !

Telangana News : పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరడం కష్టమే - ఈటల నిర్వేదం !

Telangana News : పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరడం కష్టమే - ఈటల నిర్వేదం !

CSK Vs GT, Final: గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగే - ఇప్పుడు బౌలింగ్ ఎందుకు - ధోని మాస్టర్ ప్లాన్ ఏంటి?

CSK Vs GT, Final: గత నాలుగు మ్యాచ్‌ల్లోనూ బ్యాటింగే - ఇప్పుడు బౌలింగ్ ఎందుకు - ధోని మాస్టర్ ప్లాన్ ఏంటి?

SSMB28 Mass Strike: 20 ఏళ్ల తర్వాత మళ్లీ కబడ్డీ ఆడుతున్న మహేష్!

SSMB28 Mass Strike: 20 ఏళ్ల తర్వాత మళ్లీ కబడ్డీ ఆడుతున్న మహేష్!